Breaking News

ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు ఎన్జీవో భవనం ఒక వేదిక కావాలి

-ఎన్జీవో భవనానికి సజ్జ రామారావు ఎన్జీవో భవనంగా నామకరణ ఏపీ ఎన్జీజీఓస్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శి కెవి శివారెడ్డి, ఎ విద్యా సాగర్

ఉయ్యురు, నేటి పత్రిక ప్రజావార్త :
ఉద్యోగులకు ఉపాధ్యాయులకు ఎదురైన సమస్యలను చర్చించుకోవడానికి, సమస్యలను పరిష్కరించుకోవడానికి ఎన్జీవో హోమ్ ఒక వేదికల కావాలని ఏపీ ఎన్జీజీఓస్ రాష్ట్ర అధ్యక్షుడు కెవి శివారెడ్డి అన్నారు. స్థానిక గండిగుంట బైపాస్ రోడ్డులో నూతనంగా నిర్మించిన ఏపీ ఎన్జీజీఓస్ భవనంను శుక్రవారంనాడు ఏపీ ఎన్జీజీఓస్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శి కెవి శివారెడ్డి, ఎ విద్యా సాగర్ ప్రారంభించారు.

ఏపీ ఎన్జీజీవోస్ ఉయ్యూరు తాలూకా అధ్యక్ష కార్యదర్శులు వెంకటేశ్వరరావు శ్రీనివాసరావు దంపతులు మొదటి పూజా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ నూతన భవనానికి స్వర్గీయ సజ్జ రామారావు ఎన్జీజీవోస్ హోమ్ పేరును నామకరణం చేసారు.

ఏపీ ఎన్జీజీవోస్ అధ్యక్ష కార్యదర్శులు కేవీ శివారెడ్డి ఏ విద్యాసాగర్ మాట్లాడుతూ గత సంవత్సరంలో ఉయ్యురు లోని ఎన్జీవో భవనంను నిర్మించాలని ఉద్దేశంతో ఉన్నప్పుడు సజ్జ రామారావు కుమారుడు సజ్జ వెంకటేశ్వరరావుని స్థలాన్ని అడగడం జరిగిందని, ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లకు సంబంధించిన భవనంగా నిర్మించుకుంటామని వెంకటేశ్వరరావును కోరిన వెంటనే ఎన్జీవో భవనం నిర్మాణానికి అయిదు సెంట్లు, సుమారుగా 250 గజాలను స్థలాన్ని స్వర్గీయ సజ్జ రామారావు పేరుతో ధానంగా ఇచ్చారని పేర్కొన్నారు. ఒకే కుటుంబంలో పుట్టిన అన్నదమ్ములు కూడా గజం భూమి కోసం కొట్లాడుకోవడం కోర్టులకు వెళ్ళడం జరుగుతున్న ఈరోజుల్లో, అడిగిన వెంటనే ఎన్జీవో భవనానికి ఐదు సెంట్ల స్థలాన్ని విరాళంగా ఇవ్వడం వెంకటేశ్వరరావు మంచి మనస్సుకు నిదర్శనం అని కొనియాడారు. ఉయ్యూరు ఎన్జీవో భవనం ఉన్నంతకాలం సజ్జ రామారావు పేరు గుర్తుండిపోతుందని ఆయన అన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు చెల్లించాల్సిన బకాయిల విషయంలో రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడిన విషయాన్ని తెలియజేశారు. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులని చెప్పి ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను ఆపడం మంచిదికాదని, ఉద్యోగులుగా మేము దాచుకున్నటువంటి జిపిఎఫ్ ఏపీ జి ఎల్ ఐ సొమ్మును మాత్రమే అడగడం జరుగుతుందన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలతో చెప్పామని అన్నారు. రానున్న రోజుల్లో ఉద్యోగ సంఘాల నాయకులతో రాష్ట్ర ముఖ్యమంత్రి సమావేశం ఏర్పాటుచేసి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యలను పూర్తిస్థాయిలో తెలుసుకోవాలని కోరామన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయులపై పెట్టిన కేసులను తీసివేయాలని కోరమన్నారు. ఈ ఎన్జీవో భవనాన్ని నిర్మించుకోవడానికి స్థలాన్ని విరాళం ఇచ్చిన రామారావు కుటుంబ సభ్యులకు ఎన్జీవో భవనాన్ని నిర్మించిన తాలూకా యూనిట్ ఎన్జీవోస్ నాయకులకు అభినందనలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎన్జీవో నాయకులు జిల్లాల ఎన్జీవో నాయకులు, మహిళ విభాగం ఎన్జీవోస్ నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *