Breaking News

వ‌ర‌ద బాధితుల‌కి జ‌గ‌న్ ఏమి సాయం చేశాడో డాక్యుమెంట్ రూపంలో చూపించాలి : ఎంపి కేశినేని శివ‌నాథ్

-56వ డివిజ‌న్ లో ఇది మంచి ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మం
-ఎమ్యూన‌రేషన్ పూర్తి.. గురువారం నుంచి న‌ష్ట‌ప‌రిహారం
-ఇది మంచి ప్ర‌భుత్వం అంటున్న 95% ప్ర‌జ‌లు
-స్వ‌చ్ఛందంగా ఇంటికి స్టిక్క‌ర్లు అంటించుకుంటున్న ప్ర‌జ‌లు
-ఇక‌పై వ‌ర‌ద ముంపుకి గురికాకుండా చ‌ర్య‌లు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్నిక‌లు అయిపోయిన త‌ర్వాత కూడా ఎమ్మెల్యే జ‌గ‌న్ ఇంకా రాజ‌కీయాలు మాత్ర‌మే చేస్తున్నాడు. జ‌గ‌న్ నీచ రాజ‌కీయాలు ఆపేసి వాస్త‌వాలు గ్ర‌హించి మాట్లాడాలి. అధికారంలోకి వ‌చ్చిన మొద‌టి వంద రోజుల్లో ఎన్డీయే కూట‌మి ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌కు చేసిన సంక్షేమ అభివృద్ది కార్య‌క్ర‌మాలు డాక్యుమెంట్ రూపంలో చూపిస్తున్నాము…అలాగే జ‌గ‌న్ వ‌ర‌ద బాధితుల‌కి ఏమి సాయం చేశాడో డాక్యుమెంట్ రూపంలో చూపించాల‌ని ఎంపి కేశినేని శివ‌నాథ్ డిమాండ్ చేశారు.

ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం 56 డివిజ‌న్ ఓల్డ్ ఆర్.ఆర్.పేట‌లో ఇది మంచి ప్ర‌భుత్వం కార్యక్ర‌మంలో ఎంపి కేశినేని శివ‌నాథ్ ఎన్డీయే కూట‌మి నాయ‌కులు, కార్య‌క‌ర్తల‌తో క‌లిసి సోమ‌వారం పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ఎన్డీయే ప్ర‌భుత్వం ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు నాయ‌క‌త్వంలో వంద రోజుల్లో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్య‌క్ర‌మాలు వివరించి, ఇది మంచి ప్ర‌భుత్వం స్టిక్క‌ర్ ప్ర‌జ‌ల నివాసాల‌కు అంటించారు. అలాగే ప్రాంతంలోని స‌చివాల‌యాల‌ను సంద‌ర్శించి అక్క‌డ సిబ్బంది, అధికారుల‌కి వ‌ర‌ద బాధితుల పేర్ల న‌మోదు విషయంలో ఎలాంటి అజాగ్ర‌త్త వ‌హించ‌వ‌ద్ద‌ని, బాధితులంద‌రి పేర్లు న‌మోదు చేయాల‌ని సూచించారు.

ఇది మంచి ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంలో భాగంగా ఎంపి కేశినేని శివ‌నాథ్ కొంత‌మంది స్థానికుల‌తో రాష్ట్ర ప్ర‌భుత్వ ప‌నితీరు గురించి అడ‌గ్గా వ‌ర‌ద సాయంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు చేసిన సాయాన్ని గుర్తు చేసుకున్నారు. అలాగే అన్న క్యాంటీన్లు, ఒకేసారి వెయ్యి రూపాయిలు పెంచి పెన్ష‌న్లు అంద‌జేయ‌టం గురించి చెప్ప‌టంతో పాటు ఉచిత ఇసుక విధానం వ‌ల్ల భ‌వ‌న నిర్మాణ కార్మికులంద‌రికీ ప‌నులు వుంటున్న‌ట్లు తెలిపారు. కొంతమంది ఇది మంచి ప్ర‌భుత్వం స్టిక్క‌ర్ నాయ‌కుల ద‌గ్గ‌ర నుంచి తీసుకుని వారింటికి వారే అంటించుకున్నారు.

అనంతరం ఎంపి కేశినేని శివ‌నాథ్ ప్ర‌జ‌ల‌నుద్దేశించి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్ర‌బాబు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అధికారంలోకి వ‌చ్చిన వంద రోజుల్లోనే రాష్ట్రాన్ని ప్ర‌గ‌తి బాట ప‌ట్టించార‌న్నారు. ప‌దిహేను రోజుల క్రితం వ‌ర‌ద‌ల్లో సీఎం చంద్ర‌బాబు తో క‌లిసి ఈ ప్రాంతంలో ప‌ర్య‌టించిన విష‌యాన్ని గుర్తు చేశారు. వ‌ర‌ద ముంపుకి గురైన న‌గ‌రాన్ని సాధార‌ణ స్థితికి తీసుకువ‌చ్చేందుకు 74 ఏళ్ల వ‌య‌స్సులో అలుపు లేకుండా క‌ష్ట‌ప‌డిన చంద్ర‌బాబు నాయ‌క‌త్వంలో మ‌నంద‌రం వుండ‌టం అదృష్టమ‌న్నారు. .

వ‌ర‌ద కార‌ణంగా బుర‌ద మ‌యమైన రోడ్లు, ఇళ్లు శుభ్ర‌ప‌ర్చ‌ట‌మే కాకుండా ఇన్య్సూరెన్స్ క్లైయిమ్ దగ్గ‌ర నుంచి ఇంట్లో పాడైపోయిన ఎల‌క్ట్రిక్ వ‌స్తువులు బాగు చేయించే ప‌నుల‌న్నీ ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో జ‌రుగుతున్నాయన్నారు. అధికారులు ఎమ్యూన‌రేషన్ కూడా పూర్తి చేయ‌టం జ‌రిగింది. గురువారం నుంచి బాధితుల‌కి న‌ష్ట‌ప‌రిహారం అంద‌జేయ‌టం జ‌రుగుతుంద‌ని తెలియ‌జేశారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఎలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితులైన ఎదుర్కొని పరిస్థితుల్ని సాధార‌ణ స్థితికి తీసుకువ‌స్తార‌నేది న‌గ‌ర ప్ర‌జ‌లు స్వ‌యంగా చూశార‌న్నారు.

ఇక వంద‌రోజుల్లోనే ఎన్డీయే కూట‌మి ప్ర‌భుత్వం సీఎం చంద్ర‌బాబు నాయ‌క‌త్వంలో ఏన్నో మంచి ప‌నులు చేయ‌టం జ‌రిగింద‌న్నారు. ఒకేసారి వెయ్యిరూపాయిలు పెంచి నాలుగు వేల రూపాయ‌లు పెన్ష‌న్ అంద‌జేస్తున్న‌ట్లు తెలిపారు. గ‌త ఐదేళ్లుగా ఒక‌టో తారీఖు జీతాలు తీసుకోని ప్ర‌భుత్వ ఉద్యోగులు…ఎన్డీయే ప్ర‌భుత్వంలో ఒక‌టో తేదీనే జీతాలు అందుకుంటున్నార‌న్నారు. నిరుద్యోగ యువతకు 16,437 పోస్టుల‌తో మెగా డీఎస్సీ నోటిఫికేష‌న్ కి తొలి సంతకం చేశాడ‌న్నారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో ప్ర‌జ‌ల ఆస్తుల మింగేసేందుకు తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి ప్రజల ఆస్తులకు రక్షణ క‌ల్పించ‌టం జ‌రిగింద‌న్నారు. నిర్మాణ రంగాన్ని నిలబెట్టేందుకు ఉచిత ఇసుక విధానం తిరిగి అమ‌ల్లోకి తెచ్చిన విష‌యం గుర్తు చేశారు. రాష్ట్రంలో పేద ప్ర‌జ‌ల ఆక‌లి తీర్చేందుకు రెండు విడ‌త‌లుగా అన్న క్యాంటీన్లు ప్రారంభించటం జ‌రిగింద‌న్నారు.

ఇలాంటి మంచి కార్య‌క్ర‌మాలు చేయ‌టం వ‌ల్లే ఇది మంచి ప్ర‌భుత్వం అని ప్ర‌జ‌లే అంటున్నార‌న్నారు. ఇలాంటి ప్ర‌భుత్వమే కావాల‌ని ప్ర‌జ‌లు బ‌లంగా కోరుకుంటున్నట్లు తెలిపారు.. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు పై ప్ర‌జ‌లు పెట్టుకున్న ఆశ‌ల‌కు మూడింత‌లు ఎక్కువ‌గా క‌ష్ట‌ప‌డుతున్నట్లు వివ‌రించారు. ఇక పై భ‌విష్య‌త్తులో ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో డ్రైనేజీ ల‌ను మెరుగుప‌రిచి వ‌ర్షం వ‌స్తే ఒక చుక్క కూడా నిల‌బ‌డ‌కుండా వెళ్లేందుకు చ‌ర్య‌లు తీసుకోబోతున్న‌ట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధినాగుల్ మీరా , మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ , మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ పతావుల్లా గా, వాణిజ్య విభాగ రాష్ట్ర అధ్యక్షులు డూండీ రాకేష్ , తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ప్రసాద్ , ఎన్టీఆర్ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ కరిముల్లా, పశ్చిమ నియోజకవర్గం నాయకులు సోలంకి రాజు , రజావుల్లా , డివిజన్ అధ్యక్షులు ఈశ్వర్ , సందక సురేష్ , షేక్ బడేషా , శ్యాంసుందర్ తదితర ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *