
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
తెనాలికి చెందిన దర్శకులు కనపర్తి రత్నాకర్ దర్శకత్వం వహించిన దేశభక్తి డాక్యుమెంటరీ ‘వీరస్థలి తెనాలి’ బెస్ట్ ఫ్రీడమ్‌ఫైట్ అవార్డును గెల్చుకుంది. హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలోని ఎన్టీఆర్ ఆడిటోరియంలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్-టాలెంట్ అవార్డ్స్-2025లో ఉత్తమ సినిమాలకు అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. హైదరాబాద్‌కు చెందిన మోర్డ్ ఫౌండేషన్, సౌమిత్ మీడియా ప్రెజెంట్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన అవార్డుల ప్రధానోత్సవంలో భాగంగా తొలుత ఎంపికైన ఉత్తమ చిత్రాల్లో కొన్ని ముఖ్యమైన పాత్రల గురించి కొద్ది నిడివితో ప్రసారం చేశారు. సహజకవి అయినాల మల్లేశ్వరరావు కథ అందించగా, గల్లా జ్ఞానేశ్వర్ సుజాత ఆర్ట్స్ బ్యానర్‌పై ‘వీరస్థలి తెనాలి’ చిత్రాన్ని నిర్మించారు. కనపర్తి రత్నాకర్ దర్శకత్వం వహించారు. ప్రముఖ సినీ దర్శకులు రేలంగి నరసింహారావు, మాజీ కేంద్రమంత్రి ఎస్.వేణుగోపాలాచారి, డాక్టర్ వంశీకృష్ణ, ఫణీంద్రప్రసాద్, డాక్టర్ శ్రీనివాస్, ఫుష్ప ఫేం జగదీష్, నిర్మాత రాం సత్యనారాయణ, మిస్ తెలంగాణా ప్రియాంక తదితరుల చేతుల మీదుగా అవార్డుల ప్రధానం జరిగింది. దర్శకుడు రత్నాకర్, నటుడు బెల్లంకొండ వెంకట్, ప్రొడక్షన్ ఇన్‌ఛార్జి ఎం.శ్రీకాంత్‌లకు అవార్డుతోపాటుగా జ్ఞాపిక, సర్టిఫికెట్లను అతిథులు అందజేశారు.
Prajavartha Online Telugu News