Breaking News

జిల్లా సమగ్రాభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకం..

-ఉద్యోగులు, అధికారుల సమన్వయంతో జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేద్దాం..
-జిల్లా కలెక్టర్‌ డా.జి. లక్ష్మీశ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా సమగ్రాభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకమని ఉద్యోగులు, అధికారుల సమన్వయంతో జిల్లాను అన్ని రంగాలలో అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేసి ప్రభుత్వ లక్ష్యాలు నేరవేర్చాడంలో భాగస్వామ్యులము అవుదామని జిల్లా కలెక్టర్‌ డా.జి. లక్ష్మీశ అన్నారు.

ఏపిఎన్‌జివో అసోసియేషన్‌ ఎన్‌టిఆర్‌ జిల్లా విజయవాడ నగర కార్యవర్గ సభ్యులు బుధవారం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్‌ డా. జి. లక్ష్మీశను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల జిల్లా శాఖకు నిర్వహించిన ఎన్నికలలో నూతనంగా ఎన్నికైన జిల్లా అధ్యక్షులు డి. సత్యానారాయణరెడ్డి, సహా అధ్యక్షులు వి.వి. ప్రసాద్‌, కార్యదర్శి పి. రమేష్‌లకు జిల్లా కలెక్టర్‌ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లా ను అభివృద్ధి పదంలో అగ్రగామిక నిలపడంలో ఉద్యోగుల సహకారం ఎంతో కీలమైనదన్నారు. సంక్షేమానికి అభివృద్ధికి సమప్రాధాన్యతనిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని నేరవేర్చాడంలో ఉద్యోగుల భాగస్వామ్యం కీలకమన్నారు. జిల్లా యంత్రాంగం ఉద్యోగులకు అప్పగించిన లక్ష్యాలను సాధించడంలో మరింత కృషి చేయాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలను ప్రజలకు చేరువ చేయడంలో ఉద్యోగులు ప్రత్యేక శ్రద్ద పెట్టాలన్నారు. ఉద్యోగులు పారదర్శకమైన సేవలను అందించి జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి పదంలో నిలిపేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ డా. జి. లక్ష్మీశ కోరారు. అనంతరం నూతర కార్యవర్గ సభ్యులను జిల్లా కలెక్టర్‌ డా. జి. లక్ష్మీశ సత్కరించి అభినందనలు తెలిపారు.

ఏపిఎన్‌జివో ఎన్‌టిఆర్‌ జిల్లా నూతన అధ్యక్షులు డి. సత్యనారయణ రెడ్డి మాట్లాడుతూ ప్రజా రంజక పాలన అందించడంలో వినూత్నశైలిని అవలంభిస్తూ రాష్ట్రంలోనే ఎన్‌టిఆర్‌ జిల్లాను మార్గదర్శకంగా నిలిపేందుకు కృషి చేస్తున్న జిల్లా యాంత్రాంగానికి అన్ని విధాలుగా సహకరించేందుకు ఉద్యోగులు సిద్దంగా ఉంటారన్నారు. ప్రజా కలెక్టర్‌గా సామాన్య ప్రజల సమస్యలను ఓర్పుగా విని, స్వయంగా పరిష్కార మార్గాన్ని చూపుతూ కింది స్థాయి అధికారులకు సూచించి పరిష్కరిస్తున్న తీరు ఆయా వర్గాల ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తున్న ఉద్యోగులను వెన్ను తట్టి ప్రోత్సహించడం ఉద్యోగులు మరింత ఉత్సహాంగా పనిచేయుటకు దోహదపడుతుందన్నారు. ప్రజలకు సేవలందించడంలో జిల్లాకు చెందిన ఉద్యోగులకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. దైనందిక విధులతో పాటు జిల్లా యంత్రాంగం నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అంకిత భావంతో సేవలు అందిస్తామన్నారు.

జిల్లా కలెక్టర్‌ని మార్యాదపూర్వకంగా కలిసిన వారిలో జిల్లా నూతన అధ్యక్షలు డి. సత్యనారాయణరెడ్డి, సహా అధ్యక్షలు వి.వి. ప్రసాద్‌, కార్యదర్శి పి. రమేష్‌, జల్లా కార్యవర్గ సభ్యులు బి. సతీష్‌ కుమార్‌, డి. విశ్వనాథ్‌, జి.రామకృష్ణ, బివి రమణ, వి. నాగార్జున నగర కార్యవర్గ సభ్యులు కె. శివలీల, సివిఆర్‌ ప్రసాద్‌, ఎస్‌కె నజీర్‌ ఉద్ధీన్‌, యం. శ్రీనివాసరావు, కాశీమ్‌ సాహేబ్‌, రాంబాబు, విజయశ్రీ, జి. వరప్రసాద్‌, టి.విద్యాసాగర్‌, కేశర గణేష్‌, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *