Breaking News

పంటల సాగులో సాంకేతిక బదలాయింపు ప్రక్రియకు వేదికగా నిలుస్తున్న కార్యశాలలు

-డిల్లీ రావు ఐఏఎస్ వ్యవసాయ సంచాలకులు.
-ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు గత నెల నుండి ప్రారంభమైన పంటల వారీ కార్యశాలలు
-వినియోగదారుని ప్రాధాన్యత ,నిరంతర మార్కెట్ రేటు , అధిక దిగుబడులు ప్రాతిపదికగా సీజన్ కు ముందునుంచే పంటల వారీగా కార్యశాలలు
-ఇప్పటివరకు వరి,మినుము,శనగ మరియు ఆముదం పంటలలో పూర్తయిన కార్యశాలలు
-ఈ నెలలోనే పత్తి ,మొక్కజొన్న పంటలలో కూడా నిర్వహిస్తాం
-తొలకరి సాగుకు పంటలు విత్తబోయే ముందే ఈ ప్రక్రియ పూర్తి చేస్తాము 
-పంటల సాగు విధానములో వివిధ భాగస్వామ్యులు అయిన శాస్త్రవేత్తలు ,రైతులు ,ఎగుమతిదారులు ,మిల్లుల యజమానులు మరియు వ్యవసాయ అధికారులను ఒకే వేదికపై సాగు పద్ధతులు,నూతన ఆవిష్కరణల పై పరస్పర అవగాహన,చర్చా కార్యక్రమమునకు అవకాశం కల్పించిన కార్యశాలలు 
-ఇప్పటివరకు జరిగిన అన్ని కార్యశాలలో ప్రత్యక్షముగా పాల్గొని ,పర్యవేక్షించిన వ్యవసాయ సంచాలకులు డిల్లీ రావు ఐఏఎస్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సోమవారం ఆముదం పంట సాగులో నూతన మేలైన సాంకేతిక పద్ధతులు & అధిక దిగుబడులు ప్రాతిపదికగా పాటించవలసిన యాజమాన్య పద్ధతులు పై జరిగిన కార్యశాలలో పరిశోధన సంచాలకులు డాక్టర్ పి వి సత్యనారాయణ తో పాటు డిల్లీ రావు ఐఏఎస్ వ్యవసాయ సంచాలకులు పాల్గొన్నారు . డిల్లీ రావు ఈ కార్యక్రమ ప్రారంభ ఉపన్యాసం లో మాట్లాడుతూ గత నెలలో ముఖ్యమంత్రి వారి ప్రాథమిక రంగ మిషన్ సమీక్షలో ఆదేశాల మేరకు
పంటలవారీగా వర్క్ షాప్ లను జరుపుతున్నామని తెలిపారు .వినియోగ దారుల అవసరాల ప్రాధాన్యత సంతరించుకున్న పంట రకాల సాగు ఎంపిక ,ఎగుమతుల కొరకు ప్రాంతీయంగా మరియు ఇతర ప్రాంతాలకు మార్కెట్ డిమాండ్ వున్న రకాల ఎంపిక ,పంటల సాగులో ఉత్తమ మేలైన యాజమాన్య పద్ధతులు ,నూతన సాంకేతిక ఆవిష్కరణలు ,రైతులు ,ఇతర భాగస్వామ్యులు పంట సాగులో తమ అనుభవాలను పంచుకునేలా ఈ కార్యశాల లు వేదికగా నిలుస్తున్నాయని తెలిపారు. ఈ వేదికలలోని వివిధ భాగస్వాముల ద్వారా జరుపుకున్న చర్చా కార్యక్రమంలలో నిర్మాణాత్మక సూచనలు ,పరస్పర సాంకేతిక పరిజ్ఞాన బదిలీ ప్రక్రియ జరిగిందని తెలిపారు.సాగులో విజయవంతమైన వివిధ యాజమాన్య సాగుపద్ధతుల నమూనా మోడల్ లను సేకరించడం జరిగింది అని తెలిపారు. కార్యశాలల ద్వారా వివిధ పంటలలో సేకరించిన సమాచారంను ,మేలైన వాటిని క్రోడీకరించి ,ఏప్రిల్ మాసములో జరిపే ప్రాంతీయ వ్యవసాయ సాంకేతిక సదస్సులలో సిఫారసు చేస్తామని తెలిపారు. ఈ కార్యశాలను జిల్లాస్థాయిలో కూడా ఏర్పాటు చేయవలసినదిగా ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు .రాబోవు ఖరీఫ్ సాగు తొలకరి లోపు ఈ ప్రక్రియ ముగుంచుకుని రైతులకు నూతన మార్కెట్ ఆధారిత వ్యవసాయ పరిజ్ఞానమును అందించి వారిని కార్యోన్ముఖులను చేసే దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. డాక్టర్ నసరుద్దీన్ మాట్లాడుతూ ఆముదం సాగులో మొక్కల సాంద్రత ముఖ్యమని వరసలు మరియు మొక్కల మధ్య విత్తే దూరం 90×60 సెంటీమీటర్ల లేదా 120×45 సెంటీమీటర్ల వుండటం ద్వారా 14000 నుండి 18000 ల మొక్కలు ఒక హెక్టార్ లో వుండి,దిగుబడులు ఎక్కువుగా వస్తాయని ,కానీ రైతులు 240×30 సెంటీమీటర్ల విత్తే దూరం పాటించి దిగుబడులు తగ్గించుకుంటున్నారని తెలిపారు. అనంతపురం పరిశోధన స్థానం మిని ట్రాక్టర్ తో అంతరకృషి చేసుకునే విధముగా హై క్లియరెన్స్ ట్రాక్టర్ టైర్ సాధనాలను ప్రవేశపెట్టిందని ,తద్వారా మొక్కలు ఎక్కువ ఎత్తుకు ఎదిగినా ,అంతరకృషికి ఇబ్బంది ఉండదని,ఆముదం మొక్కలకు ఎటువంటి నష్టం కలగదని తెలిపారు.ఆముదం లో అంతరపంటగా కంది ,వేరుశనగ మరియు సజ్జ లాభదాయకంగా వున్నాయని తెలిపారు. కమిషనర్ కార్యాలయ వ్యవసాయ ఉప సంచాలకులు బాలు నాయక్ వందన సమర్పణ చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *