Breaking News

భారతీయ జనతా పార్టీ డివిజన్ కార్యాలయం ప్రారంభం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కుద్దుస్ నగర్ లో ఏర్పాటు చేసిన భారతీయ జనతా పార్టీ 34వ డివిజన్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే సుజనా చౌదరి సోమవారం ప్రారంభించారు. ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ బీజేపీ నేతలతో కలిసి రిబ్బన్ కట్ చేశారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ iజనతా పార్టీ ఆధ్వర్యంలో చేస్తున్న పనులు లక్ష్యాలను ప్రతి ఇంటికి చేర్చడానికి అంకితభావంతో కార్యకర్తలకు కృషి చేయాలి అన్నారు. ప్రతి ఒక్కరికి ఎన్డీఏ కార్యాలయం అందుబాటులో ఉంటుందన్నారు. కార్యక్రమంలో 34 వ డివిజన్ బీజేపీ మండల అధ్యక్షులు లెవిన్ బాబు, డివిజన్ ప్రెసిడెంట్ రుద్రపాటి వెంకటేష్ గడ్డం సాంబ, పైలా సురేష్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *