-డిఎంఇని ఆదేశించిన మంత్రి సత్యకుమార్ యాదవ్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ ప్రభుత్వ సిద్దార్ధ మెడికల్ కాలేజీలో ఎంబిబియస్ సప్లిమెంటరీ పరీక్షల్లో కాపీయింగ్ జరిగిన ఘటన పట్ల వైద్య,ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆగ్రహం, ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి లోతైన విచారణ జరిపి సమగ్రమైన నివేదికను అందజేయాలని డిఎంఇ డాక్టర్ నరసింహంను మంత్రి ఆదేశించారు. ఈ ఘటనకు దారితీసిన వ్యవస్థాగత, వ్యక్తిగత లోపాలపై దృష్టి సారించి, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యల్ని తీసుకునే దిశగా నివేదిక ఉండాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు.
Prajavartha Online Telugu News