మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం మంత్రి నగరంలోని వారి క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించి మచిలీపట్నం నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఆ ప్రకారం 40 అర్జీలు మంత్రివర్యులు స్వీకరించారు. ప్రజల సమస్యలను ఎంతో ఓపికగా ఆలకించి సంబంధిత అధికారులకు ఎండార్స్ చేసి పంపిస్తామని వారి సమస్యలు పరిష్కరిస్తామని హామీ …
Read More »Monthly Archives: April 2026
సింగపూర్ అభివృద్ధి, పారిశ్రామిక, సాంకేతిక విధానాల అధ్యయనం
-రాష్ట్రంలో సింగపూర్ విధానాలు అమలు చేసేందుకు అధ్యయనం చేస్తున్న మంత్రులు -సింగపూర్‌లో ఏపీ మంత్రుల 4వ రోజు పర్యటన విజయవంతం సింగపూర్, అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సింగపూర్‌లో కొనసాగుతున్న అధ్యయన పర్యటనలో భాగంగా నాలుగో రోజు కార్యక్రమాలు “ప్రజా బాధ్యత, స్థిరమైన ప్రజా నమ్మకం, జల వనరుల నిర్వహణ” అనే అంశాలపై విజయవంతంగా నిర్వహించబడ్డాయి. ఉదయం సింగపూర్ కోఆపరేషన్ ఎంటర్‌ప్రైజ్ (SCE) లో నిర్వహించిన సమావేశంలో గత రోజు అంశాలపై సమీక్ష నిర్వహించగా, డాక్టర్ ప్రేమ్ కుమార్ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు. …
Read More »సింగపూర్ మోడల్‌పై ఏపీ దృష్టి
– పర్యావరణం, నీటి నిర్వహణ, సాంకేతికతలో ప్రపంచ స్థాయి విధానాల అధ్యయనం చేసిన మంత్రుల బృందం – అమరావతి అభివృద్ధికి అంతర్జాతీయ అనుభవాల అన్వయం – కృష్ణా తీరం అభివృద్ధికి మెరీనా బ్యారేజ్ మోడల్ పరిశీలన సింగపూర్ / అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సుస్థిర అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలనే లక్ష్యంతో సింగపూర్‌లో పర్యటిస్తున్న మంత్రుల బృందం శిక్షణ కార్యక్రమం నాలుగవ రోజు కూడా కీలకంగా కొనసాగింది. ప్రపంచంలో అత్యుత్తమ నగర పాలన, పర్యావరణ పరిరక్షణ, నీటి నిర్వహణ, సాంకేతిక …
Read More »న్యాయసేవలో చిరస్మరణీయ సేవాస్ఫూర్తికి ఆదర్శంగా నిలిచారు జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్
-హైకోర్టు చీఫ్ జస్టిస్ గా నియమితులైన జస్టిస్ లిసా గిల్ ప్రసంశ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : న్యాయ సేవలో చిరస్మరణీయ సేవాస్ఫూర్తికి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఆదర్శంగా నిలిచారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానం ప్రధాన న్యాయమూర్తిగా నియమితులై శనివారం బాధ్యతలు చేపట్టనున్న జస్టిస్ లిసా గిల్ ప్రసంశించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలు అందిస్తున్న జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ పదవీ విరమణ సందర్బంగా శుక్రవారం హైకోర్టు మొదటి కోర్టు హాల్లో పుల్ కోర్టు ఆధ్వర్యంలో ఘనంగా …
Read More »నేడు “మొక్కజొన్న రైతు పోరాట దీక్ష” నిరసన కార్యక్రమం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మంగళగిరిలోని వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ రోజు జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో శనివారం జొన్న మరియు మొక్కజొన్న రైతులకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర తక్షణమే చెల్లించాలని, పొన్నూరు ఇన్చార్జి ఆంబటీ మురళీ ఆధ్వర్యంలో, ఉదయం 08:00 గంటల నుండి సాయంత్రం 05:00 గంటల వరకు, గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట గల “ధర్నా చౌక్” వద్ద “మొక్కజొన్న రైతు పోరాట దీక్ష” నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు వారు …
Read More »ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రై డే పాటించాలి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో పెరుగుతున్న దోమల సమస్యను నియంత్రించేందుకు ప్రతి ఇంట్లో ఫ్రైడేను, డ్రై డే గా పాటించాలని విజయవాడ నగరపాలక సంస్థ బయాలజిస్ట్ వి.కామేశ్వరరావు అన్నారు. శుక్రవారం ఉదయం విఎంసి కాలనీ లో ఫ్రైడే డ్రై డే కార్యక్రమం నిర్వహించి ఆ ప్రాంతంలో గల ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా బయాలజిస్ట్ వి. కామేశ్వరరావు మాట్లాడుతూ నగరంలో దోమల సమస్యలను నియంత్రించేందుకు విజయవాడ నగరపాలక సంస్థ విస్తృతమైన చర్యలు తీసుకుంటుందని అందులో భాగంగా నగరంలో ఉన్న కాలువల్లో …
Read More »ఎగ్జిబిషన్ ఆవరణలో ఎండు గడ్డిని వెంటనే తొలగించాలి…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎగ్జిబిషన్ ఆవరణలో ఎండు గడ్డిని వెంటనే తొలగించాలని విజయవాడ నగరపాలక సంస్థ రీజినల్ ఫైర్ ఆఫీసర్ డి. మాల్యాద్రి అన్నారు. ప్రస్తుత వేసవి తీవ్రత, ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం వల్ల కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు ఫైర్ ప్రివెన్షన్ టీమ్ శుక్రవారం ఉదయం బాబూరి గ్రౌండ్స్, భవానిపురం లో జరుగుతున్న ఎగ్జిబిషన్ ప్రాంగణాన్ని సిబ్బందితో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బబ్బురి గ్రౌండ్స్ చుట్టుపక్కల 6 మీటర్ల వరకున్న ఎండు గడ్డను వెంటనే తొలగించాలని, స్టాళ్లలో …
Read More »మలేరియాపై వాల్ పోస్టర్లను ఆవిష్కరించిన కమీషనర్ వీరపాండియన్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ మలేరియా దినోత్సవం(శనివారం) సందర్భంగా ప్రచార, అవగాహన వాల్‌పోస్టర్లు, కరపత్రాల్ని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ జి.వీరపాండియన్ శుక్రవారంనాడు మంగళగిరిలోని ఏపిఐఐసి టవర్స్ లోని తన ఛాంబర్‌లో ఆవిష్కరించారు. జాతీయ కీటక జనిత వ్యాధి నియంత్రణ కార్యక్రమం కింద రాష్ట్రంలో మలేరియా నిర్మూలనకు సంబంధించి తీసుకున్న చర్యల గురించి ఆయన వివరించారు. మలేరియాపై ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని సంబంధిత అధికారుల్ని ఆయన ఆదేశించారు. డ్రివెన్ టు ఎండ్ మలేరియా-నౌ వియ్ కెన్, నౌ …
Read More »“సింగపూర్ వర్సిటీ” పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ టియోతో మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ భేటీ!
-రాష్ట్రoలో ఆరోగ్య రంగం పటిష్టత పై వారివురి మధ్య చర్చ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ లోని ఆరోగ్య వ్యవస్థను ప్రపంచ స్థాయి ప్రమాణాలకు ధీటుగా తీర్చిదిద్దుతున్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. సింగపూర్ పర్యటనలో భాగంగా మంత్రి “నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ సింగపూర్” పబ్లిక్ హెల్త్ డిపార్టుమెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వై.వై.టియోతో మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఆరోగ్య వ్యవస్థ పటిష్టం చేసేందుకు సీఎం శ్రీ చంద్రబాబు …
Read More »మలేరియా రహిత జిల్లాలుగా బాపట్ల, పశ్చిమగోదావరి, కోనసీమ
-త్వరలో కేంద్రానికి ప్రతిపాదనలు -2024-25 నుంచి రాష్ట్రలో తగ్గుముఖం పట్టిన మలేరియా కేసులు -రాబోయే వర్షాలు దృష్టిలో పెట్టుకుని ఇప్పటినుంచే క్రిమిసంహారక మందు పిచికారీ -రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి -రేపు ప్రపంచ మలేరియా దినోత్సవం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో మలేరియా జ్వరాల నియంత్రణ కోసం పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ఇందులో భాగంగా బాపట్ల, పశ్చిమ గోదావరి, కోనసీమ జిల్లాలను మలేరియా రహిత జిల్లాలుగా …
Read More »
Prajavartha Online Telugu News