Breaking News

Daily Archives: April 6, 2025

వైభవంగా శ్రీరామనవమి వేడుకలు

-పాల్గొన్న ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ నియోజకవర్గంలో శ్రీరామనవమి వేడుకలను ఆదివారం భక్తులు ఎంతో వైభవోపేతంగా నిర్వహించారు. రామాలయాల్లో వేదమంత్రోచ్చరణల మధ్య కన్నుల పండువగా రాములోరి కళ్యాణం జరిపారు. కొత్తపేట బ్రాహ్మణ వీధిలోని శ్రీ నగరాల సీతారామస్వామి శ్రీ మహాలక్ష్మి అమ్మ వార్ల దేవస్థానంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే సుజనా చౌదరి సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. సుజనా చౌదరికి వేద బ్రాహ్మణులు తీర్థ ప్రసాదాలు అందజేశారు . ఈ సందర్భంగా సుజనా చౌదరి …

Read More »

బీజేపీ రాష్ట్ర కార్యాల‌యంలో ఘ‌నంగా పార్టీ ఆవిర్భావ దినోత్స‌వం..

-హాజ‌రైన ఎమ్మెల్యే సుజ‌నా చౌద‌రి, ఇత‌ర నేత‌లు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎంతగానో కృషి చేస్తున్నారని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి వ్యాఖ్యానించారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే సుజనా చౌదరి బీజేపీ జెండాను ఆవిష్కరించారు. వేడుకలలో భారీగా బీజేపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ 1980లో జనసంఘ్ …

Read More »

ఈ నెల 7వ తేదీ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వినతుల స్వీకరణ కార్యక్రమం

-జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 7వ తేదీ సోమవారం కలెక్టరేట్ లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం)కార్యక్రమం ద్వారా ప్రజల నుండి వినతులు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కారానికి పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టమ్ (పీజీఆర్ఎస్) ద్వారా అర్జీల స్వీకరణ చేపట్టనున్నట్టు తెలిపారు. కలెక్టరేట్, డివిజన్, మునిసిపల్, …

Read More »

“శ్రీ దుర్గమ్మకు ప్రత్యేక పుష్పార్చన”

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : విశ్వావసు నామ సంవత్సర వసంత నవరాత్రుల్లో ఎనిమిదవ రోజైన 06.04.2025 ఆదివారం శ్రీ కనక దుర్గ అమ్మవారికి ప్రత్యేక పుష్పార్చన మంత్రపూర్వకంగా జరిగింది.చామంతి, సంపంగిపూల తో, దేవస్థానంలో నూతనంగా నిర్మించిన పూజా మండపం ( నటరాజ స్వామి ఆలయ ప్రాంగణం)లో ఉదయం 9 గంటల నుండి పుష్పార్చన వైభవంగా ప్రారంభం అయింది. శ్రీ కనకదుర్గ అమ్మవారి ప్రధాన ఆలయం నుండి పుష్పాలతో మంగళ వాయిధ్యాలు, వేద మంత్రాలు నడుమ ఆలయ అర్చకులు, సిబ్బంది అర్చన ప్రాంగణంకి వెదురు …

Read More »

“ఇంద్రకీలాద్రి పై శ్రీరామ కళ్యాణం”

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీరామనవమిని పురస్కరించుకొని ఇంద్రకీలాద్రిపై శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది. రాజగోపురం ప్రాంగణంలోని కళావేదిక పై ఈరోజు ఉదయం 10 గంటల నుండి పూజా క్రతువులు ప్రారంభం అయ్యాయి. ఆలయ స్థానాచార్య శివ ప్రసాద్ శర్మ, ప్రధాన అర్చకులు దుర్గా ప్రసాద్ ఆధ్వర్యంలో కార్యక్రమంనిర్వహించడమైనది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని, సీతారామ కళ్యాణం వీక్షించారు. ఉపాలయం అయిన సీతానగరం శ్రీ మధ్విరాంజనేయ స్వామి వారి దేవస్థానం శ్రీ సీతారామ కళ్యాణం వైభవంగా జరిగింది.

Read More »

ముస్లిం, క్రైస్తవ కాంగ్రెస్ పార్టీ నాయకులతో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు

-మత సామరస్యానికి, ఐక్యతకు నిలయమే కాంగ్రెస్ పార్టీ -దేశంలో రామరాజ్య స్థాపన పాలన కేవలం కాంగ్రెస్ పార్టీకే సాధ్యం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు నగర అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు అధ్యక్షతన శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ వేడుకలలో సర్వమత సమానత్వం విరజిల్లేలా ముస్లిం, క్రైస్తవ సోదరులు శ్రీ రాములవారి చిత్రపటానికి పూలమాల వేసి కొబ్బరికాయ కొట్టి సర్వమాన సమానత్వాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్ష నరహరిశెట్టి నరసింహారావు మాట్లాడుతూ దేశంలోని …

Read More »

మద్దతు. ధరల ప్రకారం రబీలో పండించిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి… : కె.రామకృష్ణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రబీలో పండిన ధాన్యాన్ని మద్దతు ధరల ప్రకారం వెంటనే కొనుగోలు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడంలోనూ, ధాన్యాన్ని సేకరించటంలోను తీవ్రమైన జాప్యం జరుగుతుందని దీనివల్ల మధ్య దళారులు సిండికేట్ గా ఏర్పడి తక్కువ రేటుకు కొనుగోలు చేసి రైతులను దోపిడీ చేస్తున్నారన్నారు. ఈరోజు ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం మండలం, ఈల్లప్రోలు గ్రామంలో పర్యటించి ధాన్యం పండించిన రైతులతో మాట్లాడి రైతులు ధాన్యం అమ్ముకోవడంలో …

Read More »

మత సంస్థలపై బీజేపీ పెత్తనం

-క్రైస్తవ ఆస్తులు..దేవాలయాల భూములపైనా కన్ను -వక్ఫ్‌ బిల్లు రాజ్యాంగ విరుద్ధం. -ఒక్క అమరావతి రాజధానికే రూ.62వేల కోట్ల అప్పులా..? -అప్పులపై చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయాలి. -వక్ఫ్‌ బిల్లుపై వైసీసీ సరే…టీడీపీ వైఖరేంటి? -పురంధేశ్వరి, పవన్‌ వ్యాఖ్యలు అర్హరహితం -విలేకరుల సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలోని మతసంస్థలన్నిటిపైనా బీజేపీ పెత్తనం చెలాయించేందుకే ఈ రాజ్యాంగ విరుద్ధమైన వక్ఫ్‌ బిల్లును ముందుకు తెచ్చిందని, భవిష్యత్‌లో క్రైస్తవ ఆస్తులపైనా కన్నేసిందని, దేవాలయ భూములపైనా నిఘా ఉంచిందని సీపీఐ …

Read More »

ప్రజల సమస్యలకు పరిష్కారం వేదిక ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల ప్రతి సమస్య కు పరిష్కారం చూపే విధంగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ఈ సోమవారం కూడా విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం తో పాటు జోనల్ కార్యాలయంలో కూడా ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు జరుగుతుందని తెలిపారు విజయవాడ నగర్ పాలక సంస్థ ఇంచార్జి కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్. ప్రజలు విజయవాడ నగరపాలక సంస్థ సంబంధిత సమస్యలను సోమవారం ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు …

Read More »