రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
స్థానిక జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయము నందు ప్రతినెల మూడవ శనివారం జరిగే స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని కార్యాలయము సిబ్బందితో కలిసి నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పరిసరాల్లో ఉన్న చెత్తాచెదరం వంటి వాటిని పోగులుగా పెట్టి కాల్చివేయడం కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటడం మరుగుదొడ్లను శుభ్రపరచడం వంటి కార్యక్రమాలను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.
ఇందులో భాగంగా జిల్లాలో ఉన్న 31 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మరియు 15 పట్టణ ఆరోగ్య కేంద్రాలలో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేపట్టడం జరిగిందన్నారు. జిల్లాలో ఉన్న అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పారిశుద్ధ్య పనులను సంబంధిత యాప్ లో అప్లోడ్ చేయడం కూడా జరిగింది. ప్లాస్టిక్ నిషేధించడం ప్లాస్టిక్ వ్యర్ధాలను సరైన పద్ధతిలో రీసైకిలింగ్ చేయడంపై ప్రధానంగా అవగాహనా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సిబ్బంది అందరితోపాటు స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞను చేయించి కార్యాలయంలో ఉన్న అన్ని విభాగాలకు విడివిడిగా కొన్ని కొన్ని ఏరియాలను వారికి అప్పజెప్పి వాటి పర్యవేక్షణ తదితర సెక్షన్స్ వారు నిర్వహించవలసిందిగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా నోడల్ అధికారి జే .సంధ్య, కార్యాల సిబ్బంది, ఆశాలు తదితరులు పాల్గొనడం జరిగింది.
Prajavartha Online Telugu News