Breaking News

పంజా సెంటర్ లోని హలీం స్టాల్స్ ను సందర్శించిన ఎంపీ కేశినేని శివనాథ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పశ్చిమ నియోజకవర్గంలోని పంజా సెంటర్లో రంజాన్ మాస సందర్భంగా ఏర్పాటు చేసిన హలీం స్టాల్స్ ను ఎంపీ కేశినేని శివనాథ్ (chinni) గురువారం రాత్రి సందర్శించారు. ముందుగా ఎంపీ కేశినేని శివనాథ్ గణపతి రావు రోడ్డులోని టిడిపి రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి ఫతావుల్లాహ్ కార్యాలయానికి విచ్చేశారు.. అక్కడి నుంచి పంజా సెంటర్ వరకు నాయకులతో కలిసి ప్రజలను పలకరిస్తూ నడుచుకుంటూ వచ్చారు. హలీం స్టాల్స్ అన్నింటినీ సందర్శించి వారి యజమానులతో మాట్లాడారు. రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు ఉండే ముస్లిం సోదరులందరితోపాటు రాష్ట్ర ప్రజలపై ఆ అల్లా ఆశీస్సులు ఉండాలని కోరుకున్నారు. ఈ ఈ సందర్భంగాఎంపీ కేశినేని శివనాథ్ ను ముస్లిం మత పెద్దలు, టిడిపి నాయకులుఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ హర్షద్, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండీ రాకేష్, టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా,టిడిపి రాష్ట్ర కార్య‌నిర్వ‌హ‌క కార్య‌ద‌ర్శి ఎమ్.ఎస్.బేగ్ , తెలుగు మహిళా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు షేక్ ఆషా, ఎన్టీఆర్ జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు కరిముల్లా, పశ్చిమ నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు సుఖాసి సరిత, పశ్చిమ నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు ఆర్ మాధవ్, డివిజన్ అధ్యక్షులు కుంచం దుర్గారావు, జాహిద్, గంగాధర్ రెడ్డి, సలీమ్, తాజుద్దీన్, టిడిపి నాయకులు గుర్రంకొండ, ప్రభుదాసు లతో పాటు స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *