అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మూడవ కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాల మధ్య తలసరి ఆదాయంలో వచ్చిన మార్పులపై కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 2022-23 సంవత్సరానికి గాను సత్యసాయి జిల్లాలో తలసరి ఆదాయం 2,19,234 రూపాయలు, అనంతపురం జిల్లాలో 2,33,521 రూపాయలు, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 1,93,763 రూపాయలుగా నమోదైంది. సాధారణంగా అనంతపురం జిల్లా కరువు పీడిత ప్రాంతంగా, వెనుకబడిన జిల్లాగా పరిగణించబడుతుంది. అయితే, కోనసీమలో తలసరి ఆదాయం ఎక్కువుగా ఉంటుందని భావిస్తారు. ఉద్యానవన రంగంలో …
Read More »Daily Archives: March 25, 2025
ప్రైవేటు భూములేవీ 22ఏలో ఉండకూడదు
-పేదలకు న్యాయం చేయాలన్నదే సీఎంగారి తపన -22ఏ, ఫ్రీహోల్డ్ భూములపై ప్రత్యేక డ్రైవ్ -జిల్లాల్లో ప్రత్యేకంగా రియల్ ఎస్టేట్ కమిటీల ఏర్పాటు -భూ సమస్యలపైన కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలి -రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ప్రైవేటు భూములేవీ కూడా 22ఏలో ఉండకూడదనేదే ప్రభుత్వ ఆశయమని, ఆ దిశగా జిల్లా కలెక్టర్లు పనిచేయాలని రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ జిల్లా కలెక్టర్లకు సూచించారు. ప్రజలకు …
Read More »ఇఫ్తార్ విందులో పోతిన వెంకట మహేష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కరీముల్లా ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ముఖ్య అతిథిగా ysrcp నేత పోతిన వెంకట మహేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ ముస్లిం సోదర సోదరీమణులు కు ముందుగా రంజాన్ శుభాకాంక్షలు తెలిపినారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ యాలకల చలపతి రావు, LRK, దాడి జగన్, మండల శ్రీను, శ్యామ్, షాహీనా టీమ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Read More »ఉప సభాపతి రఘురామకృష్ణ రాజు అమరావతి చిత్రకళ వీధికి మద్దతు – ఆంధ్ర కళాకారులను ప్రోత్సహించాలని పిలుపు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉండి ఎమ్మెల్యే మరియు ఉప సభాపతి రఘురామకృష్ణ రాజు, అమరావతి చిత్రకళ వీధికి తన మద్దతు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత & సంస్కృతి కమిషన్ ఛైర్‌పర్సన్ తేజస్వి పొడపాటి తో కలిసి, ఈ గొప్ప కళా ఉత్సవాన్ని ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ఆంధ్రప్రదేశ్ అనేక కళా రూపాలకు నిలయంగా ఉంది. ఇలాంటి వేదికలు కళాకారులను ప్రోత్సహించడానికి ఎంతో అవసరం. మన కళారూపాలను జాతీయ స్థాయికి తీసుకెళ్లే దిశగా అందరం కృషి చేయాలి.” …
Read More »ఈ నెల 31 లోపు ఆస్థి పన్ను బకాయిలు చెల్లించండి- వడ్డీలో 50 శాతం రాయితీని పొందండి
-అనురాధ, అడిషనల్ డైరక్టర్, పురపాలక శాఖ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆస్థి పన్ను బకాయిలు ఈ నెల 31 లోపు చెల్లించాలని, గడువు లోపు ఒకే సారి ఏకమొత్తంలో చెల్లించిన వారికి వడ్డీలో 50 శాతం రాయితీని కల్పిస్తున్నట్లు పురపాలక శాఖ అడిషినల్ డైరక్టర్ సి. అనురాధ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలోని పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థల్లో ఇంటిపన్ను, ఖాళీ స్థలాలపై పన్నులు సకాలంలో అనగా మొదటి అర్థ సంవత్సరానికి జూన్, రెండవ అర్థసంవత్సరానికి డిసెంబర్ లోపు పన్ను …
Read More »ఏప్రిల్ 1 నుండి సదరం స్లాట్ లు పున:ప్రారంభం
-డా. ఎ. సిరి, ఐఏఎస్, డైరక్టర్, సెకండరీ హెల్త్ శాఖ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో సదరం స్లాట్ లు ఏప్రిల్ 1 నుండి తిరిగి ప్రారంభం అవుతాయని రాష్ట్ర సెకండరీ హెల్త్ శాఖ డైరక్టర్ డా. ఎ సిరి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. దివ్వాంగుల పెన్షనర్ల వెరిఫికేషన్ కారణంగా జనవరిలో విడుదల కావలసిన సదరం స్లాట్ లు నిలిపివేయబడ్డాయన్నారు. దివ్యాంగ సంఘాల విజ్ఞప్తుల మేరకు, వెరిఫికేషన్ తో పాటు స్లాట్ లను తిరిగి ప్రారంభించి, అర్హులైన వారికి సర్టిఫికెట్లు …
Read More »ఉప సర్పంచ్ ఎన్నికల నిమిత్తం ఓరియంటేషన్ ప్రోగ్రాం :ఎన్టీఆర్ జిల్లా గ్రామ పంచాయతీ అధికారి లావణ్య కుమారి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లా గ్రామ పంచాయతీ అధికారి లావణ్య కుమారి ఉప సర్పంచ్ ఎన్నికల నిమిత్తము ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించడం జరిగినది, ఈనెల 27వ తారీఖున జరగనున్నఉపసర్పంచ్ ఎన్నికలు,జరుగు గ్రామ పంచాయితీల ప్రిసైడింగ్, అధికారులు మరియు డివిజనల్ పంచాయతీ అధికారి హాజరై ఓరియంటేషన్ కార్యక్రమం లో, సూచనలు సలహాలు ఎలా నిర్వహించాలి అనే పలు అంశాలపై,డివిజనల్ పంచాయతీ అధికారి, జి ఎల్ ఎల్ వి ఎన్ రాఘవన్ ,మరియు జిల్లా పంచాయతీ అధికారి, సూచనలు సలహాలు ఇవ్వడం జరిగినది …
Read More »చేనేతలకు 365 రోజుల పనే లక్ష్యం
-రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత -చేనేతలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాం -త్వరలో మరిన్ని చేనేత ఎగ్జిబిషన్లు -ఎగ్జిబిషన్ల ఏర్పాటుతో చేనేత వస్త్రాల అమ్మకాలు పెరిగాయన్న మంత్రి -మంత్రి సవితకు నేతన్నల ధన్యవాదాలు -ఎగ్జిబిషన్ల నిర్వహణతో రోజూ మాకు పని దొరుకుతోందని వెల్లడి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నేతన్నలకు 365 రోజుల పాటు పని కల్పించడంతో పాటు చేనేత వస్త్రాలకు మార్కెటింగ్ సదుపాయం కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, ఇందుకోసం మరిన్ని ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేయనున్నామని రాష్ట్ర చేనేత, జౌళి …
Read More »ముగిసిన హోలిస్టిక్ ప్రొగ్రెస్ కార్డు డిజిటలైజేషన్ వర్క్ షాప్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎస్సీఈఆర్టీ ఆధ్వర్యంలో లింగ సమానత్వం, రాజ్యంగ విలువలు, విలువలు- విద్య పుస్తకాలు, ఉపాధ్యాయ కరదీపికలు పూర్తయ్యే దశలో ఉన్నాయని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ ఎం.వి. కృష్ణారెడ్డి అన్నారు. పాఠశాల విద్యాశాఖ, ఎన్సీఈఆర్టీ, ఎస్సీఈఆర్టీ ఆధ్వర్యంలో హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్‌పై రెండు రోజుల వర్క్‌షాప్ ( ఫౌండేషనల్, ప్రిపరేటరీ, మిడిల్ స్టేజ్ ) ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ హోలిస్టిక్ ప్రొగ్రెస్ కార్డు ప్రయోజనాన్ని ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు సులభంగా అర్థమయ్యేలా రూపొందించాలని రిసోర్సు పర్సన్లను ఉద్దేశిస్తూ అన్నారు. హోలిస్టిక్ ప్రోగ్రెస్ …
Read More »గ్రామాల్లో స్మశాన వాటికలు ఏర్పాటు చేయాలి, కోతుల బెడద తొలగించాలి
-ప్రభుత్వాధికారులకు వినతి ప్రతం అందజేసిన పంచాయతీ ఛాంపియన్స్ ఎ.కొండూరు, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) సారధ్యంలో నిర్వహిస్తున్న కేశినేని ఫౌండేషన్ ద్వారా హైదరాబాద్ లోని హైదరాబాద్ జాతీయ గ్రామీణ అభివృద్ధి పంచాయతీ రాజ్ సంస్థలో (ఎన్.ఐ.ఆర్.డి.పి.ఆర్ )లో శిక్షణ పొందిన పంచాయతీ ఛాంపియన్స్, ఎన్టీఆర్ జిల్లా ఎన్.ఐ.ఆర్.డి.పి.ఆర్. ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్ సొంగా సంజయ్ వర్మ ఆధ్వర్యంలో మంగళవారం తిరువూరు లో ఎ.కొండు మండలం ఎమ్.ఆర్.వో కార్యాలయంలో డిప్యూటీ తాహశీల్దార్ రాజ్ కుమార్ కు ఎ.కొండూరు మండలంలో …
Read More »
Prajavartha Online Telugu News