Breaking News

Daily Archives: August 19, 2026

బాపట్ల జిల్లా వెదుళ్ళపల్లిలో వినికిడి లోపం ఉన్న విద్యార్థుల కోసం ప్రత్యేక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు…

-డైరెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో వినికిడి లోపం ఉన్న విద్యార్థుల ఉన్నత విద్య కోసం బాపట్ల జిల్లా వెదుళ్ళపల్లిలో ప్రత్యేకంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసినట్లు విభిన్న ప్రతిభావంతులు, ట్రాన్స్‌జెండర్ మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ డైరెక్టర్ (ఎఫ్.ఎ.సి.) ఎం. వేణుగోపాల్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ​మహిళలు, శిశువులు, విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ (ప్రోగ్రామ్-II) జి.ఓ.ఎం.ఎస్. నం. 16, తేది: 31.07.2026 …

Read More »

విజయవాడలో ఆర్‌ అండ్ బి శాఖ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన ర్యాలీ…..

-జెండా ఊపి ప్రారంభించిన ఆర్‌ అండ్ బి ఇంజనీర్-ఇన్-చీఫ్ వి.రామచంద్ర -మత్తు పదార్థాల రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ చేపట్టిన ‘నశా ముక్త్ భారత్ అభియాన్’ (ఎన్ఎమ్ బిఏ),లో భాగంగా రాష్ట్ర రోడ్లు & భవనాల (ఆర్‌ అండ్ బి) శాఖ ఆధ్వర్యంలో మంగళవారం విజయవాడలో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద ఈ ర్యాలీని …

Read More »

పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్డేషన్ తప్పనిసరి

-5–7, 15–17 ఏళ్ల వయస్సు పిల్లలకు సెప్టెంబర్ 30 వరకు ఉచితంగా బయోమెట్రిక్ అప్డేషన్ -ఆధార్ అప్డేషన్ లేకపోతే భవిష్యత్తులో సేవలు పొందడంలో ఇబ్బందులు -జిల్లాలో ఆధార్ సేవలను మరింత చేరువగా, సులభంగా అందించేందుకు చర్యలు -జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పిల్లల ఆధార్‌లో తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేషన్‌ను తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో పూర్తి చేయించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ సూచించారు. ఆధార్ బయోమెట్రిక్ వివరాలను నిర్దేశిత వయస్సులో అప్డేట్ చేయకపోతే …

Read More »

హస్తకళలకు సాంకేతికతను జోడించి కళాకారులకు కొత్త అవకాశాలు కల్పించాలి

-APHDC క్రాఫ్ట్‌టెక్ హ్యాకథాన్–2026 తుది పోటీల్లో డా. పసుపులేటి హరిప్రసాద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సంప్రదాయ హస్తకళలకు ఆధునిక సాంకేతికత, డిజైన్, ఆవిష్కరణలను అనుసంధానం చేసి కళాకారులకు కొత్త మార్కెట్లు, మెరుగైన జీవనోపాధి అవకాశాలు కల్పించడమే APHDC క్రాఫ్ట్‌టెక్ హ్యాకథాన్–2026 ప్రధాన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ (APHDC) చైర్మన్ డా. పసుపులేటి హరిప్రసాద్ గారు అన్నారు. మంగళగిరిలోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (RTIH) నందు APHDC ఆధ్వర్యంలో నిర్వహించిన క్రాఫ్ట్‌టెక్ హ్యాకథాన్–2026 తుది పోటీ, ప్రోటోటైప్ ప్రదర్శన …

Read More »

గ్రీన్ నిర్వహణ కమిటీ చైర్మన్‌గా నియమితులైన అన్నయ్య కొణిదెల నాగబాబు కి శుభాకాంక్షలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జనసేన పార్టీ ఎమ్మెల్సీ అన్నయ్య కొణిదెల నాగబాబు కి ఆంధ్రప్రదేశ్ పర్యావరణ, అటవీ శాఖకు సంబంధించిన గ్రీన్ నిర్వహణ కమిటీ చైర్మన్‌గా రాష్ట్ర క్యాబినెట్ హోదా లభించిన సందర్భంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ (లేపాక్షి) చైర్మన్ డా. పసుపులేటి హరి ప్రసాద్ విజయవాడలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో మర్యాదపూర్వకంగా కలిసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర హస్తకళా సంప్రదాయానికి, కళాకారుల నైపుణ్యానికి ప్రతీకగా నిలిచే ప్రఖ్యాత బొబ్బిలి వీణను అన్నయ్య కొణిదెల …

Read More »

సింగ్ నగర్‌ సెయింట్ ఆన్స్‌ స్కూల్లో ఫైర్ సేఫ్టీ డెమో.. ప్రమాదాలపై అవగాహన ఉండాలి: ఆర్‌ఎఫ్‌ఓ రత్నబాబు

-​పాఠశాలలో ఫైర్ మాక్ డ్రిల్, భద్రతా ప్రమాణాల తనిఖీ ​-అత్యవసర సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలపై విద్యార్థులకు దిశానిర్దేశం ​-హాజరైన ప్రధానోపాధ్యాయురాలు సిస్టర్ ఆశా జార్జ్, సిబ్బంది విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పాఠశాల స్థాయిలో విద్యార్థులకు అగ్ని ప్రమాదాలు, వాటి నివారణ మార్గాలపై సంపూర్ణ అవగాహన ఉండాలని ప్రాంతీయ అగ్నిమాపక అధికారి (ఆర్‌ఎఫ్‌ఓ) రత్నబాబు పిలుపునిచ్చారు. మంగళవారం విజయవాడ సింగ్‌నగర్‌లోని ప్రముఖ సెయింట్ ఆన్స్ ఉన్నత పాఠశాలలో అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం, ఫైర్ సేఫ్టీ మాక్ డ్రిల్ …

Read More »

గుడివాడలో లెగసీ వేస్ట్ తొలగించని ఏజన్సీపై పట్టాభిరామ్ ఆగ్రహం

-మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించి పరిస్థితి చక్కదిద్దే ప్రయత్నం గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా జిల్లా గుడివాడ మున్సిపాల్టీలోని డంపింగ్ యార్డ్ లో లెగసీ వేస్ట్ ని తొలగించే ఏజన్సీ నిర్లక్ష్య వైఖరిపై స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డంపింగ్ యార్డ్ లో లెగసీ వేస్ట్ త్వరితగతిన తొలగించకపోవడం వల్ల, పట్టణంలో రోజువారీ వచ్చే చెత్తని డంప్ చేయడం మున్సిపాల్టీకి పెద్ద సమస్యగా మారింది. విషయం తెలుసుకున్న చైర్మన్ పట్టాభిరామ్ మంగళవారం గుడివాడ మున్సిపల్ కార్యాలయాన్ని …

Read More »