Breaking News

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి  డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ మినిస్ట్రీయల్ & ఆల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ 134వ జయంతి కార్యక్రము వేడుకలు జరిగినది. ముందుగా ముఖ్యఅతిథి అడిషనల్ కమిషనర్ (జి )  చంద్రశేఖర్ చే డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్  చిత్రపటాని పూలమాల వేసి నివాళులర్పించినారు. ఆయన మాట్లాడుతూ అంటరానితనాన్ని అణిచివేయాలని అంతులేని కృషిచేసిన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి  డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించిన అసోసియేషన్ వారికి అధికారులకు, సిబ్బందికి హృదయపూర్వక అభినందనలు తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో చీప్ ఇంజనీర్ శ్రీధర్ రెడ్డి, చీఫ్ మెడికల్ ఆఫీసర్  గోపాల్ నాయక్, వెటర్నరీ డాక్టర్ సోమశేఖర్ రెడ్డి, మేనేజర్ ఏ.యు.బి.శర్మ, సి సెక్షన్ సూపరింటెండెంట్ శ్రీహరి కృష్ణ, పి. ఎస్. భగవాన్, అసోసియేషన్ ప్రెసిడెంట్ దారా రాంబాబు, జనరల్ సెక్రెటరీ ఎస్వీఎస్ చలంగారు,చీప్ అడ్వైజర్ వి.ఎం.వి.రమణారెడ్డి, జాయింట్ సెక్రెటరీ తుపాకుల ప్రతాప్, ట్రెజరర్ సదల నాగరాజు, వైస్ ప్రెసిడెంట్ ఎస్ వి ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ మెంబెర్స్ గుర్రం వెంకటేశ్వరరావు, ఎల్ శివ నాగ కిరణ్, వి గోపాలకృష్ణ, బి రాజేంద్ర చేతన్ తదితరులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *