Breaking News

సెప్టిక్ ట్యాంకర్లు తప్పనిసరిగా ఫీకల్ స్లెడ్జి ని నగరపాలక సంస్థ ఫీకల్ సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ లోనే అన్ లోడ్ చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని సెప్టిక్ ట్యాంకర్లు తప్పనిసరిగా ఫీకల్ స్లెడ్జి ని నగరపాలక సంస్థ ఫీకల్ సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ లోనే అన్ లోడ్ చేయాలని, రోడ్ల పక్కన, డ్రైన్లలో చేస్తే భారీ అపరాధ రుసుం విధిస్తామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ స్పష్టం చేశారు. మంగళవారం కమిషనర్ సుద్దపల్లి డొంక రోడ్ లోని జిఎంసి ఎఫ్ఎస్టీపిని ఇంజినీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ ఎఫ్ఎస్టీపి సామర్ధ్యం, ప్రతి రోజు వస్తున్న ట్రిప్పుల వివరాలు అడిగి తెలుసుకొని మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలో మల వ్యర్ధాలను రోడ్ల పక్కన, డ్రైన్లలో వేయడం వలన ప్రజారోగ్యానికి ప్రమాదమని, అందుకు పరిష్కారంగా ఎఫ్ఎస్టీపిని నిర్మాణం చేశామన్నారు. సెప్టిక్ ట్యాంకర్ల యజమానులు తప్పనిసరిగా ఇళ్లల్లోని సెప్టిక్ ట్యాంక్ ల నుండి తోడిన వ్యర్ధాలను నగరపాలక సంస్థ ఎఫ్ఎస్టీపికే తీసుకొచ్చి ట్రీట్మెంట్ జరిగేలా సహకరించాలన్నారు. అలా కాకుండా రోడ్ల పక్కన, డ్రైన్లలో వేస్తే ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు భారీ మొత్తంలో అపరాధ రుసుం విధించడంతోపాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజారోగ్యం దృష్ట్యా నగరపాలక సంస్థకు సహకరించాలన్నారు. పర్యటనలో ఎస్ఈ నాగమల్లేశ్వరరావు, ఈఈ సుందర్రామిరెడ్డి, డిఈఈ నాగభూషణం, ఏఈ రవి కిరణ్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ అనిల్ కుమార్, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *