Breaking News

Daily Archives: October 16, 2026

భక్తులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు

-ఎలాంటి సమస్యను గుర్తించినా త్వరితగతిన పరిష్కరించే వ్యవస్థ అందుబాటులో -ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) -100 శాతం సంతృప్తి లక్ష్యంగా చర్యలు తీసుకున్నట్లు వెల్లడి ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త: విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ కుటుంబ సభ్యులతో కలిసి ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మవారిని శుక్రవారం దర్శించుకున్నారు. మూలా నక్షత్రం సందర్భంగా సరస్వతీదేవి అలంకారంలో దర్శనమిస్తున్న అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, విద్యా విజ్ఞానం కలగాలని ఆకాంక్షించారు. దర్శనం అనంతరం ఎంపీ శివనాథ్ మాట్లాడుతూ దసరా శరన్నవరాత్రి …

Read More »

ప్రమాద బాధితులకు సత్వర చికిత్స.. ప్రాణరక్షణే లక్ష్యం

-గోల్డెన్‌ అవర్‌లో విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు కొత్త విధానం -ప్రభుత్వ ఆసుపత్రుల్లో ‘ప్రీ-హాస్పిటల్‌ నోటిఫికేషన్‌’ ప్రారంభం -రాష్ట్ర ట్రామా రిజిస్ట్రీని అందుబాటులోకి తెచ్చిన వైద్య విద్యా సంచాలకుల కార్యాలయం -బాధితుడు ఆసుపత్రికి చేరకముందే సిద్ధం కానున్న అత్యవసర వైద్య బృందాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రమాద బాధితులకు సత్వర వైద్య సేవలు అందించేందుకు వైద్య విద్యా సంచాలకుల కార్యాలయం (డీఎంఈ) రెండు కీలక కార్యక్రమాలను ప్రారంభిస్తోంది. ఇందులో భాగంగా ‘ప్రీ-హాస్పిటల్‌ నోటిఫికేషన్‌’ (పీహెచ్‌ఎన్‌) విధానంతో పాటు రాష్ట్ర …

Read More »

ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో రోగుల భద్రత కమిటీల ఏర్పాటు

-కేంద్ర మార్గదర్శకాల మేరకు 11 కీలక అంశాలపై క‌మిటీల‌ పర్యవేక్షణ -చికిత్సలో పొరపాట్ల నివారణ, వైద్య సేవల నాణ్యత పెంపునకు చర్యలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త: రాష్ట్రంలోని ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో రోగుల భద్రతకు ప్రత్యేక కమిటీలు ఏర్ప‌డ్డాయి. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మార్గదర్శకాల మేరకు రోగుల భద్రతకు ప్రత్యేక అధికారులను నియమించడంతోపాటు, 11 కీలక అంశాలపై పర్యవేక్షణ కోసం కమిటీలను ఏర్పాటు చేశారు. డీఎంఈ డాక్ట‌ర్ విష్ణువ‌ర్ద‌న్ ఆదేశాల మేర‌కు వీటి ఏర్పాటు రాష్ట్రంలోని అన్ని బోధనాసుప‌త్రుల్లో జ‌రిగింది. రోగుల …

Read More »

శ్రీ విజయకీలాద్రిలో వైభవంగా శ్రీ ధాన్యలక్ష్మీ అమ్మవారి అభిషేకం, కుంకుమార్చన

సీతానగరం, నేటి పత్రిక ప్రజావార్త: పరమహంస పరివ్రాజకులు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి మంగళాశాసనములతో, శ్రీ విజయకీలాద్రి దివ్యక్షేత్రంలో నిర్వహిస్తున్న శరన్నవరాత్రి మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం 9 గంటలకు శ్రీ ధాన్యలక్ష్మీ అమ్మవారికి విశేష అభిషేక మహోత్సవం, కుంకుమార్చనలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం 10 గంటలకు శ్రీ ధాన్యలక్ష్మీ అమ్మవారికి శ్రీయాగాన్ని వైభవంగా నిర్వహించారు. సాయంత్రం 5:30 గంటలకు శ్రీ విష్ణుసహస్రనామ స్తోత్ర పారాయణం నిర్వహించారు. అనంతరం శ్రీ ధాన్యలక్ష్మీ అమ్మవారికి పల్లకిసేవ, …

Read More »

శ్యామలాంబ దేవి ఆలయంలో భక్తులకు తీర్థప్రసాదాల పంపిణీ

-12 వేల మంది భక్తులకు తీర్థప్రసాదాల పంపిణీ.. ముఖ్య అతిథిగా పాల్గొన్న బొండా రవితేజ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: విజయవాడలోని 66వ డివిజన్ దావు బచ్చయ్య కాలనీలో ఉన్న శ్రీ శ్యామలాంబ దేవి ఆలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ఆలయ ధర్మకర్త చింతపల్లి కనకరావు ఆధ్వర్యంలో సుమారు 12 వేల మంది భక్తులకు తీర్థప్రసాదాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బొండా రవితేజ పాల్గొని అమ్మవారిని దర్శించుకుని, భక్తులకు తీర్థప్రసాదాలు …

Read More »

మండపేటలో స్థానిక ఎన్నికలపై దేవినేని ఉమా కీలక సమాలోచనలు

-ఎన్నికల విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం -అభివృద్ధి, సంక్షేమ పథకాలే ప్రధాన అజెండాగా ప్రజల్లోకి వెళ్లాలని నేతల పిలుపు మండపేట, నేటి పత్రిక ప్రజావార్త: స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని విజయమే లక్ష్యంగా ముందుకు సాగేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు మండపేట నియోజకవర్గంలో కీలక సమావేశం నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, తూర్పుగోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షుడు, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి ఆధ్వర్యంలో జరిగిన ఈ …

Read More »

చండీహోమంలో పాల్గొన్న మాజీ మంత్రి దేవినేని ఉమా

రాజమండ్రి, నేటి పత్రిక ప్రజావార్త: దేవి శరన్నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి శ్రీరామనగర్‌లోని గుడా మాజీ చైర్మన్ గన్ని కృష్ణ గారి నివాసంలో నిర్వహించిన చండీ హోమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, జిల్లా టిడిపి అధ్యక్షుడు బొడ్డు వెంకటరమణ చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, లోకకల్యాణం, ప్రజల సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని ప్రార్థించారు.

Read More »

54వ డివిజన్ వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్‌ అభ్యర్థిగా శీరంశెట్టి పూర్ణచంద్రరావు నామినేషన్‌ దాఖలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: విజయవాడ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 54వ డివిజన్‌ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్పొరేటర్‌ అభ్యర్థిగా శీరంశెట్టి పూర్ణచంద్రరావు నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన తన కార్యాలయం నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ముందుగా విఘ్నేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం సి.ఎస్‌.ఐ. చర్చిలో ప్రార్థనలు చేసి దైవాశీస్సులు పొందారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పాదయాత్రగా వార్డు సచివాలయానికి చేరుకున్న శీరంశెట్టి పూర్ణచంద్రరావు, రిటర్నింగ్‌ అధికారి …

Read More »

మూలా నక్షత్రం సందర్భంగా కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు విస్తృత సౌకర్యాలు

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: మూలా నక్షత్రం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మ వారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చిన నేపథ్యంలో విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో భక్తులకు విస్తృత స్థాయిలో తాగునీరు, ఆహార పదార్థాలు, పారిశుధ్యం తదితర మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శుక్రవారం తెలిపారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన సౌకర్యాలను అందుబాటులో ఉంచుతూ, భక్తుల రద్దీకి …

Read More »

మేయర్, వార్డు సభ్యుల ఎన్నికల ప్రక్రియ ప్రారంభం

-అక్టోబర్ 16 నుంచి 18 వరకు నామినేషన్ల స్వీకరణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ వద్ద ఏర్పాటు చేసిన నోటీసు బోర్డులో శుక్రవారం ఉదయం మేయర్ ఎన్నికకు సంబంధించి రిటర్నింగ్ ఆఫీసర్, పీడీ హౌసింగ్ రజిని కుమారి పబ్లికేషన్ నోటీసును జారీ చేశారు. రెండవ సాధారణ పురపాలక ఎన్నికల నేపథ్యంలో మేయర్ ఎన్నికకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ అక్టోబర్ 16 నుంచి 18వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు. ప్రతిరోజూ ఉదయం …

Read More »