Breaking News

పార్కులను అభివృద్ధి చెయ్యండి

-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ఆదేశాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో పార్క్ అన్ని  అభివృద్ధి చేయాలని, ఏ పార్కులో ఎటువంటి మరమ్మత్తు ఉండకూడదని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం తన పర్యటనలో భాగంగా 25వ డివిజన్లో పారిశుధ్య నిర్వహణ, 32వ డివిజన్లో అల్లూరి సీతారామరాజు పార్కు 33 డివిజన్ సత్యనారాయణపురం నందు ఆంధ్ర రత్న పార్కు, పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ఉన్న అన్ని పార్కులను మరమ్మతులు చేసి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని, పార్కు వచ్చే సందర్శకులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని అన్నారు. అల్లూరి సీతారామరాజు పార్క్ లో ప్రత్యేకంగా పార్కింగ్  కు ఏరియాను ఏర్పాటు చేయాలన్నారు. టికెట్ కౌంటర్, ఓపెన్ ఎయిర్ థియేటర్ వద్ద లైటింగ్ను పెంచాలన్నారు. పార్క్ గోడలకు అందమైన పెయింటింగ్స్ వెయ్యించి సందర్శకులను ఆకర్షించే విధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.

తదుపరి 33వ డివిజన్ సత్యనారాయణపురంలోని ఆంధ్ర రత్న పార్కును పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు, పార్క్ లో ఉన్న  రిపేర్లను పూర్తి చేసి సందర్శకులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో అందించాలన్నారు. ముఖ్యంగా మరుగుదొడ్లు నిర్మాణం చేపట్టాలని  అధికారులను ఆదేశించారు.

ఈ పర్యటనలో చీఫ్ ఇంజనీర్ ఆర్ శ్రీనాథ్ రెడ్డి, చీఫ్ సిటీ ప్లానెర్ జి వి జి ఎస్ వి ప్రసాద్, జోనల్ కమిషనర్ ప్రభుదాస్,  సూపరిండెంటింగ్  ఇంజనీర్  పి సత్యకుమారి, డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ రామ్మోహన్,  ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డి, ఇంచార్జ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (పార్క్స్) చంద్రశేఖర్,  తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *