Breaking News

Daily Archives: March 27, 2025

మార్కెట్లు, మరుగుదొడ్లు, సైకిల్ స్టాండ్ లకు బహిరంగ వేలం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థకు చెందిన మార్కెట్లు, మరుగుదొడ్లు, సైకిల్ స్టాండ్ లకు సంబధించి మార్చి31, 2026 వరకు లీజు నిర్వహించుకోవడానికి నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆదేశాల మేరకు గురువారం స్థానిక నగరపాలక సంస్థ ట్రావెలర్స్ బంగ్లాలో సీల్డ్ టెండర్ మరియు బహిరంగ వేలంను నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు డిప్యూటీ కమిషనర్లు, రెవెన్యూ అధికారులతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థకు చెందిన 14 ప్రాంతాల్లోని …

Read More »

మొట్టమొదటి నాటు సారా రహిత జిల్లాగా ప్రకటించేందుకు సమన్వయంతో కృషి చేయాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : వచ్చే మే నెల 1 వ తేదీ నాటికి కృష్ణా జిల్లాను మొట్టమొదటి నాటు సారా రహిత జిల్లాగా ప్రకటించేందుకు సమన్వయంతో కృషి చేయాలని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అధికారులను ఆదేశించారు. గురువారం నగరంలోని కలెక్టరేట్ మీకోసం సమావేశ మందిరంలో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నవోదయం 2.0 – నాటు సారా నిర్మూలన కార్యక్రమం పై జిల్లా సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన …

Read More »

ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించిన వ్యవసాయ శాఖ, సెర్ప్ అధికారుల బృందం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ కార్యక్రమం లో భాగంగా రైతు సాధికార సంస్థ మేనేజ్ సంస్థ సహకారంతో గుంటూరు పట్టణంలో నిర్వహిస్తున్న మూడు రోజుల శిక్షణా కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర స్థాయి వ్యవసాయ, సెర్ప్ అధికారుల బృందం ఈ రోజు 27 వ తేదీన గుంటూరు జిల్లా కొల్లిపర మండలంలోని అత్తోట, తెనాలి మండలంలోని ఎరుకులపూడి గ్రామాల్లో పర్యటించింది. ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయం(ఏ. పీ. సీ. ఎన్‌. ఎఫ్) ద్వారా నిర్వహిస్తున్న ప్రకృతి వ్యవసాయ …

Read More »

ఇవియంలు భద్రపరిచిన గోడౌన్ ను తనిఖీ

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు త్రైమాసిక తనిఖీలలో భాగంగా గురువారం ఉదయం గుంటూరు కలక్టరేట్ ఆవరణలోని ఇవియంలు భద్రపరిచిన గోడౌన్ ను జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మీ పరిశీలించారు. సిసిటీవి పనితీరు, అగ్నిమాపక పరికరాలను పరిశీలించారు. ఇవియంల భద్రత విషయంలో రాజీపడకుండా అవసరమైన అన్ని భద్రతా చర్యలు పకడ్బందీగా చేపట్టాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ షేక్.ఖాజావలి , గుంటూరు ఆర్డిఓ కె.శ్రీనివాస రావు , అడిషనల్ ఫైర్ ఆఫీసర్ కృష్ణా …

Read More »

మానవ ప్రాణ శక్తి కేంద్రాల ప్రేరేపణ ద్వారా ఆరోగ్యం ఆనందం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గుడివాడ గిరిజ స్కూల్ ఆఫ్ నర్సింగ్ వద్ద గురువారం మానవ ప్రాణ శక్తి కేంద్రాల గురించి అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సుకు యోగ శక్తి సాధన సమితి విజయవాడ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ మాకాల సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు చికిత్స మరియు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ పి రాధాకృష్ణ మదర్ తెరిసా ఎడ్యుకేషనల్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు కోఆర్డినేటర్ గా వ్యవహరించారు.డాక్టర్ మాకాల సత్యనారాయణ శిక్షణ ఇస్తూ మాన …

Read More »

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రతి నెల ప్రత్యేకంగా గ్రీవెన్స్…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నగర పాలక సంస్థలో పని చేసే కార్మికులు మరియు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రతి నెల ప్రత్యేకంగా గ్రీవెన్స్ నిర్వహిస్తున్నామని, కార్మికులు మరియు ఉద్యోగులు తమ సమస్యలపై నేరుగా తమకు అర్జీలు, ఫిర్యాదులు అందించవచ్చని నగర పాలక సంస్థ అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు తెలిపారు. గురువారం నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐ.ఎ.యస్ ఆదేశాల మేరకు నగర పాలక సంస్థ కార్మికులు, ఉద్యోగులు సమస్యల పరిష్కారం కొరకు వర్కర్స్ గ్రీవెన్స్ ని కమిషనర్ ఛాంబర్ లో …

Read More »

రోడ్ పెండింగ్ పోర్షన్ పనులు వెంటనే ప్రారంభించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఏటి అగ్రహారం మెయిన్ రోడ్ పెండింగ్ పోర్షన్ పనులు వెంటనే ప్రారంభించాలని, విద్యుత్ స్తంభాలను షిఫ్ట్ చేసేలా సమన్వయం చేసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఇంజినీరింగ్ అధికారులకు స్పష్టం చేశారు. గురువారం కమిషనర్ ఏటి అగ్రహారం, శాంతి నగర్, లక్ష్మీ నగర్, చుట్టగుంట తదితర ప్రాంతాల్లో పర్యటించి, అభివృద్ధి, పారిశుధ్య పనులను పరిశీలించి సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఏటి అగ్రహారం మెయిన్ రోడ్ లో …

Read More »

50% వడ్డీ మాఫీకి కేవలం నాలుగు రోజులు మాత్రమే గడువు

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇంటి పన్ను, ఖాళీ స్థలం పన్ను చెల్లింపులపై 50 % వడ్డీ మాఫీ కి కేవలం నాలుగు రోజులు మాత్రమే గడువు ఉందన్నారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. పన్ను బకాయల వడ్డీ పై 50% రాయితీ పొందేందుకు మార్చ్ 31, 2025 చివరి తేదీ అని గురువారం నాడు విడుదల చేసిన ఒక ప్రకటనలో కమిషన్ తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజల సౌకర్యార్థం విజయవాడ …

Read More »