విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్ర ప్రదేశ్ స్కూల్ గేమ్స్ మరియు ఉమ్మడి కృష్ణా జిల్లా స్కూల్ గేమ్స్ ఈ నెల 6 నుంచి నిర్వ హించనున్న 68 వ స్కూల్ గేమ్స్ అండర్ 19 బాలికల జాతీయ వాలీ బాల్ పోటీల్లో పాల్గొనడానికి వివిధ రాష్ట్రాల జట్లు శనివారం నగరానికి చేరుకున్నాయి.ఆంధ్ర ప్రదేశ్,జమ్మూ కాశ్మీర్,రాజస్థాన్,గుజరాత్, సి.బి. ఎస్.ఇ,హిమాచలప్రదేశ్ జట్లు శనివారం నగరానికి చేరుకున్నాయి.ఈ రాష్ట్రాల జట్లుకు రైల్వే స్టేషన్ లో స్థానిక వ్యాయామ ఉపాధ్యాయులు సంప్రదాయ పద్ధతిలో హారతులు ఇచ్చి స్వాగతం పలికారు.పోటీల్లో పాల్గొనే జట్టుకు స్థానిక హోటళ్లలో నిర్వాహకులు బస ఏర్పాటు చేశారు.ఈ జాతీయ పోటీల్లో 27 జట్లుకు హోటళ్లలో 120 కు పైగా గదులను ఏర్పాటు చేసారు.పోటీల నిర్వహణకు సమగ్ర శిక్ష ప్రాజెక్టు డైరెక్టర్ బి శ్రీనివాసరావు 12 లక్షల రూపాయల నిధులను విడుదల చేశారని రాష్ట్ర స్కూల్ గేమ్స్ కార్యదర్శి జి భాను మూర్తి రాజు తెలిపారు.పోటీలకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ వి.విజయ్ రామరాజు గారి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ డాక్టర్.లక్ష్మిషా గారు వివిధ డిపార్టుమెంటు లకు బాధ్యతలు కేటాయించి పర్యవేక్షిస్తున్నారు.వాలీ బాల్ కోర్టుల నిర్మాణ వ్యయం మొత్తం సిద్ధార్థ అకాడమీ భరిస్తుందని ,జాతీయ పోటీల చీఫ్ రిఫరీ గా డి .దయాకర్ వ్యవహరిస్తున్నారని భాను మూర్తి తెలిపారు. రాష్ట్రానికి చేరుకున్న జట్లు పి బి సిద్ధార్థ కళాశాల మైదానం లో సాధన చేశాయి.ఆదివారం ఉదయం నుంచి జట్ల రిజిస్ట్రేషన్ ,ధ్రువపత్రాల పరిశీలన జరుగుతాయని పోటీల ఆర్గనైజింగ్ కార్యదర్శి వి రవికాంత తెలిపారు. జాతీయ పోటీల్లో పాల్గొనే ఆంధ్ర ప్రదేశ్ జట్టు వివరాలు వెల్లడించారు. సి.హెచ్ శ్రీపద్మజ జట్టుకు నాయకత్వం విహిస్తుండగా,వి.మనోజ్ఞ,ఎం.విజయలక్ష్మి,ఎం.మౌనిక,వి.కుసుమప్రియా,జె.శిరీష,వై చంద్రిక,వి.లిఖిత,డి.తులసి, సి హెచ్ మాధవి,బి.యేసుమణి ,ఎం. కాల్య హాసంతి లు జట్టు సభ్యులు గా ఉన్నారు.జట్టు శిక్షకుడిగా వై.ఉమాకాంత్,మేనేజర్ గా కె.శశిరేఖ లు వ్యవహరిస్తున్నారు.
Prajavartha Online Telugu News