Breaking News

క్రీడ‌ల‌కు సాయం.. క్రీడాంధ్ర‌ప్ర‌దేశ్ ధ్యేయం

-క్రీడ‌ల ప‌ట్ల చిత్త‌శుద్ధిని నిరూపించుకున్న సీఎం చంద్ర‌బాబు
-క్రీడాశాఖ‌మంత్రి రాంప్ర‌సాద్ రెడ్డి, శాప్ ఛైర్మ‌న్ ర‌వినాయుడు చొర‌వ‌తో క్రీడాప్రోత్సాహ‌కాలు విడుద‌ల‌
-ఐదేళ్ల వైసీపీ పాల‌న‌లో రూ.11,68,62,288 క్రీడా ప్రోత్సాహ‌కాలు పెండింగ్‌
-ప్రోత్సాహ‌కాలు అంద‌క 220 మంది క్రీడాకారుల ఇక్క‌ట్లు
-గ‌త న‌వంబ‌ర్‌లో సీఎం దృష్టికి తీసుకెళ్లిన శాప్ ఛైర్మ‌న్‌
-స్పందించిన రెండు నెల‌ల్లోనే క్రీడాప్రోత్సాహ‌కాలు
-189 మంది క్రీడాకారుల‌కు రూ.7,96,62,289 క్రీడాప్రోత్సాహ‌కాలు విడుద‌ల‌
-సీఎంకు శాప్ ఛైర్మ‌న్ కృత‌జ్ఞ‌త‌లు
-హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్న క్రీడాకారులు, క్రీడా సంఘాలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రాన్ని క్రీడాంధ్ర‌ప్ర‌దేశ్‌గా తీర్చిదిద్దాల‌నే ల‌క్ష్యంతో ముందుకెళ్తున్న సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు క్రీడ‌ల ప‌ట్ల ఆయ‌న‌కున్న చిత్త‌శుద్ధిని నిరూపించుకుంటున్నార‌ని క్రీడాశాఖ‌మంత్రి రాంప్ర‌సాద్ రెడ్డి, ఆంధ్ర‌ప్ర‌దేశ్ క్రీడాప్రాధికార సంస్థ‌(శాప్‌) ఛైర్మ‌న్ అనిమిని ర‌వినాయుడు గురువారం విడుద‌ల చేసిన ఓ ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించారు. శాప్ ఛైర్మ‌న్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టాక రాష్ట్ర‌వ్యాప్తంగా ప‌లువురు క్రీడాకారులు క్రీడాప్రోత్సాహ‌కాల బ‌కాయిలు విడుద‌ల చేయాల‌ని పెద్ద ఎత్తున విన‌తిప‌త్రాలు స‌మ‌ర్పించార‌న్నారు. గ‌త ఐదేళ్లలో క్రీడాకారుల భ‌విష్య‌త్తుతో వైసీపీ ప్ర‌భుత్వం ఆడుకుందని, క్రీడాప్రోత్సాహ‌కాలు మంజూరు చేసిన‌ప్ప‌టికీ వాటిని చెల్లించ‌కుండా త‌మ రాజ‌కీయ విన్యాసాల‌కు వినియోగించుకుంద‌న్నారు. ఐదేళ్ల వైసీపీ పాల‌న‌లో 220 మంది క్రీడాకారుల‌కు రూ.11,68,62,288 క్రీడాప్రోత్సాహ‌కాల‌ను చెల్లించ‌కుండా వైసీపీ ప్ర‌భుత్వం ఇబ్బందుల‌కు గురిచేసిందన్నారు. దీనిపై గ‌త న‌వంబ‌ర్ నెల‌లో సీఎం చంద్ర‌బాబు నాయుడు దృష్టికి క్రీడాకారుల స‌మ‌స్య‌ను తీసుకెళ్లామ‌ని, క్రీడాకారుల పెండింగ్ బ‌కాయిల‌ను విడుద‌ల చేయాల‌ని విజ్ఞ‌ప్తి చేశామ‌న్నారు. విజ్ఞ‌ప్తి చేసిన రెండు నెల‌ల్లోనే సీఎం చంద్ర‌బాబు నాయుడు చ‌ర్య‌లు తీసుకున్నార‌ని, రాష్ట్ర‌వ్యాప్తంగా క్రీడాప్రోత్సాహ‌కాల కోసం ఎదురుచూస్తున్న 189 మంది ల‌బ్ధిదారుల‌కు రూ.7,96,62,288 క్రీడాప్రోత్సాహ‌కాల‌ను సీఎం చంద్ర‌బాబు విడుద‌ల చేశార‌న్నారు. అయితే వైసీపీ ప్ర‌భుత్వం 184 మంది క్రీడాకారుల‌కు బ‌కాయిలు పెట్టిన రూ.7,01,37,288 ప్రోత్సాహ‌కాల‌ను కూట‌మి ప్ర‌భుత్వం విడుద‌ల చేసి క్రీడాకారుల‌కు అండ‌గా నిలిచింద‌న్నారు. ఈ ఏడాదిలో రాణించిన క్రీడాకారుల‌కు త‌దుప‌రి బ‌డ్జెట్ ప్రారంభంలోనే ప్రోత్సాహ‌కాల‌ను విడుద‌ల చేస్తామ‌ని శాప్ ఛైర్మ‌న్ హామీ ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా క్రీడాకారులు, క్రీడాసంఘాల నిర్వాహ‌కులు, డీఎస్ఏల అధికారులు, కోచ్‌లు స‌ర్వ‌త్రా హ‌ర్షాతిరేకాలు వ్య‌క్తం చేస్తున్నార‌న్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *