Breaking News

ప్రజా సమస్యల పరిష్కార వేదిక జనవాణి

-జనవాణి అర్జీల పరిష్కారం దిశగా మంత్రి కందుల దుర్గేష్ అడుగులు
-నిడదవోలు కార్యాలయంలో ప్రజల నుండి నేరుగా దరఖాస్తులను స్వీకరించి పరిశీలించిన మంత్రి కందుల దుర్గేష్

నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త :
జనవాణి కార్యక్రమంలో భాగంగా నిడదవోలు పట్టణంలోని కార్యాలయంలో మంత్రి కందుల దుర్గేష్ వివిధ సమస్యలతో వచ్చిన ప్రజల నుండి నేరుగా దరఖాస్తులు స్వీకరించారు. శనివారం సంబంధిత అర్జీదారులతో మంత్రి దుర్గేష్ ప్రత్యక్షంగా మాట్లాడి అర్జీలను పరిశీలించారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను పరిశీలించిన అనంతరం తమ దృష్టికి వచ్చిన సమస్య ఏదైనా సంబంధింత శాఖల అధికారులతో మాట్లాడి సత్వర పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజా ప్రతినిధులుగా తామున్నదే ప్రజల సమస్యలు పరిష్కరించడం కోసమని మంత్రి అన్నారు. ఈ సందర్భంగా జనవాణిలో అర్జీ పెట్టుకుంటే సమస్యకు పరిష్కారం దొరుకుతుందన్న ధీమాతో వచ్చామని అర్జీదారులు అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *