Breaking News

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సేవలో అనిర్వచనీయం

-విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సేవలు అనిర్విచనియంమని విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి అన్నారు. ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ వద్ద అంబేద్కర్ జయంతి సందర్భంగా పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, భారత రాజ్యాంగ నిర్మాత డా. బి. ఆర్. అంబేద్కర్ తన జీవితాన్ని సామాజిక సమానత్వానికి అంకితం చేసిన మహానుభావుడు అని అన్నారు. అంబేద్కర్  ఆశయాలను పాటించాల్సిన అవసరం నేటి సమాజానికి ఎంతో ఉందని మేయర్ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికి సమానహక్కులు కల్పించేలా రాజ్యాంగాన్ని రూపొందించిన ఆయన సేవలు అనిర్వచనీయమని తెలిపారు. యువత అంబేద్కర్  ఆలోచనలను అనుసరించి సమాజంలో సమానత్వాన్ని ప్రోత్సహించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఆయన చూపిన మార్గంలో నడిచి సమాజాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో వైసీపి ఫ్లోర్ లీడర్ వెంకట సత్యం, కార్పొరేటర్ చైతన్య రెడ్డి, అడిషనల్ కమిషనర్ ప్రాజెక్ట్స్ డాక్టర్ డి చంద్రశేఖర్, చీఫ్ సిటీ ప్లానర్ సంజయ్ రత్నకుమార్, సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *