Breaking News

కూటమి ప్రభుత్వంలో ప్రజలు సంతోషంగా ఉన్నారు

-మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు షేక్ బాజీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కూటమి ప్రభుత్వం ఏర్పాటై వంద రోజులు పూర్తి అయిన సందర్భంగా ఆదివారం రాజరాజేశ్వరి పేటలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో షేక్ బాజీ పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ వందరోజుల పాలనలో జరిగిన సంక్షేమాన్ని స్థానిక ప్రజలకు వివరించారు. గత వైసిపి ప్రభుత్వం అభివృద్ధిని, సంక్షేమాన్ని, విస్మరించిందన్నారు. కూటమి ప్రభుత్వంలో పెన్షన్ల పెంపు, మెగా డి ఎస్ సి నియామక చర్యలు, డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు, మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ల హామీ ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలను రూపొందించే దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తుందన్నారు. వరద విపత్తు సమయంలో కూటమి ఆధ్వర్యంలో పశ్చిమ శాసనసభ్యులు సుజన చౌదరి బాధితులకు వేగవంతంగా తమ సేవలను అందించారన్నారు ప్రధాని మోదీ నాయకత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సారధ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలతో స్నేహపూర్వక వాతావరణం లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో పయనిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో కూటమినేతలు ముద్రబోయిన దేవకి, వసుంధర, నజియా, మల్లెపు విజయలక్ష్మి, నున్నా కృష్ణ, ఆది, రౌతు వాసు, లింగం శివప్రసాద్, సచివాలయ స్పెషల్ ఆఫీసర్ ఆషా, ప్లానింగ్ సెక్రెటరీ సుధీర్ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *