విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కాన్ఫెడరేషన్ ఆఫ్ హెర్బల్ అండ్ ఆయుర్వేదిక్ ఇండస్ట్రీస్(CHAI) ఆధ్వర్యంలో ఈ రోజు విజయవాడ దూబగుంట వారి వీధి,మన ఫర్ కాన్ఫెరెన్సు హాల్ లో ఆయుర్వేదిక్ మాన్యుఫ్యాక్చరర్స్ కి రాష్ట్ర స్థాయి సైంటిఫిక్ వర్కషాప్ జరిగింది. ఇందులో రసఔషధాలు కి సంబంధించి “కుపిపక్వ మరియు భస్మాలు తయారీ విధానం, జాగ్రత్తలు”మరియు ఆయుర్వేద ఔషధాలుకి సంబంధించిన డ్రగ్ అండ్ కాస్మెటిక్ యాక్ట్1940 అండ్ రూల్స్1945 పై అవగాహన,చట్టంలో కొత్తగా వచ్చిన అమెండేమెంట్స్ మరియు మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ ,డ్రగ్ పాలసీ సెక్షన్ ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్లు పై సదస్సు జరిగింది.
ఈ కార్యక్రమంకి అధ్యక్షత వహించిన దూబగుంట శ్రీనివాస్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో ఆయుష్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో నేడు ఇండస్ట్రీ రాష్ట్రంలో వేగంగా అభివృద్ధి చెందుతుందని ఈ సందర్భంగా కమీషనర్, ఆయుష్ డిపార్ట్మెంట్ వారికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే ప్రభుత్వం నుండి ఆయుర్వేద ఇండస్ట్రీ అభివృద్ధికి సహకారాన్ని కోరుతామని అందుకోసం త్వరలో గౌరవనీయులు ముఖ్యమంత్రి, ఆరోగ్యశాఖా మంత్రి ని కలిసి ఆయుష్ ఇండస్ట్రీ అభివృద్ధి కి అవసరమైన విధానాలు పై ఒక సమగ్ర నివేదిక మా అసోసియేషన్ తరుపున అందచేస్తామన్నారు.
సంస్థ రాష్ట్ర ప్రధానకార్యదర్శి,ఇంపీకప్స్ డైరెక్టర్ డా. వేముల భాను ప్రకాష్ మాట్లాడుతూ శృంగి భస్మం పై నిషేధం ఉన్న దృష్ట్యా అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారి ద్వారా ఆయుర్వేద ఔషధ తయారీదారులు కి అవసరం మేర అందిస్తే ప్రజలకి మంచి అద్భుతమైన ఆయుర్వేద ఔషధాలు అందుతాయి కనుక రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఆలోచించాలని కోరారు. మాన్యుఫ్యాక్చరింగ్ కి అవసరమైన రా డ్రగ్స్ మన రాష్ట్రంలో లభించే విధంగా రాష్ట్ర స్థాయిలో పనిచేస్తున్న నేషనల్ మెడిసినల్ ప్లాంట్ బోర్డ్ అధికారులు చర్యలు చేపట్టి ఔషధ తయారీదారులు కి అవగాహన కల్పించేందుకు సహకరించాలి అన్నారు. డ్రగ్ మ్యాజిక్ రెమెడీస్ యాక్ట్1954 లో ఆయుర్వేదo కి అమెండేమెంట్స్ రావాలన్నారు. అల్లోపతి ఔషధాలుకి సంబంధించిన విధివిధానాలు ఈ చట్టం ద్వారా ఆయుర్వేద ఔషధాలుకి వర్తించే అవకాశం చట్టంలో లేదు కనుక చట్టంలో మార్పులు ఆవశ్యకం అన్నారు. చిన్న పరిశ్రమలు ని ఆదుకునే విధంగా లైసెన్స్,జి. యం. పి విషయాలలో కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న నిబంధనలు సరళీకృతం చేయాలన్నారు.
ముఖ్యఅతిధిగా పాల్గొన్న ప్రొఫెసర్ పి. హిమసాగరచంద్ర మూర్తి మాట్లాడుతూ శాస్త్రాన్ని నిరూపించడానికి సైన్స్ అవసరం ఉందన్నారు.గృహవైద్యంగా ఉన్నఆయుర్వేదం నేడు అంతర్జాతీయ వైద్యంగా గుర్తించడం జరిగింది కనుక ఆయుర్వేద ఔషధాల తయారీలో, శాస్త్రం లో ఉన్న రహస్యాలు, వైద్యుల అనుభవాలు సమ్మిళితం చేసుకొని నాణ్యమైన, సురక్షితమైన మందులు ప్రజలకు అందేటట్లు మనుఫ్యాక్చరర్స్ బాధ్యత తీసుకోవాలన్నారు.
డ్రగ్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ పై ఆయుష్ డిపార్ట్మెంట్ మాజీ డ్రగ్ ఇన్స్పెక్టర్ డా. జయలక్ష్మి సభ్యులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించారు. డా.మొహ్మద్ అసిఫ్ భస్మాలు తయారీ లో పద్ధతులు మెలకువలు పై వివరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ గౌరవ అధ్యక్షులు సి. సి. కేశవ రావు, ఎగ్జిక్యూటివ్ సభ్యులు మరియు రాష్ట్రంలో ని అన్ని జిల్లాల నుండి మాన్యుఫ్యాక్చరర్స్ పాల్గొన్నాను.
ఈ సందర్భంగా ప్రొఫెసర్ పి. హిమసాగరచంద్ర మూర్తి, డా జయలక్ష్మి, డా మొహమ్మద్ అసిఫ్ లను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు.
Prajavartha Online Telugu News