Breaking News

Daily Archives: March 2, 2025

భక్తి శ్రద్ధలతో ప్రారంభమైన తరావీహ్ నమాజ్ లు

-తరావీహ్ నమాజ్ తో గత పాపాల మన్నింపు -మసీదుల్లో నెల రోజుల పాటు తరావీహ్ నమాజ్ లు ఆచరించనున్న ముస్లింలు మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త : పవిత్ర రంజాన్ మాసం శనివారం సాయంత్రం నెలవంక దర్శనంతో ప్రారంభం కావడంతో అదే రోజు రాత్రి ముస్లిం లు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్ధన (తరావీహ్ నమాజ్) లు ప్రారంభించారు. ‘తరావీహ్’ అనే పదానికి ‘విశ్రాంతి తీసుకోవడం అని అర్థం. రంజాన్ సమయంలో ఆరాధనలో ముఖ్యమైన భాగం తరావీహ్ నమాజ్. చివరి రోజువారీ ప్రార్థన అయిన …

Read More »

మరో బేబీని రెస్క్యూ చేసిన ఎన్. టి. ఆర్. జిల్లా పోలీసులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగర పోలీస్ కమిషనర్ ఎస్. వి. రాజా శేఖర బాబు ఐ.పి.ఎస్. కి రాబడిన పక్కా సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ ఏ.డి.సి.పి ఏ. శ్రీనివాస రావు  పర్యవేక్షణలో ఏ.సి.పి. కె. లతాకుమారి, నార్త్ ఏ. సి. పి.  స్రవంతి రాయ్ ఆద్వర్యంలో టాస్క్ ఫోర్స్ మరియు నున్న ఇన్స్పెక్టర్లు వారి సిబ్బందితో కలిసి ది. 01.03.2025 తేదీన సులభంగా డబ్బులు సంపాదించడం కోసం పిల్లలు లేని వారిని/సంతానలేమితో బాధపడుతున్న వారిని లక్ష్యంగా చేసుకుని అక్రమంగా చిన్న …

Read More »

ఈ నెల 8 నుండి 12 వరకు తుడా టవర్స్ లోని రెసిడెన్షియల్ ఫ్లాట్స్ ఈ – వేలం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 8 నుండి 12 వరకు తుడా టవర్స్ లోని రెసిడెన్షియల్ ఫ్లాట్స్ ఆన్ లైన్ నందు ఈ – వేలం ప్రక్రియ నిర్వహించ బడుతుందని తుడా వైస్ చైర్మన్ శ్రీమతి ఎన్.మౌర్య ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి పట్టణములోని అన్నమయ్య సర్కిల్ మరియు ఎయిర్ బైపాస్ రోడ్డు సమీపములో తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థచే ప్రతిష్టాత్మకoగా G+13 అంతస్తులతో తుడా టవర్స్ భవన నిర్మాణాన్ని 3.60 ఎకరాలలో, 8,28,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.345 కోట్ల …

Read More »

అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎన్జీజివో మహిళా విభాగం క్రీడోత్సవాలను జయప్రదం చేయండి

-ఎన్టీజివో మహిళా విభాగం రాష్ట్ర చైర్పర్సన్ కా॥ వి. నిర్మలా కుమారి, కన్వీనర్ కార్ల్ పి. మాధవి పిలుపు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, ప్రతి సంవత్సరం మన ఏ.పి. ఎన్టీజివో సంఘ రాష్ట్ర మహిళా విభాగం పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం అందరికీ తెలిసినదే. ఈ సంవత్సరం కూడా మహిళా ఉద్యోగులకు ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. 2025 మార్చి 4వ తేదీన విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ …

Read More »

నైపుణ్యంతో కూడిన విద్యను అందించాలి

-సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు IAS., విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విద్యార్థుల్లో చదువుతో పాటు వృత్తి విద్యా నైపుణ్యాల పట్ల ఆసక్తిగా కనబరిచేలా ప్రోత్సహించాలని ఒకేషనల్ ట్రైనర్లను ఉద్దేశిస్తూ సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు IAS. అన్నారు. ఆదివారం విజయవాడలోని మేరి స్టెల్లా కాలేజీలో జరుగుతున్న వృత్తి విద్యా శిక్షకులకు (ఒకేషనల్ ట్రైనర్లకు) ఐదు రోజుల పాటు శిక్షణా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీడీ మాట్లాడుతూ.. సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో 9 నుండి …

Read More »

నగరాల కమ్యూనిటీ సభ్యులు, పెద్దలతో సమన్వయ సమావేశం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీశైలంలో నగరాలు సత్రం యొక్క సజావైన పురోగతి కాంక్షిస్తూ పిళ్ళా మోహనరావు ఆహ్వానంపై సత్రం ఫౌండర్‌ కార్యదర్శి కొరగంజి జగన్నాధరావు పాత్రుడు మరియు అధ్యక్షులు నల్లాన సూర్యారావుల చొరవతో ఈ ఆదివారం విజయవాడ గాంధీనగర్‌లోని హోటల్‌ కుబేర గ్రాండ్‌ నందు సత్రం వ్యవస్థాపక సభ్యులు మరియు కొంతమంది కమ్యూనిటీ పెద్దలతో కలిపి సమన్వయ సమావేశం జయప్రదంగా జరిగింది. ఈ సమావేశంలో మొదటిగా కొరగంజి జగన్నాధరావు కుటుంబం నుంచి వచ్చిన భూరి విరాళం పట్ల చాలా మంది వక్తలు …

Read More »

పట్టణాభివృద్ధి, రెవెన్యూ సంస్కరణలను స్వాగతించిన నారెడ్కో

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పట్టణాభివృద్ధి మరియు రెవెన్యూ ప్రక్రియలను సులభతరం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంస్కరణలను నారెడ్కో ఆంధ్ర ప్రదేశ్ శాఖ స్వాగతించింది. వ్యాపార సామర్థ్యాన్ని పెంపొందించడానికి, వేగవంతమైన అనుమతులు, నియంత్రణ పద్ధతులలో పారదర్శకతను సాధించడానికి ఈ విధానపరమైన మార్పులు దోహదపడతాయని విశ్వాసం వ్యక్తం చేసింది. విజయవాడలోని మాలక్ష్మి ఛాంబర్స్‌లో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ సంస్కరణల ప్రభావం గురించి నారెడ్కో ప్రతినిధులు వివరించారు. నారెడ్కో రాష్ట్ర అధ్యక్షుడు గద్దే చక్రధర్ మాట్లాడుతూ రహదారి కనీస వెడల్పును 40 …

Read More »

నూరు శాతం ఆస్తి పన్ను వసూళ్లు జరగాలి… : కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ 

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఆస్తి పన్ను నూరు శాతం వసూళ్లు జరగాల్సిందేనని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆదివారం సెట్ కాన్ఫరెన్స్ ద్వారా డిప్యూటీ కమిషనర్లు, రెవెన్యూ అధికారులు, ఇన్స్పెక్టర్లు, అడ్మిన్ కార్యదర్శులకు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, మార్చి నెల ప్రారంభమైనందున రెవెన్యూ విభాగ ప్రతి అధికారి పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పన్ను బకాయి ఉన్న ప్రైవేట్ ఆస్తుల్లో రూ.165 కోట్లకు ఇప్పటి వరకు రూ.90 కోట్లు …

Read More »

ఘనంగా వైవి రాజేంద్రప్రసాద్ కుమార్తె నిశ్చయ తాంబూలాలు

-హాజరైన ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శాసనమండలి మాజీ సభ్యులు యలమంచిలి బాబు రాజేంద్రప్రసాద్, భ్రమరాంబ దంపతుల కుమార్తె యలమంచిలి స్నేహ , అట్లూరి రాజేష్ నిశ్చయ తాంబూలాల వేడుకలు ఉయ్యూరులోని వారి స్వగృహంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. విజయవాడ పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి ) మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్, మంత్రి కొల్లు రవీంద్ర, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ రావు తదితరులు ఈ వేడుకల్లో పాల్గొని …

Read More »

ఘనంగా ధ్వజస్తంభం ప్రతిష్టాపన

-ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కొత్తపేట లోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి వారి దేవస్థానంలో నూతన ధ్వజ స్థంభం ప్రతిష్ఠాపన కార్యక్రమం ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పూర్ణకుంభంతో ఎమ్మెల్యే సుజనాకు ఘన స్వాగతం పలికారు. వేద పండితుల వేద మంత్రోచ్చరణల నడుమ ధ్వజ స్తంభాన్ని ప్రతిష్టింపచేశారు. ప్రజలందరూ సుఖ …

Read More »