విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో, ఈ సోమవారం 14 ఫిర్యాదులు నమోదయాయని విజయవాడ నగరపాలక సంస్థ ఇంచార్జ్ కమిషనర్ డాక్టర్ ఏ మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఇంచార్జ్ కమిషనర్ డాక్టర్ ఎ మహేష్ మాట్లాడుతూ ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన తర్వాత సంబంధిత శాఖాధిపతులు ఆ సమస్యకు ఖచ్చితమైన పరిష్కారాలు ఇచ్చేటట్టుగా చూడాలని, వచ్చిన ఫిర్యాదు పునరావృతం కాకుండా చూసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
ఈ సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అత్యధికంగా పట్టణ ప్రణాళిక సంబంధించినవి ఉన్నాయని తెలిపారు. టౌన్ ప్లానింగ్ 9, ఇంజనీరింగ్ 3, ప్రజా ఆరోగ్య శాఖ మరియు పి వో యు సి డి సంబంధించినవి ఒకటి ఫిర్యాదులు అందాయని తెలిపారు.
ఈ సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఇంచార్జి కమిషనర్ డాక్టర్ ఏ మహేష్ తో పాటుగా అడిషనల్ కమిషనర్ ప్రాజెక్ట్స్ కేవీ సత్యవతి, చీఫ్ ఇంజనీర్ ఎం ప్రభాకర్ రావు, చీఫ్ సిటీ ప్లానెట్ జి వి జి ఎస్ వి ప్రసాద్, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పి రత్నావళి, డిప్యూటీ కమిషనర్ రెవెన్యూ జి సృజన, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ బి సోమశేఖర్ రెడ్డి, డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ రామ్మోహన్, అకౌంట్స్ ఆఫీసర్ బి.సత్యనారాయణమూర్తి, జాయింట్ డైరెక్టర్ అమృత్ లతా పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News