Breaking News

గోపాలపురం మండలం పెద్ద గూడెం గ్రామంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

-స్టోరేజ్ ట్యాంకులను తప్పని సరిగా క్లోరినేషన్ చేయ్యాలి
-ఎప్పటికప్పుడు నీటి నమూనాలను సేకరించి ల్యాబ్ కు పంపాలి
-గ్రామంలో డయేరియా కేసులు పూర్తిగా అదుపులోకి వొచ్చాయి
-వడగాడ్పుల దృష్ట్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
-మండల స్థాయి అధికారులు, ప్రత్యేక అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి తనిఖీలు చేపట్టాలి
-కలెక్టర్ పి ప్రశాంతి

గోపాలపురం, నేటి పత్రిక ప్రజావార్త :
గురువారం సాయంత్రం జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి గోపాలపురం మండలం పెద్దగూడెం గ్రామంలో ఆకస్మికంగా పర్యటించి అక్కడ ఆర్డబ్ల్యూఎస్ ద్వారా గ్రామపంచాయతీలో తాగునీటి సరఫరా చేస్తున్న వ్యవస్థను పరిశీలించారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ వాతావరణ మార్పులు, రానున్న రోజుల్లో వడగాల్పుల తీవ్రత దృష్ట్యా ప్రజలకు శుద్ధిచేసిన త్రాగునీటిని సరఫరా చేయాల్సి ఉందన్నారు. ఈ గ్రామంలో డయేరియా కేసులు నమోదు కావడం నేపధ్యంలో ఎటువంటి నిర్లిప్తతకి అవకాశం లేకుండా శుద్ధి చేసిన త్రాగునీరు సరఫరా చేయాల్సి ఉందన్నారు. ఇక్కడ సేకరించిన నీటి నమూనాలు ల్యాబ్ పంపించి పరీక్షించడం జరిగిందన్నారు. వాటర్ ట్యాంకుల క్లోరినేషన్ చేయడం ద్వారా స్వచ్ఛమైన త్రాగునీరు నిరంతర ప్రజలకూ అందించడం సాధ్యం అవుతుందని తెలిపారు. స్టోరేజ్ ట్యాంకుల పై మూతలు ఉంచడం, నీటి నమూనాలను సేకరించి ల్యాబ్ లకు పంపించి పరీక్షించడం జరగాలని, గ్రామంలో శానిటేషన్ తీరును మరింత మెరుగైన రీతిలో నిర్వహించడం తో పాటు గ్రామస్థులకు అవగాహాన కల్పించడం ముఖ్యం అన్నారు. ప్రస్తుతం గ్రామం లో డయేరియా పూర్తి అదుపులో ఉందన్నారు. వేసవి దృష్ట్యా కాచి చల్లార్చిన నీటిని త్రాగడం, ఎండల తీవ్రత దృష్ట్యా ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయట తిరగకుండా ఉండాలనీ, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకి వెళ్లడం, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. మండల స్థాయి అధికారులు, ప్రత్యేక అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి తనిఖీలు చేపట్టాలనీ ఆదేశించారు.  కలెక్టర్ వెంట మెడికల్ ఆఫీసర్ టి రాజీవ్, ఆర్డబ్ల్యూఎస్ డిప్యూటి ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ జి టీవీ అజయ్ బాబు, ఏ ఈ బంగారయ్య, గ్రామ కార్యదర్శి వి అనురాధ, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : కొమొరిన్ నుండి కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా మధ్యప్రదేశ్ వరకు సముద్ర మట్టానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *