-P4 పాలసీ అమలుతో నియోజక వర్గ యాక్షన్ ప్లాన్ తయారీ జీరో పావర్టీ దిశగా పక్కాగా ప్రజా ప్రతినిధులు, ప్రజల, వివిధ వర్గాల భాగస్వామ్యంతో ఆచరణాత్మక ప్రణాళికలు గడువు లోపు తయారు కావాలి: సిఎస్ విజయానంద్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
P4 పాలసీ అమలుతో నియోజక వర్గ యాక్షన్ ప్లాన్ తయారీ జీరో పావర్టీ దిశగా పక్కాగా ప్రజా ప్రతినిధులు, ప్రజల భాగస్వామ్యంతో ఆచరణాత్మక ప్రణాళికలు తయారు చేయాలని ఆం.ప్ర రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయానంద్ అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్ష నిర్వహిస్తూ ఆదేశించారు.
గురువారం మధ్యాహ్నం సిఎస్ విజయవాడ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి జీరో పావర్టీ దిశగా P4(పబ్లిక్, పీపుల్,ప్రైవేట్ పార్టనర్ షిప్) పాలసీ, నియోజక వర్గ ప్రణాళిక తయారీపై, కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్ కొరకు స్థల గుర్తింపు, ఎంఎస్ఎంఈ సర్వే అంశాలపై సంబంధిత కార్యదర్శులు వివరించగా తిరుపతి జిల్లా కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ సంబంధిత అధికారులతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సిఎస్, సంబంధిత సెక్రటరీ వివరిస్తూ వికసిత భారత్ లక్ష్యంగా స్వర్ణాంధ్ర విజన్ 2047 మేరకు పది సూత్రాల అమలుతో రాష్ట్రం, జిల్లా 15 శాతం పైగా వృద్ధి రేటు సాధిచడం లక్ష్యంగా జీరో పావర్టీ దిశగా పక్కాగా ప్రణాలికలు తయారీ మరియు అమలుకు చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. కుటుంబంలో ఆర్థిక అభివృద్ధికి p4 మోడల్ ద్వారా పబ్లిక్, పీపుల్ ప్రైవేట్ పార్టనర్ షిప్ ద్వారా చేపట్టడం. అలాగే టాప్ లో ఉన్న 10 శాతం కుటుంబాలు అట్టడుగున ఉన్న 20శాతం కుటుంబాలకు వారి అనుభవాలు, ఎక్సపర్టైజ్ తో అడుగున 20శాతం ఉన్న కుటుంబాలకు చేయూత ఇవ్వాలని అన్నారు. ఫిబ్రవరి 7 నుండి 22 వరకు గ్రామ సభలు పంచాయితీ మీటింగులు నిర్వహణ, అలాగే జిల్లా స్తాయి మీటింగ్ ఇన్చార్జి మంత్రి , ప్రజా ప్రతినిధులు ఎన్జీఓ లు, జిల్లా అధికారులు, నిష్ణాతులతో సమావేశం నిర్వహణ, పోస్టర్స్ తయారీ, వ్యాస రచన పోటీలు, డిబేట్ కార్యక్రమాల నిర్వహణ పాఠశాలలో, మారథాన్ నిర్వహణ జిల్లా ప్రధాన కేంద్రాలలో, 26 ఫిబ్రవరి నాడు కలెక్టర్లు తమ ముఖ్యమైన సలహాలు, రికమెండేశన్లు సిఎస్ కు జిల్లాకు సంబంధించిన జీరో పావర్టీ P4 పాలసీ నివేదికలు సమర్పించాల్సి ఉంటుంది. అలాగే వివిధ కార్యక్రమాలు నిర్వహించాలి అని తెలిపారు. P4 సర్వే నిర్వహణకు మార్గదర్శక సూత్రాలను వివరించారు. కలెక్టర్లు మార్చి 20 నాటికి పూర్తి స్థాయిలో అట్టడుగున ఉన్న 20 శాతం కుటుంబాల గుర్తింపు ప్రక్రియ పూర్తితో ప్రణాలికలు సిద్ధం అవ్వాలని సూచించారు.
కంప్రెజ్డ్ బయో గ్యాస్ సెట్ అప్ కొరకు కావల్సిన స్థలం సేకరణ సత్వరమే చేయాలని మార్గదర్శకాల మేరకు వాటిని టైం లైన్ మేరకు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. అలాగే ఎంఎస్ఎంఈ సర్వే మార్చి 15 నాటికి పూర్తి అయ్యేలా ప్రణాళికా బద్ధంగా చర్యలు చేపట్టాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మౌర్య, ముఖ్య ప్రణాళిక అధికారి, డిపిఓ సుశీల దేవి, డిఎంహెచ్ఓ బాలాజీ నాయక్, ఎస్ఈ ఆర్ డబ్ల్యూఎస్ విజయ్ కుమార్, ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News