Daily Archives: August 7, 2026

రోడ్డుకిరువైపులా మొక్కలను విరివిగా నాటాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలోని ప్రధాన రహదారుల్లోని డివైడర్లలో రోడ్డుకిరువైపులా మొక్కలను విరివిగా నాటాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఇంజినీరింగ్, హార్టికల్చర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ చాంబర్ లో నగరంలో పచ్చదనం పెంపొందించడం, పార్కుల నిర్వహణ పై అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, గుంటూరు నగరాన్ని గ్రీన్ గుంటూరుగా చేయడానికి నగరంలో చేపట్టిన ప్లాంటేషన్ ను జియో ట్యాగ్ చేయాలన్నారు. ముఖ్యంగా నగరంలోని ప్రధాన …

Read More »

సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుధ్య పనులు చేపట్టాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో అంతర్గత డ్రైన్లను ప్రతి రోజు శుభ్రం చేయాలని, గ్యాంగ్ వర్క్ ద్వారా వార్డ్ ల్లో సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుధ్య పనులు చేపట్టాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు. శుక్రవారం నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో శానిటరీ ఇన్స్పెక్టర్లతో ప్రజారోగ్య విభాగా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగరంలో మెరుగైన పారిశుధ్య పనులు చేపట్టడానికి పూర్తి స్థాయిలో వాహనాలు, కార్మికులను కేటాయించినా, క్షేత్ర …

Read More »

ప్రశాంతంగా ఏ.పి టెట్ -2026 పరీక్షలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శుక్ర‌వారం నిర్వహించిన ఏ.పి టెట్ -2026 (జూన్) పరీక్షలు అన్నీ పరీక్షా కేంద్రాలలోనూ ప్రశాంతంగా జరిగినవి. పేపర్ IA తెలుగు (SGT) పరీక్షకు మొదటి సెషన్ లో 74 పరీక్షా కేంద్రాలలో 17616 మంది అభ్యర్ధులకుగాను, 16072 మంది అభ్యర్ధులు (91.24 శాతం) , రెండవ సెషన్ లో 67 పరీక్షా కేంద్రాలలో 13648 మంది అభ్యర్ధులకుగాను, 12133 మంది అభ్యర్ధులు (88.90 శాతం) హాజరయ్యారు. అత్యధికంగా మొదటి సెషన్ లో శ్రీకాకుళం జిల్లా లో 96.37% …

Read More »

ఉత్సాహంగా అమ‌రావ‌తి ఛాంపియ‌న్‌షిప్ పోటీలు

– క్రీడాకారుల‌ను ఉత్సాహ‌ప‌రిచిన న జిల్లా కలెక్టర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్‌టీఆర్ జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ (డీఎస్ఏ) ఆధ్వర్యంలో జిల్లాస్థాయి అమరావతి ఛాంపియన్‌షిప్ పోటీలు ఉత్సాహంగా జ‌రుగుతున్నాయి. శుక్ర‌వారం నందిగామ జెడ్పీ హైస్కూల్‌లో ఖో-ఖో, కబడ్డీ, వాలీబాల్ క్రీడాంశాల్లో బాలురు, బాలికలకు వేర్వేరుగా పోటీలు నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి మొత్తం 815 మంది క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ క్రీడాకారులతో ముచ్చటించి పోటీల్లో మంచి ప్ర‌తిభ క‌న‌బ‌రిచి జిల్లాకు …

Read More »

ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్దపీట

-‘ఒక నెల – ఒక గ్రామం – నాలుగు సందర్శనలు’ కార్యక్రమంలో నమోదైన అర్జీలకు శాశ్వత పరిష్కారం చూపాలి -ప్రతి అర్జీని నిర్ణీత గడువులోగా తప్పనిసరిగా పరిష్కరించాలి -క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను పరిశీలించి ప్రజలకు సత్వర న్యాయం అందించాలి -జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ పెనుగంచిప్రోలు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల నుంచి స్వీకరించిన ప్రతి అర్జీకి శాశ్వత పరిష్కారం చూపే దిశగా అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ఆదేశించారు. ప్రజా సమస్యలను కేవలం అర్జీల పరిష్కారంగా …

Read More »

క్లెయిమ్స్, అభ్యంతరాల పరిష్కార ప్రక్రియను అత్యంత పకడ్బందీగా చేపట్టాలి

-నోటీసు జారీ చేసిన ఏడు రోజుల్లోగా విచారణ పూర్తి చేయాలి -ప్రతిరోజూ కనీసం 70 క్లెయిమ్స్, అభ్యంతరాలపై విచారణ జరిపి పరిష్కరించాలి -క్షేత్రస్థాయి విచారణలో స్టేట్మెంట్‌ను పక్కాగా నమోదు చేయాలి -క్లెయిమ్స్, అభ్యంతరాల సమాచారాన్ని రాజకీయ పార్టీలకు అందజేయాలి -ఎన్టీఆర్ జిల్లా ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ ఎం.వి.శేషగిరి బాబు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో భాగంగా అందిన ప్రతి క్లెయిమ్, అభ్యంతరాన్ని అత్యంత జాగ్రత్తగా, పారదర్శకంగా విచారణ చేసి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఎన్టీఆర్ …

Read More »

ప్ర‌జ‌ల గుండెల్లో పొన్న‌మండ ల‌క్ష్మ‌ణ‌స్వామివ‌ర్మ

‍- అగ్నికుల క్షత్రియుల చరిత్రను చాటిచెప్పిన మహనీయుడు – ఆయుయుర్వేదంతో వేలాది పేదలకు ఆరోగ్యాన్ని ప్రసాదించిన గొప్పవ్యక్తి – రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్ర‌జాసేవకు అంకిత‌మైన జీవితంతో సేవా కార్య‌క్ర‌మాల ద్వారా మ‌న్న‌న‌లు పొందిన రాజ‌శ్రీ పొన్న‌మండ ల‌క్ష్మ‌ణ‌స్వామివ‌ర్మ ప్ర‌జల గుండెల్లో చిర‌స్థాయిగా నిలిచిపోయారని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. అగ్నికుల క్షత్రియ జాతిపిత స్వర్గీయ పొన్నమండ లక్ష్మణ స్వామి …

Read More »

స్వయం సహాయక సంఘాల మహిళా పారిశ్రామికవేత్తలకు ఎంఎస్‌ఎంఈ పథకాలపై అవగాహన కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని పటమట సర్కిల్-3 కార్యాలయంలో గురువారం స్వయం సహాయక సంఘాల (SHG) మహిళా పారిశ్రామికవేత్తల కోసం సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల (MSME) పథకాలపై ప్రత్యేక అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్ఎంఈ ఫోరం డైరెక్టర్ మరియు కేంద్ర సూక్ష్మ, ఎం ఎస్ ఎం ఈ మంత్రిత్వ శాఖ అడ్వైసరీ సభ్యురాలు సుష్మ ముఖ్య అతిథిగా హాజరై మహిళా పారిశ్రామికవేత్తలతో వ్యక్తిగతంగా సమావేశమై వారి వ్యాపార కార్యకలాపాలు, ఎదుర్కొంటున్న …

Read More »

అగ్నిమాపక పరికరాల వినియోగంపై విఎంసి ఫైవ్ సిబ్బంది విస్తృత అవగాహన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అగ్నిమాపక పరికరాల వినియోగంపై విఎంసి ఫైర్ సిబ్బంది విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం రీజనల్ ఫైర్ ఆఫీసర్ సిహెచ్ రత్నబాబు తమ సిబ్బందితో గురునానక్ కాలనీలోని ఎరువాక టెక్నాలజీస్ సంస్థను సందర్శించి, అగ్నిమాపక పరికరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి అక్కడున్నవారికి వాటి వినియోగం పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రతి సంస్థలో అగ్నిప్రమాదాలను నివారించేందుకు అవసరమైన భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా అమలు చేయాలని అన్నారు. …

Read More »

ప్రతి శుక్రవారం డ్రైడే పాటించి దోమల వల్ల కలిగే వ్యాధులను నిర్మూలిద్దాం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరంలో దోమల ద్వారా వ్యాపించే డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి వ్యాధులను సమర్థవంతంగా నివారించేందుకు ప్రతి ఇంటిలో ప్రతి శుక్రవారం డ్రై డేను తప్పనిసరిగా పాటించాలని విజయవాడ నగరపాలక సంస్థ బయాలజిస్ట్ సూర్యకుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం బ్రాహ్మణా స్ట్రీట్ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించి ఇంటింటికీ వెళ్లి ప్రజలకు దోమల నివారణపై సూచనలు అందించారు. ఈ సందర్భంగా బయాలజిస్ట్ సూర్యకుమార్ మాట్లాడుతూ నగరంలో …

Read More »