Breaking News

ఆక్రమణలు పునరావృతం కాకుండా భాధ్యత తీసుకోవాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలో ఈ నెల 15వ తేదీలోగా వార్డ్ సచివాలయాల వారీగా డ్రైన్లు, రోడ్ల ఆక్రమణలను పూర్తి స్తాయిలో తొలగించాలని, ఆక్రమణలు పునరావృతం కాకుండా ప్లానింగ్ కార్యదర్శులు, టిపిబిఓలు భాధ్యత తీసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్  ఆదేశించారు. గురువారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో పట్టణ ప్రణాళిక అధికారులు, కార్యదర్శులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్  మాట్లాడుతూ గుంటూరు నగరంలో 4 ఆర్ఓబిలు నిర్మించడానికి అనుమతులు వచ్చాయని, సదరు ఆర్ఓబిలు నిర్మాణ పనులు ప్రారంభమైతే ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా రోడ్ల, డ్రైన్ల ఆక్రమణలను తప్పనిసరిగా తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆక్రమణలు తొలగించిన ప్రాంతాల్లో తిరిగి ఆక్రమణలు జరిగితే సంబందిత ప్లానింగ్ కార్యదర్శి, టిపిబిఓలదే భాధ్యత అని, ఆక్రమణలు తొలగించినప్పటికీ పదే పదే ఆక్రమణలు చేస్తున్న వారి పై కేసులు నమోదు చేయాలన్నారు. ఏటి అగ్రహారం జీరో లైన్, శారదకాలనీ, తారకరామ నగర్, నెహ్రు నగర్ మెయిన్ రోడ్లకు సంబందించి రోడ్ డవలప్మెంట్ ప్లాన్ (ఆర్డీపి)లను సిద్దం చేయాలన్నారు. సోమవారం నుండి సచివాలయాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని, కార్యదర్శుల వద్ద హ్యాండ్ బుక్ లేదా కాని డైరీ తప్పనిసరిగా ఉండాలన్నారు. త్వరలో జియో ట్యాగ్ కి సమంబందించి ప్రత్యేకమైన యాప్ అందుబాటులోకి తీసుకురానున్నామని, సదరు యాప్ లో అప్ లోడ్ చేయడానికి వీలుగా సచివాలయం పరిధిలో ప్రభుత్వ స్థలాలు, పార్కులకు సంబంధించిన సమగ్ర వివరాలు, మ్యాపులను కార్యదర్శులు కల్గి ఉండాలన్నారు. నగరంలో అనధికార హోర్డింగ్ లు మరియు బ్యానర్లు ఇష్టానుసారం ఏర్పాటు చేస్తుంటే దళం సభ్యులు ఏమి చేస్తున్నారని అసహనం వ్యక్తం చేసి, అనుమతులు లేని హోర్డింగ్ లు మరియు బ్యానర్లను వెంటనే తొలగించాలని ఆదేశించారు. హోర్డింగ్ ల ఏర్పాటుకు అనుమతులు తీసుకున్నఏజెన్సీలు, డిమాండ్, హోర్డింగ్ ల వివరాలతో కూడిన నివేదికను అందించాలన్నారు. ఏజెన్సిలు నగర పాలక సంస్థకు చెల్లించాల్సిన డిమాండ్ త్వరితగతిన వసూలు చేయాలని కార్యదర్శులను ఆదేశించారు. రోజు వారీ పర్యటనలో అనాధరైజ్డ్ మరియు డీవియేషన్ తో పలు నిర్మాణాలు గుర్తిస్తున్నామని, కార్యదర్శులు ప్రతి రోజు ఫీల్డ్ విజిట్ లు నిర్వహించి అనధికార మరియు డీవియేషన్లతో నిర్మాణాల జరగకుండా పర్యవేక్షణ చేయాలన్నారు. ప్రభుత్వం చేపట్టిన మిస్సింగ్ సిటిజన్ మరియు ఎంఎస్ఎంఈ సర్వేలు వేగవంతం చేసి, త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.
సమావేశంలో సిటి ప్లానర్ రాంబాబు, ఏసిపిలు రెహమాన్, వెంకటేశ్వర రావు, మల్లిఖార్జున రావు, చంద్రశేఖర్, టిపిఎస్ లు, టిపిబిఓలు, సర్వేయర్లు, కార్యదర్శులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *