-విజయవాడ నగరపాలక సంస్థ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శాఖలన్ని సమన్వయంతో పని చేస్తేనే విజయవాడ నగరం పరిశుభ్రంగా ఉంటుందని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. శుక్రవారం ఉదయం తన పర్యటనలో భాగంగా క్రాంబే రోడ్, బైపాస్ రోడ్, సితార రోడ్, అంబేద్కర్ రోడ్, సివిఆర్ ఫ్లైఓవర్, జక్కంపూడి ప్రాంతాలని పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజారోగ్యం, పట్టణ ప్రణాళిక, ఇంజనీరింగ్, ఉద్యానవనం శాఖల మధ్య సమన్వయం కచ్చితంగా ఉండాలని ఒకరితో ఒకరు సమస్యను చర్చించి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పారిశుధ్య నిర్వహణ సక్రమంగా జరిపించాలని, శానిటరీ సెక్రెటరీలు నిర్మాణ వ్యర్ధాలు ఎక్కడైనా కనిపించినచో వెంటనే ప్లానింగ్ సెక్రెటరీ సమన్వయంతో వ్యర్ధాలను తొలగించాలని, అలా ప్రతి శాఖతో సమన్వయం పరచుకొని శానిటరీ సెక్రటరీలు ఎక్కడ వ్యర్ధాలు ఉన్న రోడ్డుపైన నిలవకుండా చూసుకోవాలని అన్నారు. పారిశుధ్య సిబ్బందితో సమన్వయంతో ప్రతిరోజు రోడ్లు పరిశుభ్రంగా ఉంచాలని అంతర్గత రోడ్లలో ఎటువంటి నిర్లక్ష్యం లేకుండా పరిశుభ్రపరచాలని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలని కమిషనర్ అధికారులను ఆదేసించారు.
Prajavartha Online Telugu News