Breaking News

రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
శాసనమండలి పట్టబద్రుల ఎన్నికల ప్రక్రియ విజయవంతానికి సహకారం అందించాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డీకే బాలాజీ రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. ఈనెల 27వ తేదీన జిల్లాలో నిర్వహించే కృష్ణ- గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికల నిర్వహణపై మంగళవారం జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆయన చాంబర్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 27వ తేదీన నిర్వహించే పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. జిల్లాలో 63 వేల 114 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. మచిలీపట్నం నోబుల్ కళాశాల, గుడివాడ రెవెన్యూ డివిజనల్ కార్యాలయం, ఉయ్యూరు మార్కెట్ యార్డు లలో పోలింగ్ సామాగ్రి పంపిణీకి డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. 77 పోలింగ్ కేంద్రాలలో 42 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, 35 సాధారణ పోలింగ్ కేంద్రాలుగా గుర్తించామన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద వెబ్ కాస్టింగ్, వీడియో గ్రాఫర్లను ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్ ఉదయం 8 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు జరుగుతుందన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద మెడికల్ క్యాంపులు వీల్ చైర్లు వంటి అన్ని మౌలిక వసతులు కల్పించామన్నారు. జిల్లాలో ఎన్నికల నిర్వహణ సక్రమంగా సజావుగా జరిగేందుకు పూర్తి సహకారం అందించాలని రాజకీయ పార్టీల ప్రతినిధులను కలెక్టర్ కోరారు.

సమావేశంలో సహాయ రిటర్నింగ్ అధికారి డిఆర్ఓ కే చంద్రశేఖర రావు, రాజకీయ పార్టీలు ప్రతినిధులు కొడాలి శర్మ (సిపిఐ. (ఎం)), పీవీ గజేంద్ర రావు (బిజెపి), ఎస్ బాలాజీ (బి.ఎస్.పి) కే. ఫణి భూషణ్ (ఐ ఎన్ సి), కే. వెంకట్రావు (జనసేన), ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *