తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఉత్తమ జిల్లా ఎన్నికల అధికారిగా అవార్డును అందుకున్నారు. ఈ మేరకు శనివారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన జాతీయ ఓటర్ల దినోత్సవం 2025 కార్యక్రమంలో బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ పురస్కారాలు- 2024 కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ చేతుల మీదుగా ఉత్తమ జిల్లా ఎన్నికల అధికారిగా అవార్డును కలెక్టర్ వెంకటేశ్వర్ అందుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ను పలువురు అభినందించారు. తిరుపతి జిల్లా …
Read More »Monthly Archives: January 2025
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటర్ గా నమోదు చేసుకోవాలి:నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య
-ఓటు హక్కు పొందిన వారు వంద శాతం ఓటు హక్కును వినియోగించుకోవాలి : జిల్లా సంయుక్త కలెక్టర్ శుభం బన్సల్ -గ్రామీణ ప్రాంత ఓటర్ల వలె పట్టణ ప్రాంత ఓటర్లు కూడా తమ ఓటు హక్కును తప్పక వినియోగించు కోవాలి: విసి ఎస్పీఎంవివి తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరు గా నమోదు కావాలని, 17 సం.లు నిండిన ప్రాస్పెక్టివ్ వారు ఓటర్లుగా నమోదు చేసుకోవాలని, తమ ఓటు హక్కును ఎన్నికలలో ప్రతి ఓటర్ తప్పక …
Read More »76 వ గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లను పరిశీలన
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నందు జరిగే 76 వ గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లను శనివారం సాయంత్రం జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ సంయుక్త కలెక్టర్ ఏ. భార్గవ్ తేజ తో కలసి పరిశీలించారు. పెరేడ్ గ్రౌండ్ లోని డయాస్ , వివిధ శాఖలు ఏర్పాటు చేస్తున్న స్టాల్స్ , విఐపి గ్యాలరీ , స్టూడెంట్స్ గ్యాలరీ , పబ్లిక్ గ్యాలరీ , మీడియా గ్యాలరీ లను పరిశీలించి సూచనలు అందించారు. . ఆదివారం ఉదయం 9 …
Read More »డ్రైవర్లు ప్రతినిమిషం అప్రమిత్తంగా ఉండాలి
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : వాహనాలు నడుపే సమయంలో డ్రైవర్లు ప్రతినిమిషం అప్రమత్తంగా ఉండాలని మోటర్ వెహికల్ ఇన్సెపెక్టర్ టి.రాఘవరావు అన్నారు. వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ కళాశాల నందు గుంటూరు జిల్లా రవాణా శాఖ అధ్వర్యంలో రహదారి భద్రత మాసోత్సవాలు 2025 భాగంగా జిల్లాలోని పలు కళాశాలల బస్సు డ్రైవర్లకు అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా మోటర్ వెహికల్ ఇన్సిపెక్టర్స్ కె.మల్లీశ్వరి, ఏ.సంధ్య, జి. సౌజన్య, టి.రాఘవరావు హాజరయ్యారు. ఈ సంధర్బంగా రాఘవరావు మాట్లడుతూ రోడ్లపై …
Read More »మధ్యవర్తిత్వంపై అవగాహాన కోసం రాష్ట్రస్థాయి సదస్సు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : న్యాయవాదులు మధ్యవర్తిత్వ పద్ధతులపై మెలకువలు పెంపొందించుకోవడం ద్వారా కక్షిదారులకు తక్కువ ఖర్చుతో సత్వర న్యాయాన్ని అందించవచ్చని ఆంధ్రప్రదేశ్ న్యాయ సేవాధికార సంస్థ ఎగ్జిక్యూటీవ్ ఛైర్మన్ జస్టీస్ రవినాధ్ తిల్హరి గారు తెలిపారు. శనివారం స్థానిక ప్రభుత్వ వైద్య కళాశాలలోని జింకానా ఆడిటోరియంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర న్వాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మధ్యవర్తిత్వంపై అవగాహాన కోసం న్యాయవాదులకు నిర్వహించిన రాష్ట్రస్థాయి సదస్సులో ఆంధ్రప్రదేశ్ న్యాయ సేవాధికార సంస్థ ఎగ్జిక్యూటీవ్ ఛైర్మన్ …
Read More »ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు 15 వ జాతీయ ఓటర్ల దినోత్సవం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఓటు హక్కు వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు భారత ఎన్నికల సంఘం ప్రతి సంవత్సరం జనవరి 25 వ తేదిన దేశ వ్యాప్తంగా ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ఎస్. నాగలక్ష్మీ పేర్కొన్నారు. శనివారం 15 వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా కలక్టరేట్ లోని ఎస్.ఆర్. శంకరన్ హాల్ లో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ఎస్. నాగలక్ష్మీ జిల్లా ప్రధాన న్యాయమూర్తి …
Read More »ఇంజినీరింగ్, ప్రజారోగ్య, పట్టణ ప్రణాళిక అధికారులకు తగు ఆదేశాలు జారీ…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని తారకరామ నగర్ మెయిన్ రోడ్ విస్తరణ పనులను పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్ అధికారులు సమన్వయంతో వేగంగా చేపట్టాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆదేశించారు. శనివారం కమిషనర్ తారకరామ నగర్, ఎస్వీఎన్ కాలనీ, పెద్ద పలకలూరు రోడ్ తదితర ప్రాంతాల్లో పర్యటించి, అభివృద్ధి, పారిశుధ్య పనులను పరిశీలించి, ఇంజినీరింగ్, ప్రజారోగ్య, పట్టణ ప్రణాళిక అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ తొలుత తారకరామ నగర్ విస్తరణ పనుల పురోగతిపై …
Read More »జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశకు బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ పురస్కారం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశకు బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డు-2024 లభించింది. శనివారం విజయవాడలోని తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో జరిగిన 15వ జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశ.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ చేతులమీదుగా అవార్డు అందుకున్నారు. అత్యంత పారదర్శకంగా ఓటర్ల జాబితా రూపకల్పన, అర్హులైన ప్రతిఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకునేందుకు నిర్వహించే వినూత్న కార్యక్రమాలు, ఓటర్లను జాగృతం చేయడం తదితర అంశాల్లో అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు కలెక్టర్ లక్ష్మీశ …
Read More »బెస్ట్ ఎలక్ట్రోరల్ ప్రాక్టీసెస్ అవార్డు అందుకున్న జిల్లా కలెక్టర్ డీ.కే. బాలాజీ
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : 2024 సంవత్సరానికి బెస్ట్ ఎలక్ట్రోరల్ ప్రాక్టీసెస్ అవార్డును రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అందుకున్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శనివారం నిర్వహించిన 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం (నేషనల్ ఓటర్స్ డే) సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ అవార్డును అందుకున్నారు. గత ఏడాది కృష్ణాజిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారిగా 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణ, తప్పులు లేని, ఖచ్చితమైన ఓటర్ల జాబితా రూపొందించడంలో …
Read More »ఓటు హక్కు పొందడం, ఓటు వేయడం మనందరి బాధ్యత కావాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఓటు హక్కు పొందడం, ఓటు వేయడం మనందరి బాధ్యత కావాలని జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ అన్నారు. 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకుని శనివారం స్థానిక జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్లో జిల్లాస్థాయి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ ఓటర్ల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. మన దేశానికి స్వాతంత్రం రాకముందు అందరికీ ఓటు హక్కు లేదని, అయితే స్వాతంత్రానంతరం 1950లో భారత ఎన్నికల సంఘం ఏర్పడిందని, అందరికీ ఓటు హక్కు కల్పించడంతోపాటు …
Read More »
Prajavartha Online Telugu News