అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మంగళగిరి సీసీఎల్ఏ కార్యాలయం వద్ద ఈ రోజు వీఆర్ఏల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని చలో సీసీఎల్ఏ వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమానికి మద్దతు ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం. రాష్ట్ర అధ్యక్షులు. భూపతి రాజు రవీంద్ర రాజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం అప్పలనాయుడు. ఈ సందర్భంగా ఈ రాష్ట్రలో పనిచేస్తున్న వీఆర్ఏల సమస్యల పరిష్కారం అయ్యేవరకు రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం మద్దతుగా ఉంటామని తెలియజేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ …
Read More »Daily Archives: August 19, 2026
‘ఇంటింటికీ తెలుగుదేశం’ ప్రచార కార్యక్రమం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 64వ డివిజన్ కండ్రిక మెయిన్ రోడ్డు బస్టాప్ వద్ద నుండి బుధవారం రెండేళ్ల నమ్మకం – సంక్షేమం, అభివృద్ధి ‘ఇంటింటికీ తెలుగుదేశం’ ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు గారు ఇంటింటికి వెళ్లి ప్రజలతో ఆత్మీయంగా మమేకం అయ్యారు. ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ:-విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో “ఇంటింటికీ తెలుగుదేశం” కార్యక్రమంలో భాగంగా 21 డివిజన్లలో మా టీడీపీ నాయకులు, ఇంటింటికీ వెళ్లి ప్రజల …
Read More »గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల 2వ సాధారణ ఎన్నికల నిర్వహణపై APSEC వీడియో కాన్ఫరెన్స్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలకు నిర్వహించనున్న 2వ సాధారణ ఎన్నికల ఏర్పాట్లు, ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అంశాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (SEC) అనిల్ చంద్ర పునేఠా ఆధ్వర్యంలో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు స్థానిక కలెక్టరేట్ మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్, జిల్లా పంచాయతీ అధికారి సుశీలా దేవితో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో గ్రామ పంచాయతీలు, పట్టణ …
Read More »స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లుపై సమావేశం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ ఎన్నికల నిర్వహణకు ముందస్తుగా ఓటర్ల లిస్టు ప్రకటన, ఎన్యూమరేషణ్, వార్డ్ ల రిజర్వేషన్ తదితర అంశాలతో ముందస్తుగా క్యాలెండర్ సిద్దం చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. బుధవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ చాంబర్ లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లుపై సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియకు సదా సిద్దంగా ఉండాలన్నారు. వార్డ్ ల వారీగా ఓటర్ల సర్వే చేయడానికి, పోలింగ్ …
Read More »గుంటూరు నగరంలో దోమల నియంత్రణకు పటిష్ట చర్యలు
-4 మలేరియా డివిజన్లలో 203 మంది కార్మికులతో యాంటీ లార్వా యాక్టివిటీస్ -గతేడాదితో పోలిస్తే గణనీయంగా తగ్గిన డెంగ్యూ, చికెన్ గున్యా కేసులు -దోమల నియంత్రణకు ప్రజలు కూడా ప్రతి శుక్రవారం డ్రైడే పాటిస్తూ సహకరించాలి -గురువారం ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా కమిషనర్ మయూర్ అశోక్ గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ దోమల దినోత్సవం (ఆగస్ట్ 20) సంధర్బముగా గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో దోమల ద్వారా వ్యాపించే మలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా వంటి ప్రాణాంతక వ్యాధులపై అవగాహన పెంచడం, …
Read More »బీసీల జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత కూటమి ప్రభుత్వానిదే
-34 శాతం రిజర్వేషన్లు పునరుద్ధరించేందుకు ధన్యవాదాలు -భవిష్యత్తులోనూ బీసీలకు అన్నిరకాలుగా అండగా నిలుస్తామని మంత్రి కొల్లు రవీంద్ర భరోసా అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించడం ద్వారా వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి ప్రత్యేక ధన్యవాదాలు అని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. దేశానికి 1947లోనే స్వాతంత్ర్యం వచ్చినా.. బీసీలకు రాజకీయ అవకాశాలు కల్పించి అసలైన స్వాతంత్రం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. …
Read More »వైసీపీ నేతలు, జగన్ రెడ్డి వైఖరిపై మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్
-చట్టసభలను గౌరవించని వ్యక్తి చట్టసభల్లో ఉండడం అవసరమా? -జగన్ బయట ఉండి ప్రెస్ మీట్లు పెట్టడం కాదు… దమ్ముంటే అసెంబ్లీకి రావాలి -ప్రశ్నోత్తరాల సమయాన్ని కూడా అడ్డుకోవాలని చూడడం సిగ్గుచేటు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చట్ట సభలకు రాకుండా ప్రెస్ మీట్ల పేరుతో బురద జల్లడం జగన్ రెడ్డి మానుకోవాలని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. గత మూడు రోజులుగా ప్రజా సమస్యలపై అసెంబ్లీలో అర్ధవంతంగా చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజల్ని …
Read More »మన గణపతి మహాగణపతి ఉత్సవాలను ఘన విజయం చేద్దాం
-రాష్ట్రానికి ఆదర్శంగా టూరిజం కం టెంపుల్ టూరిజం అభివృద్ధి -మంగినపూడి బీచ్‌లో ఉత్సవ కమిటీ కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మచిలీపట్నంలోని మంగినపూడి బీచ్‌ను దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పని చేస్తున్నామని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఈ మేరకు మంగినపూడి బీచ్ వద్ద ఏర్పాటు చేసిన సాగరతీర మహాగణపతి ఉత్సవ కమిటీ కార్యాలయాన్ని ఘనంగా ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. మచిలీపట్నం మంగినపూడి బీచ్‌కు చారిత్రాత్మకంగా …
Read More »బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు చారిత్రాత్మక నిర్ణయం : బుద్ధా వెంకన్న
-నూతనంగా ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టిన వర్ల రామయ్య కి శాలువాతో సత్కరించి గజమాలవేసి శుభాకాంక్షలు తెలియజేసిన పశ్చిమ నియోజకవర్గం ఇంచార్జ్ బుద్ధ వెంకన్న విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం ఘనంగా నిర్వహించారు. పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జ్, తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు బుద్ధా వెంకన్న ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత బలోపేతం, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు, ప్రజా సమస్యల పరిష్కారం తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ …
Read More »అమరావతి మాస్టర్ ప్లాన్, గ్రామ రహదారుల అనుసంధాన ప్రణాళికపై నవులూరులో గ్రామసభ నిర్వహణ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్‌లో భాగంగా గ్రామ సర్క్యులేషన్ ప్లాన్, గ్రామ ఇంటిగ్రేషన్ ప్లాన్‌ల రూపకల్పన కోసం ఏపీ సిఆర్డీఏ బుధవారం, 2026 ఆగస్టు 19న సౌత్ ఈస్ట్ గ్రిడ్‌లో భాగమైన నవులూరులో గ్రామసభ నిర్వహించింది. ఈ మేరకు నవులూరు, బేతపూడి గ్రామస్థులకు అమరావతి మాస్టర్ ప్లాన్, గ్రామ రహదారుల సర్క్యులేషన్ ప్రణాళిక, ప్రతిపాదిత రహదారి నెట్‌వర్క్‌పై అవగాహన కల్పించడంతో పాటు వారి సూచనలు, అభిప్రాయాలను సేకరించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామసభలో అమరావతి మాస్టర్ ప్లాన్, …
Read More »
Prajavartha Online Telugu News