Breaking News

పారిశుద్ధ్య   నిర్వహణకు మినీ గార్బేజ్  ట్రాన్స్ఫర్ స్టేషన్

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర  ఆదేశాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో మెరుగైన పారిశుధ్య నిర్వహణకు మినీ ట్రాన్స్ఫర్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం తన పర్యటనలో భాగంగా సాంబమూర్తి రోడ్, ధర్నా చౌక్, పూర్ణానంద పేట  ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

మెరుగైన పారిశుధ్య నిర్వహణ కోసం సాంబమూర్తి రోడ్లో ఏర్పాటుచేసిన మినీ గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ను పరిశీలించారు, అటువంటి గార్బేజ్ స్టేషన్లు నగరంలో అవసరమైన ప్రతి చోట  ఏర్పాటు చేయాలని,  సాంబమూర్తి రోడ్ లో ఉన్న మినీ గార్బేజ్  ట్రాన్స్ఫర్ స్టేషన్ ముందు అందంగా కనిపించేందుకు,  కాలుష్యాన్ని అరికట్టేందుకు పచ్చటి మొక్కల్ని పెట్టే ప్రణాళికలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

సాంబమూర్తి రోడ్డు వద్ద గల పబ్లిక్ టాయిలెట్లను పరిశీలించారు. నిత్యం పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పరిశుభ్రంగా, మరమ్మతులు లేకుండా చూసుకోవాలని అధికారాలను ఆదేశించారు.

పూర్ణానంద పేట్  పర్యటించి రోడ్ల పైన ఎటువంటి ఆక్రమణలు జరగకుండా, వ్యాపారస్తులు వారి ప్రాంతాలలోనే వారు వ్యాపారాలు చేసుకునేటట్టు చూసుకోవాలని, ట్రాఫిక్ అంతరాయం ఉన్న అక్రమాణాలను ఎప్పటికప్పుడు తొలగించాలని అధికారులను ఆదేశించారు. ధర్నా చౌక్ వద్ద గల అన్న క్యాంటీన్ ను పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిర్ణిత సమయంలో ఎటువంటి ఆలస్యం లేకుండా అన్న క్యాంటీలను తెరవాలని. నిర్ణిత టోకెన్లు అన్ని ప్రజలకు అందేటట్టు అధికారులు పర్యవేక్షిస్తూ ఉండాలని అధికారులను ఆదేశించారు.

ఈ పర్యటనలో చీఫ్ ఇంజనీర్ ఆర్ శ్రీనాథ్ రెడ్డి, చీఫ్ సిటీ ప్లానెర్ జి వి జి ఎస్ వి ప్రసాద్, జోనల్ కమిషనర్ ప్రభుదాస్,  సూపరిండెంటింగ్  ఇంజనీర్  పి సత్యకుమారి, డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ రామ్మోహన్,  ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డి, ఇంచార్జ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (పార్క్స్) చంద్రశేఖర్,  తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *