Breaking News

ఎన్.ఐ.ఆర్.డి లో తిరుపూరు గ్రామీణ యువ‌త‌కు అవ‌గాహ‌న స‌ద‌స్సు కార్య‌క్ర‌మం

-ఎంపి కేశినేని శివ‌నాథ్ ఆధ్వ‌ర్యంలో హాజ‌రైన‌ 50మంది యువ‌తీ, యువ‌కులు
-ఈ స‌ద‌స్సు కి హాజ‌రైన ఎమ్మెల్యే కొలిక‌పూడి శ్రీనివాస‌రావు

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎంపి కేశినేని శివనాథ్ ఆధ్వ‌ర్యంలో జాతీయ గ్రామీణాభివృద్ది సంస్థ (ఎన్.ఐ.ఆర్.డి) స‌హ‌కారంతో గ్రామీణ యువ‌తీ యువ‌కుల‌కు స్వ‌యం ఉపాధి అవ‌కాశాల‌పై అవ‌గాహ‌న స‌ద‌స్సు సోమ‌వారం హైద‌రాబాద్ లోని రాజేంద్రనగర్ గ‌ల‌ జాతీయ గ్రామీణాభివృద్ది, పంచాయతీ రాజ్ (ఎన్.ఐ.ఆర్.డి.పి.ఆర్) సంస్థ లో ఏర్పాటు చేయ‌టం జ‌రిగిందని ఎంపి కేశినేని శివ‌నాథ్ కార్యాల‌యం ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

ప్ర‌తి ఇంటి నుంచి ఒక ఎంట‌ర్ ప్రెన్యూర్ వుండాల‌న్న ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఆశ‌యాల‌కు అనుగుణంగా కృషి చేస్తున్న‌ విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ మొద‌టి విడ‌తగా తిరువూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి 50 మంది యువతీ యువ‌కుల‌ను స్వ‌యం ఉపాది అవ‌కాశాల‌పై ఎన్.ఐ.ఆర్.డి లో ఏర్పాటు చేసిన అవ‌గాహ‌న స‌ద‌స్సు కి పంపించారన్నారు. ఈ అవ‌గాహ‌న స‌ద‌స్సులో తిరువూరు నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే కొలిక‌పూడి శ్రీనివాస‌రావు కూడా పాల్గొన్నట్లు తెలిపారు.

ఈ అవ‌గాహ‌న స‌ద‌స్సు లో రూరల్ డెవలప్ మెంట్ నిమిత్తం సెంటర్ గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులు, వున్న పథకాలు, గ్రామీణా ప్రాంత ప్రజల జీవనోపాధి మెరుగుపర్చేందుకు, సిల్క్ డెవలప్ మెంట్ ద్వారా ఉపాధి కల్పించే అవకాశాలను ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ డా.జి నరేంద్రకుమార్ ఐ.ఏ.ఎస్ తో పాటు ఇత‌ర అధికారులు వివ‌రించారు.

అలాగే బ‌యో పెస్టిసైడ్స్ అండ్ నీమ్ బేస్డ్ ప్రొడ‌క్ట్స్ , వ‌ర్మికంపోస్ట్, ముష్రూమ్ క‌ల్టివేష‌న్ అండ్ ప్రొసెస్, హ‌నీ మేకింగ్ ప్రొసెపింగ్, సోయా అండ్ మిల్లేట్ ప్రొడ‌క్ట్స్ ప్రిప‌రేష‌న్, లీఫ్ ప్లేట్ అండ్ క‌ప్ మేకింగ్, డైయింగ్ అండ్ వీవింగ్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ , హ్యాండ్ మేడ్ పేప‌ర్, ట్రైబుల్,ఫ్యాష‌న్ అండ్ పేప‌ర్ జ్యూయ‌ల్ల‌రి, హోమ్ బేస్ట్ ప్రొడ‌క్ట్స్ తో పాటు దాదాపు 15కి పైగా స్వ‌యం ఉపాధి అవ‌కాశాల పై అవ‌గాహ‌న క‌ల్పించారని ప్ర‌క‌టించారు.

ఈ కార్య‌క్ర‌మంలో టిడిపి రాష్ట్ర నాయ‌కులు మాదిగాని గురునాథం, ఎన్.ఐ.ఆర్.డి సీనియ‌ర్ క‌న్స‌ల్టెంట్ మ‌హ్మాద్ ర‌ఫీ, టిడిపి నాయ‌కులు కాకు మ‌ల్లిఖార్జున యాద‌వ్, జి.వి.న‌ర‌సింహారావు ల‌తోపాటు త‌దిత‌రులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *