గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలో పెరిగిన ట్రాఫిక్ నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో నగరంలోని శంకర్ విలాస్ ఆర్.ఓ.బి నిర్మించుటకు ఇప్పటికే అనుమతులు మంజూరయ్యాయని, నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా నగర పాలక సంస్థ తరుపున చేపట్టవలసిన రోడ్డు విస్తరణ పనులు వేగంగా చేపడుతున్నామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఎఎస్ తెలిపారు. మంగళవారం జిఎంసి పట్టణ ప్రణాళిక అధికారుల ఆధ్వర్యంలో హిందూ కాలేజి నుండి ఏసి కాలేజి వరకు ఏఈఎల్సీ, ప్రభుత్వ భవనాలు, అరండల్ పేట 2వ లైన్ నుండి 10వ లైన్ వరకు ప్రైవేట్ భవనాలను తొలగించడం జరిగింది.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, శంకర్ విలాస్ ఆర్ఓబి నిర్మాణ పనులకై నిమిత్తము చేపట్టిన రోడ్డు విస్తరణ పనులలో భాగముగా మొత్తము 134 ఆస్ధులలో బ్రాడీపేట అరండల్ పేటలకు సంబంధించిన 99 భవన యజమానులకు నోటీసులు ఇవ్వడం జరిగిందని, 14 ప్రభుత్వ భవనాలకు, 21 మిషనరీ ఆస్తులకు రోడ్డు విస్తరణకు గాను నోటీసులు అందజేశామని తెలియచేశారు. పలువురు ప్రైవేట్ భవన యజమానులు, ఏఈఎల్సి ప్రతినిధులు స్వచ్చందంగా రోడ్డు విస్తరణకు ముందుకు వచ్చి అంగీకార పత్రాలను నగర పాలక సంస్థకు అందజేశారన్నారు. రోడ్డు విస్తరణ క్రమంలో భవనాల తొలగింపు వేగవంతం చేస్తున్నామని తెలిపారు. విస్తరణలో మార్కింగ్ ప్రకారం వారి ఆస్తి విలువను బట్టి భవన యజమానులకు కోల్పోయిన భవనాలకు నష్టపరిహారం, స్థలము విలువనకు 4 రెట్లు విలువైన టి.డిఆర్ బాండ్లను అందిస్తామని తెలిపారు. కావున ప్రజలు ఎటువంటి భయాందోళనలకు గురికావద్దని, నగర అభివృద్ధికి చేపడుతున్నరోడ్డు విస్తరణకు ప్రజలు సహాకరించవలసినదిగా కోరారు.
Prajavartha Online Telugu News