Breaking News

మల్లాది విష్ణు చేతులమీదుగా వైసీపీ డివిజన్ కార్యాలయం ప్రారంభం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలకు మరింత చేరువగా ఉండేందుకు డివిజన్ కార్యాలయాలు దోహదపడతాయని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. 33వ డివిజన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని శివాజీకేఫ్ సెంటర్ నందు స్థానిక కార్పొరేటర్ శర్వాణి మూర్తితో కలిసి శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వంలో డివిజన్ కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చెందిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 8 నెలల కాలంలో.. ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేపట్టకపోగా స్థానికంగా అనేక సమస్యలు తిష్ట వేశాయని విమర్శించారు. సమస్యల పరిష్కారం కోసం ప్రజల తరపున పోరాటానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని తెలియజేశారు. అనంతరం మల్లాది విష్ణుని శాలువాతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో డివిజన్ ఇంచార్జ్ దోనెపూడి శ్రీనివాసరావు, మైలవరపు రామకృష్ణ, కృష్ణ మోహన్, నాదెండ్ల రవిశంకర్, మారుతీ, వెంకట చంద్రశేఖర్, కూనపులి ఫణి, శిష్ట్లా సీతారామ్, తన్నీరు మురళీకృష్ణ, భాగ్యలక్ష్మి, వి.మధు, ఎ.రామారావు, ప్రసాద్, శ్రీనివాస్, శాంతి శర్మ, సుబ్రహ్మణ్యం, సత్యవాణి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *