Monthly Archives: August 2026

తిరుపతి జిల్లాలో చెరకు సాగు క్షీణత ఆందోళనకరం

-చెరకు సాగు అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కోరిన ఎంపీ గురుమూర్తి న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లాలో చెరకు సాగు విస్తీర్ణం, ఉత్పత్తి క్రమంగా తగ్గిపోతున్న నేపథ్యంలో ఎంపీ గురుమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి కారణాలు, రైతులకు అందిస్తున్న సహాయం, చెరకు పరిశ్రమ పునరుద్ధరణకు తీసుకుంటున్న చర్యలపై తిరుపతి ఎంపీ గురుమూర్తి మంగళవారం లోక్‌సభలో ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి రామ్‌నాథ్ ఠాకూర్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. గత ఐదేళ్లలో …

Read More »

నాయుడుపేట, తూర్పుకనుపూరు ఎన్‌హెచ్-71కు ఇరువైపులా సర్వీస్ రోడ్లు నిర్మించాలి

-ఎన్‌హెచ్‌ఏఐ చైర్మన్‌ను కలిసి వినతిపత్రం సమర్పించిన తిరుపతి ఎంపీ గురుమూర్తి న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలోని జాతీయ రహదారి 71పై పుదూరు జంక్షన్ నుంచి అన్నమేడు ఆర్‌అండ్‌బీ రోడ్డు జంక్షన్ వరకు ఇరువైపులా సర్వీస్ రోడ్లు నిర్మించాలని తిరుపతి ఎంపీ గురుమూర్తి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ చైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్‌ను కోరారు. ఈ మేరకు మంగళవారం న్యూఢిల్లీలో ఆయనను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఎంపీ గురుమూర్తితో కలిసి స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Read More »

ఠాగూర్ గ్రంథాలయంలో మండలి వెంకట కృష్ణారావు  జయంతి వేడుక

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక మహాత్మా గాంధీ రోడ్డులోని ఠాగూర్ గ్రంథాలయంలో ఈరోజు మండలి వెంకట కృష్ణారావు  జయంతి వేడుక ఘనంగా నిర్వహించబడింది. గ్రంథాలయాధికారికే రమాదేవి ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన గురించి మాట్లాడుతూ ప్రముఖ విద్యావేత్త సంఘ సేవకులు తెలుగు భాష- సంస్కృతి పరిరక్షకుడు విశేష కృషి చేశారు. అంతేకాక యువతలో జ్ఞాన దాహాన్ని పెంచడం వంటి అంశాలను ఆయన ఇచ్చిన ప్రాధాన్యత నేటి తరానికి ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరు ఆచరణలో …

Read More »

జీజీహెచ్ అభివృద్ధి, రోగులకు మెరుగైన వైద్య సేవలే లక్ష్యం

-గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు -జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో పలు అభివృద్ధి ప్రతిపాదనలకు ఆమోదం మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్)లో అభివృద్ధి, రోగులకు మెరుగైన వైద్య సేవలే లక్ష్యంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి అధికారులను ఆదేశించారు. జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్)లో రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం, ఆసుపత్రి మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, భద్రత, పారిశుద్ధ్యం, విద్యుత్ వ్యవస్థ, …

Read More »

కొల్లేరు వన్యప్రాణి అభయారణ్యానికి ఎకో సెన్సిటివ్ జోన్‌కు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి

-జిల్లా స్థాయి సమీక్షలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజి మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కొల్లేరు వన్యప్రాణి అభయారణ్యానికి ఎకో సెన్సిటివ్ జోన్‌ను జిల్లా పరిస్థితులు, ప్రజల జీవనోపాధి, అభివృద్ధి అవసరాలను సమన్వయం చేస్తూ శాస్త్రీయ ప్రాతిపదికన ఖరారు చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన కొల్లేరు వన్యప్రాణి అభయారణ్యం (Kolleru Wildlife Sanctuary) పరిధిలో కృష్ణా జిల్లాలోని గుడివాడ మండలంలోని 12 గ్రామాలు, బాపులపాడు మండలంలోని 5 …

Read More »

మన బడి–మన భవిష్యత్తు పనులను వేగవంతంగా పూర్తి చేయాలి

-ఏ దశలోనూ జాప్యం లేకుండా పనులు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ డీకే బాలాజి మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మన బడి–మన భవిష్యత్తు కార్యక్రమం కింద ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన మరుగుదొడ్ల నిర్మాణం, తాగునీటి సౌకర్యాల కల్పన, మేజర్, మైనర్ మరమ్మతు పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో విద్యాశాఖ, సమగ్ర శిక్ష, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా (ఆర్డబ్ల్యూఎస్) తదితర శాఖల అధికారులతో మన బడి–మన …

Read More »

మండలి వెంకటకృష్ణారావు ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మండలి వెంకటకృష్ణారావు ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం అని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. మంగళవారం ఉదయం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ వద్ద మాజీ మంత్రి, ప్రముఖ ప్రజానాయకుడు, తెలుగు భాషా–సంస్కృతి పరిరక్షకుడు మండలి వెంకటకృష్ణారావు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, మండలి వెంకటకృష్ణారావు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా జీవితాంతం పనిచేసిన దూరదృష్టి గల నాయకుడని …

Read More »

అంతర్జాతీయ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్‌షిప్‌లో ద్విస్వర్ణ పతకాల విజేత ఉప్పాల కోటేశ్వరరావును అభినందించిన కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మంగళవారం ఉదయం తన ఛాంబర్‌లో అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ సెక్రటరీ ఉప్పాల కోటేశ్వరరావును ఘనంగా అభినందించారు. కృష్ణలంకలోని పద్మావతి ఘాట్ వద్ద గల సచివాలయం లో వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్న ఉప్పాల కోటేశ్వరరావు ఆగస్టు 1, 2 తేదీల్లో హైదరాబాద్‌లోని లక్ష్మీ గార్డెన్స్, చంపాపేటలో నిర్వహించిన 2వ ఇంటర్నేషనల్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్‌షిప్లో పాల్గొన్నారు. ఆగస్టు 2న …

Read More »

క్రీడా మౌలిక సదుపాయాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సాధించాలి…

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : క్రీడా మౌలిక సదుపాయాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సాధించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. మంగళవారం ఉదయం తన క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా బందర్ రోడ్డులోని దండమూడి రాజగోపాలరావు ఇండోర్ స్టేడియాన్ని సందర్శించి వివిధ సౌకర్యాలను పరిశీలించారు. స్టేడియంలోని జిమ్, ఇండోర్ క్రీడా విభాగాలు, బ్యాడ్మింటన్ కోర్టులు, స్కేటింగ్ రింక్, వాష్‌రూమ్‌లు తదితర సౌకర్యాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, స్టేడియానికి వచ్చే క్రీడాకారులు, …

Read More »

రాజగోపాలచారి మార్కెట్ స్థలానికి రెండు వారాల్లో సమగ్ర అభివృద్ధి ప్రణాళిక రూపొందించాలి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాజగోపాలచారి మార్కెట్ స్థలానికి రెండు వారాల్లో సమగ్ర అభివృద్ధి ప్రణాళిక రూపొందించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. మంగళవారం ఉదయం తన క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా గాంధీనగర్, గొల్లపూడి బైపాస్, హెచ్.బి. కాలనీ ప్రాంతాలను సందర్శించి వివిధ అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా గాంధీనగర్‌లో ఇటీవల కూల్చివేసిన రాజగోపాలచారి మార్కెట్ స్థలాన్ని పరిశీలించి, ఆ స్థలం ప్రజలకు ఉపయోగపడేలా ఉండటంతో పాటు నగరపాలక సంస్థకు స్థిరమైన …

Read More »