Breaking News

పేదరికాన్ని సమూలంగా దూరం చేసే దిశగా ప్రభుత్వ ఆలోచనలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గురువారం రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కె.విజ‌యానంద్‌.. శూన్య పేద‌రికం, పీ-4 విధానం త‌దిత‌రాల‌పై జిల్లాల క‌లెక్ట‌ర్లు, వివిధ శాఖ‌ల ఉన్న‌తాధికారుల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఈ వీసీకి జిల్లా క‌లెక్ట‌రేట్ నుంచి క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌, సీపీవో వై.శ్రీల‌త‌, గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల ప్ర‌త్యేక అధికారి జి.జ్యోతి, జిల్లా ఉద్యాన అధికారి పి.బాలాజీ కుమార్‌, డీపీవో పి.లావణ్య కుమారి, విజయవాడ నగర పాలక సంస్థ అదనపు కమిషనర్ డి.చంద్రశేఖర్ వివిధ శాఖ‌ల అధికారులు హాజ‌ర‌య్యారు. ప్రభుత్వ, ప్రయివేటు, ప్రజల భాగస్వామ్యంతో ప్రతి ఇంటినీ ప్రగతి పథంలో నడిపించి.. అందరి జీవితాల్లో వెలుగులు నింపాలనే పీ-4 పాలసీ గురించి సీఎస్ వివరించారు. పేదరికాన్ని సమూలంగా దూరం చేసే దిశగా ప్రభుత్వ ఆలోచనలను వివరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *