Breaking News

ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) ను క‌లిసిన వి.ఎం.సి వెహిక‌ల్ డిపో మెకానిక్స్, హెల్ప‌ర్స్

-పెంచిన రూ.6 వేల హెల్త్ అల‌వెన్స్ ఇప్పించాల్సిందిగా విన‌తి ప‌త్రం అంద‌జేత

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజ‌య‌వాడ న‌గ‌ర పాల‌క సంస్థ పారిశుద్ద్య విభాగం వెహిక‌ల్ డిపోలో ప‌ని చేసే మెకానిక్స్, హెల్ప‌ర్స్ వెహిక‌ల్ డిపో లో పనిచేసే డ్రైవ‌ర్లు, క్లీన‌ర్స్ కు పెంచిన హెల్త్ అల‌వెన్స్ రూ.6 వేలు త‌మ‌కు ఇప్పించాల‌ని కోరుతూ ఎంపి కేశినేని శివ‌నాథ్ కు విన‌తి ప‌త్రం అంద‌జేశారు. ఎపి బిల్డింగ్స్ అండ్ అదర్ కన్స్ స్ట్రక్షన్స్ వర్కర్స్ అడ్వైజర్ కమిటీ చైర్మ‌న్ గొట్టుముక్కల రఘురామరాజు ఆధ్వ‌ర్యంలో గురునాన‌క్ కాల‌నీ లోని విజ‌య‌వాడ పార్లమెంట్ కార్యాల‌యం ఎన్టీఆర్ భ‌వ‌న్ లో ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) ను వెహిక‌ల్ డిపోలో ప‌ని చేసే మెకానిక్స్, హెల్ప‌ర్స్ క‌లిశారు.

విజ‌య‌వాడ న‌గ‌ర పాల‌క సంస్థ పారిశుద్ద్య విభాగం వెహిక‌ల్ డిపోలో APCOS ( Andhra Pradesh Corporation for Outsourced Services) కింద‌ 700 మంది ప‌నిచేస్తుండగా దాదాపు 650 మంది కి డ్రైవ‌ర్లు, క్లీన‌ర్స్ కి హెల్త్ అల‌వెన్స్ కింద రూ.6 వేలు పెంచి ఇస్తున్నారు. ఈ వెహిక‌ల్ డిపోలో మెకానిక్స్, హెల్ప‌ర్స్ గా ప‌నిచేస్తున్న త‌మ 50 మందికి పెంచిన‌ హెల్త్ అల‌వెన్స్ ఇవ్వ‌టం లేద‌ని తెలిపారు. త‌మని కూడా పారిశుద్ద్య కార్మికులుగా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని రూ.6 వేలు హెల్త్ అల‌వెన్స్ ఇప్పించవ‌ల్సిందిగా విజ్ఞ‌ప్తి చేశారు. విజ‌య‌వాడ న‌గ‌ర పాల‌క సంస్థ కి చెందిన పారిశుద్ద్య వాహ‌నాల‌ను రిపేర్ చేసే స‌మ‌యంలో వాహ‌నాల్లోని అనేక వ్య‌ర్ధాలు త‌మ‌పై ప‌డుతూ వుంటాయ‌ని, ఇందుకోసం ఆరోగ్య స‌మ‌స్య‌ల‌తో పాటు చ‌ర్మ‌వ్యాధుల భారిన ప‌డుతున్న‌ట్లు తెలిపారు. వారి సమస్యలపై ఎంపీ కేశినేని శివనాథ్ సానుకూలంగా స్పందించారు.

ఈ కార్య‌క్ర‌మంలో తెలుగునాడు మున్సిప‌ల్ వ‌ర్క‌ర్స్ యూనియ‌న్ నాయ‌కులు రాంబాబు, తోక‌ల ర‌మేష్, డి.బాబురావు, స‌త్తిబాబు, రంగారెడ్డి, మ‌ల్లెప‌ల్లి నాని ల‌తో పాటు మెకానిక్స్, హెల్పర్స్ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *