Breaking News

స్వర్ణ ఆంధ్రా @2047 సాధన కోసం మండల స్థాయి ప్రణాళికలు అందజేయాలి

-100 రోజులు, వార్షిక, ఐదేళ్ళ ప్రణాళికలతో ప్రతి శాఖ నివేదిక రూపొందించాలి
-వ్యవసాయ అనుబంధ, పర్యటక, పరిశ్రమల, విద్య వైద్య, ఇతర శాఖలు 2047 లక్ష్య సాధన పై దృష్టి పెట్టాలి
-జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
స్వర్ణ ఆంధ్రా @2047 లక్ష్య సాధనకు అనుగుణంగా జిల్లా స్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేసుకుని వాటిని మండల, మునిసిపల్ స్థాయి లో ఆచరణ సాధ్యం చేసేలా కార్యాచరణ ఉండాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు.

గురువారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిరభ్ కుమార్ ప్రసాద్ అమరావతి నుండి జిల్లా కలెక్టరు లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్ధానిక కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరం నుంచి కలెక్టరు, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, వికసిత భారత్ నేపధ్యంలో రాష్ట్రంలో స్వర్ణ ఆంధ్రా @2047 లక్ష్య సాధన కోసం మండల స్థాయి ప్రణాళికలు సెప్టెంబరు నెలాఖరుకి అందజేయాల్సి ఉంటుందన్నారు. అదే క్రమంలో జిల్లా స్థాయి లో సమీకృతం చేసి నివేదిక అక్టోబర్ 15 లోగా అందజేయాల్సి ఉంటుందన్నారు. స్వర్ణ ఆంధ్ర @2047 విజన్ పర్యవేక్షణ మరియు అమలు విధానంలో ఐదేళ్ళ దీర్ఘకాలిక వ్యూహం అమలు చేసేందుకు చొరవ చూపాలని ఆదేశించారు. ఆమేరకు రాష్ట్ర స్థాయిలో నవంబర్ ఒకటవ తేదీన రాష్ట్ర స్థాయిలో ప్రారంభించనున్నట్లు తెలిపారు
ఆ క్రమంలో రానున్న ఐదేళ్ళు కాలంలో 2024 నుంచి 2029 వరకూ ఒక విజన్ తో కూడిన నివేదిక అందచేయాలని పేర్కొన్నారు. జిల్లాలోని ప్రతీ ఒక్క డిపార్ట్మెంట్ వికసిత 2047 లక్ష్య సాధనలో నిర్ణాయక పాత్ర పోషించాల్సి ఉంటుందన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో, పరిశ్రమలు, మానవ వనరులు, వైద్య విధానం, నైపుణ్య అభివృద్ధి లక్ష్యాలు సాధన విషయంలో ఆచరణ సాధ్యం అయ్యే విధంగా ప్రతిపాదనలు అందజేయాల్సి ఉంటుందన్నారు. ఉదాహరణ గా వ్యవసాయ, హార్టీకల్చర్, మత్స్య రంగాల్లో ప్రస్తుతం దిగుబడులు, రానున్న రోజుల్లో అంతర్ సాగు విధానం , అధిక ఆదాయం, ప్రకృతి సాగు విస్తీర్ణం పెంపు, ఖర్చుల నియంత్రణా విధానంలో మార్పు తీసుకొని రావడం వంటి అంశాలను పొందుపరచాల్సి ఉందన్నారు. అదే విధంగా వైద్య సేవలు, పరీక్షలు, నియంత్రణా విధానం, పరీక్షలు పెంపు, మెరుగైన చికిత్స విధానాలు, ప్రవేటు రంగం లో పొందుతున్న చికిత్సా విధానాలు వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి అని స్పష్టం చేశారు. యువతకు ఉద్యోగావకాశాలు కల్పన, పరిశ్రమలకి అవసరమైన నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, గ్రోత్ ఇంజన్, ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్, గుర్తింపు పొందిన ప్రాజెక్టులు వారీగా సమగ్ర వివరాలు అందచేయాలన్నారు. ఈ సమావేశంలో అన్ని ప్రభుత్వ జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి వ్యక్తిత్వ వికాసం ఎంతో అవసరం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ, ఎన్‌టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో విజయవాడ పటమటలంకలోని అదిత్య డిగ్రీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *