-ప్రైవేట్ రంగంలో ఇది ఐదో కళాశాల
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆయుష్ వైద్య విధానాలను ప్రాచుర్యంలోకి తీసుకొచ్చేందుకు కేంద్రంలో మరియు ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్‌డిఎ ప్రభుత్వాలు ప్రాధాన్యతనిస్తున్న నేపథ్యంలో చిత్తూరు జిల్లాకు కొత్త ప్రైవేట్ హోమియోపతి కళాశాల మంజూరయ్యింది. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు హోమియోపతి కళాశాలలు మాత్రమే ఉన్నాయి.
చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం ముత్తిరేవుల గ్రామంలో శ్రీనివాస ఎడ్యుకేషన్ సొసైటీ ద్వారా హోమియోపతి కళాశాల ఏర్పాటుకు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ ఆమోదం తెలిపారు. వెంకటేశ్వర హోమియోపతి మెడికల్ కాలేజ్ మరియు హాస్పిటల్ పేరుతో కొత్త ప్రైవేట్ కళాశాలలో ప్రతి సంవత్సరం 100 మంది విద్యార్థులను చేర్చుకుంటారు. సొసైటీలో ఇప్పటికే 50 పడకల ఆసుపత్రి ఉంది. అవసరమైన మౌలిక సదుపాయాలు మరియు ఇతర సౌకర్యాల లభ్యతను సవివరంగా పరిశీలించిన తర్వాత మంత్రి ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు.
ఇప్పటి వరకు రాష్ట్రంలో 7 హోమియోపతి కళాశాలలున్నాయి. ఐదున్నరేళ్ల బిహెచ్ ఎంఎస్( BHMS) కోర్సులలో ఏడాదికి 500 మంది అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు జాయిన్ అవుతున్నారు. వీటిలో గుడివాడ, రాజమండ్రి, కడపలోని 3 ప్రభుత్వ హోమియోపతి కళాశాలల్లో ఏడాదికి 120 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందుతున్నారు. ప్రస్తుతం గుంతకల్లు, తిరుపతి, తాడేపల్లెగూడెం, విజయనగరంలో ఉన్న నాలుగు ప్రైవేట్ హోమియోపతి మెడికల్ కాలేజీలు యూజీ ప్రోగ్రామ్‌లో ఏడాదికి 400 మంది విద్యార్థులను చేర్చుకుంటున్నాయి.
ప్రస్తుతమున్న ప్రతి హోమియోపతి కళాశాలలో రోజూ దాదాపు 250 మంది రోగులు అవుట్ పేషెంట్ (OP) సేవల్ని,
15 మంది రోగులు ఇన్ పేషెంట్ (IP) సేవల్ని పొందుతున్నారు.
Prajavartha Online Telugu News