Breaking News

హంద్రీ-నీవా విస్తరణతో ఎంతో మేలు

-రాష్ట్ర బీసీ సంక్షేమ మంత్రి సవిత
-మడకశిర బ్రాంచ్ కాలువ కింద 3 చానళ్ల ఏర్పాటుతో 30 చెరువులకు నీళ్లు
-తక్షణమే నిధులు మంజూరు చేయండి
-జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో మంత్రి సవిత

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
హంద్రీ-నీవా సుజల స్రవంతి(హెచ్ఎన్ఎస్ఎస్) ప్రాజెక్టు కింద చేపట్టే వంతెనలు, కాలువల నిర్మాణంతో ఉమ్మడి అనంతపురం జిల్లాకు ఎంతో మేలు కలుగుతుందని రాష్ట్ర బీసీ సంక్షేమ మంత్రి ఎస్.సవిత తెలిపారు. గురువారం విజయవాడలోని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి క్యాంపు కార్యాలయంలో హంద్రీ-నీవా సుజల స్రవంతి(హెచ్ఎన్ఎస్ఎస్) ప్రాజెక్టు కింద చేపట్టే పనులపై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రులు సవిత, సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, హంద్రీ-నీవా సుజల స్రవంతి ప్రాజెక్టు పనుల విస్తరణంతో ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎంతో అభివృద్ధి జరుగుతుందన్నారు. హంద్రీ-నీవా మడకశిర బ్రాంచ్ కాలువ కింద మూడు సబ్ చానళ్లు ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. చాళకూరు, రొద్దం మండలం కొగిర, పెనుకొండలోని రాంపురంలో ఈ సబ్ చానళ్లు ఏర్పాటు చేయాలన్నారు. ఈ మూడు సబ్ చానళ్లతో 30 చెరువులకు నీరందరించే అవకాశం ఉందన్నారు. ఈ 30 చెరువులు నీటితో నింపితే, పెనుకొండ సస్యశ్యామలంగా మారుతుందని మంత్రి సవిత వెల్లడించారు. తక్షణమే సబ్ చానళ్ల ఏర్పాటుకు నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును మంత్రి సవిత కోరారు. ఈ సమీక్షాసమావేశంలో పలువురు జలవనరుల శాఖాధికారులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *