• ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచనతో ప్రత్యేక క్యూఆర్ కోడ్ విధానం మొదలు • స్కాన్ చేస్తే చాలు.. కళాఖండం చరిత్ర చెప్పేస్తుంది… కళాకారుడి కష్టాన్ని వివరిస్తుంది.. • నకిలీ ఉత్పత్తుల నిరోధానికీ ఉపయోగం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ హస్తకళలకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావాలన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆలోచనలకు అనుగుణంగా లేపాక్షి ప్రత్యేక కార్యాచరణ మొదలుపెట్టింది. దీనిలో భాగంగా ప్రతి కళాఖండం, కళారూపం పూర్తి వివరాలు తెలిసేలా, దాన్ని రూపొందించిన కళాకారుడికి తగిన గుర్తింపు లభించేలా …
Read More »Monthly Archives: August 2026
అల్లికలతో అలసిన కళ్లకు కొత్త వెలుగులు
-దృష్టి లోపాలున్న క్రోచెట్ లేస్ కళాకారులకు కళ్లజోళ్లు పంపించిన పవన్ కళ్యాణ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : క్రోచెట్ లేస్ కళాకారుల కష్టాలను తెలుసుకున్న రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మసకబారిన వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతున్నారు. వైద్య పరీక్షలు చేయించి వదిలేయకుండా, 141 మందికి కళ్లజోళ్లు సిద్ధం చేయించారు. గత నెల విజయవాడ వేదికగా ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ నిర్వహించిన హస్తకళా మహోత్సవ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన పవన్ కళ్యాణ్ కళాకారులతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా పలువురు …
Read More »చేనేతలకు అండగా ప్రజా ప్రభుత్వం
-‘నేతన్న సేవలో’ పథకం కింద ఒక్కో కుటుంబానికి రూ.25 వేలు -జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చీరాలలో నిధులు విడుదల చేయనున్న సీఎం -రూ.179 కోట్లతో 71,536 చేనేత కుటుంబాలకు లబ్ధి -నేతన్న కుటుంబాలతో ముఖాముఖి కానున్న ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నేతన్నల కుటుంబాలకు ప్రజా ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఇప్పటికే ఉచిత విద్యుత్, రాయితీలు, 50 ఏళ్లకే పింఛన్ అందిస్తూ దన్నుగా ఉంటోన్న ప్రభుత్వం… తాజాగా వారి సంక్షేమానికి మరో అడుగు ముందుకేసింది. నేతన్న సేవలో పథకం …
Read More »క్యాబినెట్ సమావేశంలోని అంశాలు…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన 1391 వ (54వ) క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సచివాలయం నాల్గవ భవనం ప్రచార విభాగంలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖామాత్యులు కొలుసు పార్థసారధి మీడియాకు వివరించారు. 1. పురపాలక & పట్టణాభివృద్ధి శాఖ: విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ (VER) కార్యక్రమం కింద GVMC పరిధిలోని జోన్-IV, వార్డు నెం.35లో ఉన్న వెలంపేట మురికివాడ …
Read More »సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసిన లంకా దినకర్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని ఈరోజు రాష్ట్ర సచివాలయంలో ఇరవై సూత్రాల కార్యక్రమాలు (వికసిత్ భారత్ – స్వర్ణ ఆంధ్రప్రదేశ్) అమలు ఛైర్మెన్ లంకా దినకర్ మర్యాదపూర్వకంగా కలిసి, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుపై రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో రెండు దశలుగా నిర్వహించిన సమీక్ష సమావేశాల నివేదికను సమర్పించారు. అలాగే రాష్ట్రస్థాయిలో నిర్వహించిన వివిధ అంశాల సమీక్షలు, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలును అధ్యయనం చేసేందుకు …
Read More »విజయవాడలో ‘పవర్’ సినిమాకు క్లాప్ కొట్టి ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడలోని ఘంటసాల ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల ప్రాంగణంలో చిన్న సినిమాగా రూపొందుతున్న “పవర్” చిత్రం గురువారం నాడు ప్రారంభమైంది. వీఆర్పీ క్రియేషన్స్ పతాకంపై వెంకటరమణ పసుపులేటి దర్శకత్వంలో పరిమిత బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిన్న సినిమా ముహూర్తపు సన్నివేశానికి రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కెమెరా స్విచ్ ఆన్ చేసి, తొలి క్లాప్ కొట్టారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. పరిమిత బడ్జెట్‌తో నూతన ఆలోచనలతో వస్తున్న ‘పవర్’ చిత్రం పెద్ద …
Read More »సైబర్ నేరాల నియంత్రణకు ఆంధ్రప్రదేశ్‌లో పటిష్ట చర్యలు
-53వ PRAGATI సమావేశంలో రాష్ట్ర చర్యలను వివరించిన చీఫ్ సెక్రటరీ జి. సాయి ప్రసాద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టులు, ఆన్‌లైన్ ఆర్థిక మోసాలను సమర్థవంతంగా అరికట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాంకేతికత ఆధారిత సమగ్ర చర్యలు చేపడుతోందని చీఫ్ సెక్రటరీ జి. సాయి ప్రసాద్ తెలిపారు. సైబర్ నేరాలపై వేగవంతమైన స్పందనతో పాటు, నేరాలు జరగకముందే గుర్తించి నివారించే విధానానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి డా. పి.కె. మిశ్రా అధ్యక్షతన గురువారం …
Read More »ఎంఎస్ఎంఈలకు రుణ ప్రక్రియ సులభతరం చేయండి
– మంత్రి కొండపల్లి శ్రీనివాస్ – సచివాలయంలో బ్యాంకర్లు, ఎంఎస్ఎంఈ అసోసియేషన్ల సమావేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎంఎస్ఎంఈలకు రుణ ప్రక్రియ సులభతరం చేయాలని బ్యాంకర్లకు రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. గురువారం మంత్రి అధ్యక్షతన రాష్ట్ర స్థాయి బ్యాంకర్లు, ఎంఎస్ఎంఈ అసోసియేషన్లతో సెక్రటేరియట్‌లోని 5వ బ్లాక్‌లోని కాన్పరెన్స్ కార్యాలయంలో జరిగిన సమీక్షలో మంత్రి మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు …
Read More »అజయ్ బాబు సాధన తెలుగు జాతికి గర్వకారణం… : శాప్ చైర్మన్ రవి నాయుడు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కామన్వెల్త్ క్రీడల్లో రజత పతకాన్ని కైవసం చేసుకుని దేశ ప్రతిష్టను, తెలుగు జాతి గౌరవాన్ని ఇనుమడింపజేసిన అజయ్ బాబుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రశంసల వర్షం కురిపించింది. గురువారం ఇందిరాగాంధీ స్టేడియం శాప్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో శాప్ చైర్మన్ రవి నాయుడు, మాట్లాడుతూ ఆయన సాధించిన ఈ విజయం రాష్ట్రానికి గర్వకారణమని కొనియాడింది. కఠోర శ్రమ అరుదైన వారసత్వం అజయ్ బాబు సాధించిన ఈ పతకం కేవలం ఒక రోజులో వచ్చింది కాదని, …
Read More »ఎయిమ్స్ మంగళగిరిలో ప్రత్యేక బర్న్స్ మరియు ప్లాస్టిక్ సర్జరీ విభాగం ప్రారంభం
-970 పడకలతో సంస్థ ఇప్పుడు పూర్తిస్థాయిలో కార్యకలాపాలు సాగిస్తోంది అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌లో తృతీయ స్థాయి ఆరోగ్య సంరక్షణ సేవలను బలోపేతం చేయడంలో మరో ప్రధాన మైలురాయిగా నిలుస్తూ, మంగళగిరిలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ఈ రోజు తన ప్రత్యేక బర్న్స్ & ప్లాస్టిక్ సర్జరీ బ్లాక్‌ను ప్రారంభించింది. ఈ సంస్థ 43 క్లినికల్ మరియు నాన్-క్లినికల్ విభాగాలతో, 970 పడకల పూర్తిస్థాయి తృతీయ స్థాయి సంరక్షణ ఆసుపత్రిగా మారిందని కూడా ప్రకటించింది. ఈ …
Read More »
Prajavartha Online Telugu News