Breaking News

మంత్రి నారా లోకేష్ కు ఘన స్వాగతం

-తిరుపతి నందు పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనుటకు రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న రాష్ట్ర విద్యా శాఖ, ఐటి మరియు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఆర్టిజీ శాఖ మంత్రి నారా లోకేష్

రేణిగుంట, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి నందు పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనుటకు నేటి బుధవారం ఉదయం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న గౌ.రాష్ట్ర విద్యా శాఖ, ఐటి మరియు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఆర్టిజీ శాఖ మంత్రి నారా లోకేష్ గారికి సాదర స్వాగతం లభించింది. మంత్రి వెంట తిరుపతి జిల్లా ఇన్చార్జి మంత్రి మరియు రెవెన్యూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మాత్యులు అనగాని సత్యప్రసాద్ ఉన్నారు.

రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మరియు యువజన శాఖ మాత్యులు రాంప్రసాద్, తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్, తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్థన్ రాజు, ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ చక్రవర్తి, తిరుపతి, చంద్రగిరి,సత్యవేడు, నగరి ఎమ్మెల్యేలు ఆరని శ్రీనివాసులు, పులివర్తి వెంకట ముని ప్రసాద్(నాని), కోనేటి ఆదిమూలం,భాను ప్రకాష్, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, మాజీ ఎంఎల్ఏ సుగుణమ్మ, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం విసీ  ఉమా, ఎస్వీ యూనివర్సిటీ విసి, ఆర్డిఓ భాను ప్రకాష్ రెడ్డి పలువురు అధికారులు, ప్రజా ప్రతినిదులు మంత్రికి స్వాగతం పలికారు.

అనంతరం మంత్రి పార్టీ సమావేశంలో పాల్గొనుటకు రోడ్డు మార్గాన బయల్దేరి వెళ్లారు. అలాగే వారు నేటి మధ్యాహ్నం శ్రీ పద్మావతీ మహిళా విశ్వ విద్యాలయం నందలి మల్టీ పర్పస్ ఇండోర్ స్పోర్ట్స్ స్టేడియంను ప్రారంభించనున్నారు. పద్మావతి మహిళా విశ్వ విద్యాలయ విద్యార్థినులతో ముఖా ముఖి మాట్లాడనున్నారు. అనంతరం సాయంత్రం అంతర్జాతీయ దేవాలయాల సదస్సు ముగింపు కార్యక్రమం నందు వారు పాల్గొని తిరుగు ప్రయాణం కానున్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *