-వేతనదారులు రెండు పూటలూ పనిచేయాలి : జిల్లా కలెక్టర్ డా.బి.ఆర్.అంబేద్కర్ -కెరటాంలో పంటకుంటల(ఫారంపాండ్) పనులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్ -స్వయంగా గునపం చేతబూని పనులు ప్రారంభించిన కలెక్టర్ -ప్రతి మండలంలో మోడల్ ఫారంపాండ్లు నిర్మించాలి విజయనగరం(బొండపల్లి), నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఉపాధిహామీ పనుల్లో పాల్గొనే ప్రతి వేతనదారుకు కనీసం రోజుకు రూ.300 వేతనం వచ్చేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా.బి.ఆర్.అంబేద్కర్ ఉపాధిహామీ సిబ్బందిని ఆదేశించారు. వేతనదారులు ప్రతిరోజూ ఉదయం సాయంత్రం వేళల్లో కనీసం ఆరు గంటలపాటు పనుల్లో పాల్గొనడం ద్వారా …
Read More »Daily Archives: March 22, 2025
మత్స్యకారులకు, చేనేత కార్మికులకు, మహిళలకు, నిరుద్యోగ యువతకు వచ్చే 3 నెలల కాలంలో 50 నుండి 100 కోట్ల రుణాలు ఇవ్వాలి…
-బ్యాంకు ఉన్నతాధికారులను కోరిన ఎంపి బాలశౌరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు జరిగిన దిశా కమిటి సమావేశంలో దిశా కమిటి చైర్మన్, మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి మాట్లాడుతూ మహాత్మా గాంధీ నరేగా పధకం కింద డొంక రోడ్లను కూడా చేర్చాలని, పండించిన పంటను పొలంనుండి రైతన్నలు మార్కెట్ కు తీసుకు వెళ్ళడానికి డొంక రోడ్ల అవసరం చాలా ఉన్నదని, ఈ విషయంలో ఒక నోట్ తయారుచేసి పంపాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ని కోరారు. అలెంకో …
Read More »గవర్నర్ ను కలిసిన ఆంధ్రప్రదేశ్ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 78వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పదిమంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ఆంధ్రప్రదేశ్ లోని వివిధ యూనివర్సిటీ నుంచి న్యూఢిల్లీలో 40 రోజులు పాటు పెరేడ్ చేసి 78వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రగౌరవ గవర్నర్ ని మర్యాదపూర్వకంగా కలిసారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫ్రీ రిపబ్లిక్ పెరేడ్ కంటిన్జెంట్ లీడర్ మరియు ఎన్టీఆర్ జిల్లా ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ కొల్లేటి రమేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు మాట్లాడుతూ …
Read More »గుంటూరు ఎంపీ, కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారి ప్రోత్సాహం
-అమరావతి చిత్ర కళా వీధికి మద్దతు, ఆంధ్రప్రదేశ్ కళాకారుల ఉన్నతికి ప్రశంసలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు ఎంపీ మరియు కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ప్రతిష్టాత్మకమైన అమరావతి చిత్ర కళా వీధికి తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు స్వయంగా చిత్రం గీసి కళాకారులకు ప్రోత్సాహం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక కమిషన్ చైర్‌పర్సన్ తేజస్వి పోడపాటితో కలిసి ఈ గొప్ప కార్యక్రమాన్ని ప్రోత్సహించడంలో ఆయన భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ, “ఆంధ్రప్రదేశ్ లోని కళాకారుల …
Read More »వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర @ 2047 లక్ష్య సాధన దిశగా ముందడుగు వేద్దాం
– లక్ష్యాల సాధనలో అధికారులే రథ సారథులు – వికసిత్ ఎన్‌టీఆర్ జిల్లా సాకారానికి సమష్టిగా కృషిచేద్దాం – ఇరవై సూత్రాల కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ లంకా దినకర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర @ 2047 లక్ష్య సాధన దిశగా ముందడుగు వేద్దామని.. లక్ష్యాల సాధనలో అధికారులే రథ సారథులని ఇరవై సూత్రాల కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ లంకా దినకర్ అన్నారు. శనివారం లంకా దినకర్ అధ్యక్షతన కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ …
Read More »టిడ్కో ఇళ్లు పంపిణీ పై కూటమి ప్రభుత్వం జాప్యం
-ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోని వైనం.. -లబ్దిదారులకు టిడ్కో ఇళ్ళు వెంటనే పంపిణీ చేయాలి .. -లేనిపక్షంలో సీపీఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున గృహ ప్రవేశాలు చేపడతాం.. -సీపీఐ నగర కార్యదర్శి జి. కోటేశ్వరరావు -టిడ్కో ఇళ్లును పరిశీలించిన సీపీఐ నగర సమితి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : లబ్దిదారులకు టిడ్కో ఇళ్లు పంపిణీలో కూటమి ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోందని సీపీఐ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు మండిపడ్డారు. శనివారం సీపీఐ నగర సమితి ఆధ్వర్యంలో జక్కంపూడి, వేమవరం టిడ్కో ఇళ్లును వారు …
Read More »ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉగాది కార్యక్రమం ఏర్పాట్లపై పరిశీలన
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : తుళ్లూరు మండలం వెలగపూడి గ్రామంలో రాష్ట్ర సచివాలయం సమీపంలో 30వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉగాది కార్యక్రమంలో, ప్రజలు దాతలు ప్రభుత్వం భాగస్వామ్యం (పీ4) కార్యక్రమం ప్రారంభోత్సవంలో పాల్గొనున్న నేపథ్యంలో అక్కడి ఏర్పాట్లను శనివారం జిల్లా ప్రత్యేక అధికారి సిఆర్డిఏ కమిషనర్ కె కన్నబాబు, జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి , ఐజి సర్వశ్రేష్టి త్రిపాఠి, జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, సంయుక్త కలెక్టర్ ఏ భార్గవ తేజ , గుంటూరు ఆర్డీవో …
Read More »మార్చి 29న జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశము
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశము మార్చి 29వ తేదీన నిర్వహించనున్నట్లు జిల్లా ప్రజా పరిషత్ సీఈవో జ్యోతి బసు నేడొక ప్రకటనలో తెలియజేశారు. మార్చి 29వ తేదిన ఉదయం 10:30 గంటలకు జిల్లా ప్రజా పరిషత్ మీటింగ్ హాల్లో జడ్పీ చైర్ పర్సన్ కత్తెర హెనీ కిస్ట్రినా అధ్యక్షతన జరిగే జిల్లా ప్రజా పరిషత్ సర్వ సభ్య సమావేశంలో ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి కేంద్ర మంత్రివర్యులు, రాష్ట్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసన …
Read More »ఆస్తి పన్ను చెల్లించడానికి కేవలం 9 రోజులే గడువు… : కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : 2024–25 సంవత్సరము ఆస్తి పన్ను, బకాయిలను చెల్లించటానికి ఈ నెలాఖరు వరకే (9 రోజులే) గడువు ఉన్నందున పన్ను చెల్లింపుదార్లకు వీలుగా ఆదివారం, ఈ నెల 30,31 సెలవు రోజులైనప్పటికీ క్యాష్ కౌంటర్లు యధావిధిగా పనిచేస్తాయని పన్ను బకాయిదార్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నగర కమీషనర్ పులి శ్రీనివాసులు ఐ.ఎ.యస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగర ప్రజలు ఈ నెలాఖరులోపు తమ ఆస్తి, ఖాళీ స్థల, నీటి పన్నులు …
Read More »త్రాగు నీటి సరఫరాలో అంతరాయం…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 24 వ తారీఖు సోమవారం హెచ్.యల్.ఆర్ ప్రాంగణం నుండి ఏ.టి అగ్రహారం రిజర్వాయర్ నకు త్రాగు నీరు సరఫరా చేయు ప్రధాన పంపింగ్ మెయిన్ లైన్ పై స్లూయిజ్ వాల్వ్ మార్చుచున్నందున సదరు రిజర్వాయర్లకు మరియు గృహాలకు త్రాగు నీటి సరఫరాలో అంతరాయం కలుగుతుందని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐ.ఎ.యస్ శనివారం ఒక ప్రకటన ద్వారా తెలియచేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, గుంటూరు నగరంలోని హెచ్.యల్.ఆర్ వాటర్ వర్క్స్ ప్రాంగణం నందు …
Read More »
Prajavartha Online Telugu News