Breaking News

శాసనమండలి పోలింగ్ రోజున స్పెష‌ల్ క్యాజువ‌ల్ లీవ్‌

-ఎన్నికల పోలింగ్ కు ఏర్పాటుచేసిన 77 పోలింగ్ కేంద్రాలు ఉన్న విద్యాసంస్థలకు ఈ నెల 26, 27 రెండు రోజులు సెలవు దినాలుగా ప్రకటించాం…
-ప‌ట్ట‌భ‌ద్రుల ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్ర‌త్యేక అవ‌కాశం: క‌లెక్ట‌ర్ డీకే బాలాజీ

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 27న శాస‌న మండ‌లి ప‌ట్ట‌భ‌ద్రుల నియోజ‌క‌వ‌ర్గం ఎన్నిక‌ల పోలింగ్ జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఆ రోజు ఓటు హ‌క్కును వినియోగించుకునేందుకు వీలుగా జిల్లాలో ఓటు హ‌క్కు కలిగిన కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు స్పెషల్ క్యాజువల్ లీవ్‌ను భారత ఎన్నికల సంఘం ప్రకటించిన‌ట్లు జిల్లా ఎన్నికల అధికారి, క‌లెక్ట‌ర్ డీకే బాలాజీ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ప్రైవేటు, వ్యాపార‌, వాణిజ్య‌, పారిశ్రామిక, ఇత‌ర సంస్థ‌లు ఓట‌రుగా న‌మోదు చేసుకున్న ఉద్యోగులు, కార్మికులు వారు ఓటు హ‌క్కును వినియోగించుకునేందుకు అనుమ‌తులు ఇవ్వ‌డం, షిఫ్ట్‌ల‌ను అడ్జ‌స్ట్ చేయ‌డం వంటి వెసులుబాట్లు కల్పించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. అదేవిధంగా పోలింగ్ కు ఏర్పాటుచేసిన 77 పోలింగ్ కేంద్రాలు ఉన్న విద్యా సంస్థలలకు ఈ నెల 26, 27 రెండు రోజులు సెలవు దినాలుగా ప్రకటించడం జరిగిందని క‌లెక్ట‌ర్ డీకే బాలాజీ తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *