Breaking News

ప్రకృతి వ్యవసాయ అమలులో మహిళల పాత్ర అద్భుతం

-మెక్సికో ప్రతినిధుల ప్రశంస

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో రైతు సాధికార సంస్థ “ఏపీసీఎన్ఎఫ్” (ఆంధ్ర ప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయం) ద్వారా అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ కార్యక్రమంలో మహిళా సంఘాల పాత్ర అద్భుతం అని తిరుపతి జిల్లాలో పర్యటిస్తున్న మెక్సికో దేశ ప్రతినిధి బృందం ప్రశంసించింది. ఈ రోజు (16, సెప్టెంబర్) మెక్సికో ప్రభుత్వ ఏరియా డైరెక్టర్ డియాజ్ మరియానేటివిటీ నేతృత్వంలో మెక్సికో బృంద సభ్యులు తిరుపతిలోని ఓ హోటల్ లో రైతు సాధికార సంస్థ అధికారులతో తమ మొదటి రోజు క్షేత్ర సందర్శనపై తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. మహిళలు వ్యవసాయంలో, ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయ కార్యక్రమ అమలులో చురుకైన పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. మహిళల సంఘటిత శక్తి ఏపీసీఎన్ఎఫ్ కార్యక్రమాన్ని ముందుకు తెసుకెళ్లడంలో క్రియాశీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. మెక్సికో దేశంలో మాదిరి కాకుండా ఇక్కడి ప్రభుత్వం సన్న, చిన్నకారు రైతులకు మద్ధతు నివ్వడం బాగా ఆకట్టుకొందని అన్నారు. ప్రభుత్వం సామాజిక కార్యక్రమాల ద్వారా ప్రజా సమూహాలను శిక్షణలతో బలోపేతం చేస్తూ వినూత్న కార్యక్రమాలను అమలు చేయడం శుభ పరిణామం అన్నారు.
అనంతరం వై. వి. పాలెం మండలంలోని ఉదయ్ మాణిక్యం గ్రామంలో గ్రామ ఐక్య సంఘ ప్రతినిధులతో ముచ్చటించారు. ఈ సంధర్భంగా మహిళా ప్రతినిధులు ప్రకృతి వ్యవసాయ అమలులో తమ పాత్రను వివరించారు. ప్రకృతి వ్యవసాయం వల్ల కలిగే ఆర్థిక, ఆర్థికేతర ప్రయోజనాలను తెలియజేశారు. ప్రకృతి వ్యవసాయం వల్ల వ్యవసాయ ఖర్చులు తగ్గడమే గాకుండా ఆరోగ్యపరంగా అనేక లాభాలు కలుగుతున్నట్లు మహిళలు మెక్సికో బృందం రసాయన రైతులు ప్రకృతి వ్యవసాయంలోకి రావడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలని మహిళా సంఘ ప్రతినిధులను ప్రశ్నించారు. రసాయన రైతుల్లో మార్పుకు దోహదం చేసే అంశాలను అడిగి తెలుసుకొన్నారు.
అనంతరం బృంద సభ్యులు అదే గ్రామంలో సుధాకర్ అనే ప్రకృతి వ్యవసాయ రైతు మామిడి తోటలో వేసిన పీఎండీఎస్ (ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్), ఏటీఎం (Any Time Money), డ్రాట్ ప్రూఫింగ్ మోడళ్లను సందర్శించారు. ఆ తర్వాత అదే గ్రామంలో రసాయన పద్ధతిలో పండిస్తున్న వి . సుబ్రమణ్యం మామిడి తోటను కూడా సందర్శించి ఫలితాలను అడిగి తెలుసుకొన్నారు. సాయంత్రం చిన్నగొట్టిగల్లు మండలంలోని చట్టేవారి పాలెం గ్రామంలో జి. సుబ్రమణ్యం అనే రైతు వ్యవసాయ క్షేత్రం సందర్శించి ప్రకృతి వ్యవసాయ విధానంలో నిర్వహిస్తున్న ఏటీఎం (Any Time Money),డ్రాట్ ప్రూఫింగ్ మోడళ్లను సందర్శించారు. అనంతరం ఇదే గ్రామంలో సరస్వతి ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో అయిదు అంతస్తుల నమూనా ను, ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ విధానం ను కూడా పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో రైతు సాధికార సంస్థ సీనియర్ అధికారులు కె శ్రీ సి. చంద్రశేఖర్, కె. సురేష్ బాబు, స్మిత, డాక్టర్ రాజగోపాల్, సీనియర్ కన్సల్టెంట్ సురేంద్ర రెడ్డి, ప్రాంతీయ సాంకేతిక అధికారి రవిచంద్ర ప్రసాద్, ఏపీసీఎన్ఎఫ్ తిరుపతి జిల్లా ప్రాజెక్టు మేనేజర్ షణ్ముగం, అదనపు మేనేజర్ పట్టాభి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *