Breaking News

గ్రామాలు అభివృద్ధి చెందాలంటే మహిళలు ముందు అడుగు వేయాలి

-అనుమంచిపల్లి గ్రామ డ్వాక్రా మహిళలతో ఎన్టీఆర్ జిల్లా ఎన్.ఐ. ఆర్. డి. పి. ఆర్ ప్రతినిధుల సమావేశం

జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త :
ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) ఆదేశాల మేర‌కు డ్వాక్రా మహిళలకు స్వయం ఉపాధి రంగంలో కుటీర పరిశ్రమల ఏర్పాటుపై అవగాహన కల్పించేందుకు ఎన్టీఆర్ జిల్లా nirdpr కోఆర్డినేటర్ జి. వి నరసింహారావు ఆధ్వర్యంలో జగ్గయ్యపేట మండలంలోని అనుమంచిపల్లి గ్రామంలో గురువారం సమావేశం నిర్వహించడం జరిగింది.

ఈ సమావేశంలో ఎన్. ఐ. ఆర్. డి ప్రతినిధి మురళి, ఎన్టీఆర్ జిల్లా nirdpr కోఆర్డినేటర్ జి. వి నరసింహారావు మాట్లాడుతూ డ్వాక్రా గ్రూప్ సంఘం లోని మహిళలకు మహిళలకు స్వయం ఉపాధి రంగంలోనే అవకాశాల గురించి వివరించారు. అలాగే ప్రభుత్వ పరంగా వాళ్లకు వచ్చే పథకాలు అవి ఎలా ఉపయోగించుకోవాలనే అంశం గురించి తెలియజేశారు

ఇక గ్రామాలు అభివృద్ధి చెందాలంటే మహిళలు ముందు అడుగు వేయాలన్నారు . ప్రతి ఇంటిలో ఒక మహిళా వ్యాపారవేత్తగా రావాలన్నారు. ఇందుకు అన్ని విధాలుగా మహిళలకు ఎంపీ కేశినేని శివనాథ్ సహకారం అందిస్తారని తెలిపారు.. డ్వాక్రా గ్రూప్ సభ్యులకి గ్రూపుగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా రుణాలు ఇచ్చే పథకాల గురించి చెప్పారు

ఈ కార్యక్రమంలో మండల సమైక్య అధ్యక్షురాలు గద్దె రాజ్య లక్ష్మి, వెలుగు ఏపీఎం వెంకటేశ్వరరావులతో పాటు గ్రామ నాయకులు పంచాయతీ ఛాంపియన్స్ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *